ఎల్.సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎల్.సుబ్రహ్మణ్యం
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంలక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం
జననం (1947-07-23) 1947 జూలై 23 (వయసు 76)
మద్రాసు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా
(ప్రస్తుతం చెన్నై, తమిళనాడు, భారతదేశం)
సంగీత శైలిశాస్త్రీయ, కర్ణాటక, జాజ్, పాశ్చాత్య సంగీతం
వృత్తివాయులీన విద్వాంసుడు, స్వరకర్త, సంగీత గురువు
వాయిద్యాలువయోలిన్, గాత్రము, అవనద్ధ వాయిద్యాలు
క్రియాశీల కాలం1973–ప్రస్తుతం

లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఒక భారతీయ వాయులీన విద్వాంసుడు, స్వరకర్త. ఇతడు కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోను, పాశ్చాత్య సంగీతంలోను శిక్షణ తీసుకున్నాడు.

ఆరంభ జీవితం[మార్చు]

ఇతడు మద్రాసు నగరంలో 1947, జూలై 23వ తేదీన వి.లక్ష్మీనారాయణ అయ్యర్, సీతాలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ఇరువురూ సంగీత విద్వాంసులే.[1]

ఇతడు బాల్యంలో జాఫ్నాలో నివసించాడు. తన 5వ యేటి నుండి తన తండ్రి వి.లక్ష్మీనారాయణ వద్ద సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు.[2] ఇతడు తన మొదటి కచేరీ తన 6వ యేట ఇచ్చాడు. ఇతని బాబాయిలు రామనాథ్ రాఘవన్, రామనాథ్ కృష్ణన్,[3] సోదరులు ఎల్.శంకర్, ఎల్.వైద్యనాథన్ అందరూ సంగీత విద్వాంసులే.[4] ఇతడు తన సోదరులు ఇరువురితో కలిసి ఆల్బమ్‌లు విడుదల చేశాడు.

ఇతడు మద్రాసు వైద్య కళాశాలలో ఎం.బి.బి.ఎస్. చదివాడు. ఇతడు పూర్తిస్థాయి సంగీత కళాకారుడు కాకమునుపు వైద్యాన్ని ప్రాక్టీసు చేశాడు.[2] ఇతడు కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యూజిక్‌ నుండి పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో మాస్టర్స్ డిగ్రీ పొందాడు.[2]

వృత్తి[మార్చు]

యెహూది మెనూహిన్, స్టీఫెన్ గ్రాప్పెల్లి లతో ఎల్.సుబ్రహ్మణ్యం

1973 నుండి ఇతడు 200లకు పైగా సి.డి.లను, కేసెట్లను విడుదల చేశాడు. వాటిలో సోలో ఆల్బమ్‌లతో పాటు యెహుది మెనుహిన్, స్టీఫెన్ గ్రాప్పెల్లి, రగ్గీరో రిక్కి, జీన్ పియరీ రాంపాల్, హెర్బీ హాన్‌కాక్, జో శాంపుల్, జీన్ లక్ పాంటి, స్టాన్లీ క్లార్క్, జాన్ హ్యాండీ, జార్జ్ హారిసన్ మొదలైన అంతర్జాతీయ కళాకారులతో కలిసి ఆల్బమ్‌లను విడుదల చేశాడు.[5][6]

ఇతడు వేదికలపై చెంబై వైద్యనాథ భాగవతార్, కె.వి.నారాయణస్వామి, శ్రీపాద పినాకపాణి, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎం.డి.రామనాథన్, పాల్గాట్ మణి అయ్యర్ వంటి కర్ణాటక సంగీత విద్వాంసుల కచేరీలకు వాద్య సహకారం అందించాడు.[6]

ఇతడు ఆర్కెస్ట్రాలకు, నృత్య నాటికలకు, హాలీవుడ్ సినిమాలకు రచనలు చేశాడు. "యూఫొనీ" వంటి సంగీత సంబంధమైన పుస్తకాలను రచించాడు.[6][7] ఇతడు ఎ.ఆర్.రెహమాన్ చెన్నై కోడంబాకంలో నడుపుతున్న కె.ఎం. మ్యూజిక్ కన్సర్వేటరీ అనే సంస్థకు సలహాదారుడిగా ఉన్నాడు. 2011లో ఇతడు ఐక్యరాజ్య సమితి నుండి కచేరీ చేయడానికి ఆహ్వానం అందింది. 2012 అక్టోబరు 24న ప్రత్యేక అతిథి కళాకారుడిగా స్టీవ్ వండర్‌తో కలిసి ఐక్యరాజ్య సమితిలో కచేరీ నిర్వహించాడు.

లక్ష్మీనారాయణ విశ్వ సంగీతోత్సవం[మార్చు]

2003లో ఒక కచేరీలో ఎల్.సుబ్రహ్మణ్యం

1992 నుండి ఇతడు తన తండ్రి పేరుమీద లక్ష్మీనారాయణ గ్లోబల్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను ప్రతి యేటా నిర్వహిస్తున్నాడు.[5] ఈ ఉత్సవాలలో ఇతని కుటుంబంలోని కళాకారులతో బాటు అల్ జరేవ్, జార్జ్ డ్యూక్, సోలో సిస్సోఖో, మియా మసౌకా, మార్క్ ఓ కానర్, లోక్యో, జీన్ లక్ పాంటీ, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, లారీ కొర్యెల్, ఆర్వె టెల్లెఫ్సెన్, పండిట్ జస్రాజ్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, కార్కీ సీగెలో, ఓస్లో కామెరట, స్టాన్లీ క్లార్క్, ఎర్ల్ క్లగ్, రావి కోల్ట్రెన్ మొదలైన కళాకారులు పాల్గొన్నారు.[8][9] ఈ ఉత్సవాలను భారతదేశంలోనే కాక న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్, పెర్త్ (ఆస్ట్రేలియా), ఎస్ప్లనేడ్ (సింగపూర్), సిటీ హాల్ పెనాంగ్, పుత్ర వరల్డ్ ట్రేడ్ సెంటర్ కౌలాలంపూర్ (మలేసియా) వంటి చోట్ల కూడా నిర్వహించాడు. ఈ ఉత్సవాలను "వయోలిన్స్ ఫర్ పీస్", "వయోలిన్స్ ఆఫ్ ఇండియా", "సౌండ్స్ ఆఫ్ ఇండియా" అనే ప్రత్యేక భావనలతో నిర్వహించాడు.[8]

సుబ్రహ్మణ్యం అకాడమీ ఆఫ్ పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్[మార్చు]

ఇతడు తన భార్యతో కలిసి "ది సుబ్రహ్మణ్యం ఫౌండేషన్" అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఈ సంస్థ తరఫున 2007లో బెంగళూరులో సుబ్రహ్మణ్యం అకాడమీ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్" (SAPA) అనే సంగీత పాఠశాలను ప్రారంభించాడు.[10]

2015లో కోల్‌కాతాలో ప్రదర్శన ఇస్తున్న సుబ్రహ్మణ్యం.


వ్యక్తిగత జీవితం[మార్చు]

ఇతడు పండిట్ రవిశంకర్ అన్న కూతురు విజయశ్రీ శంకర్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి జింజర్ శంకర్, బిందు సుబ్రహ్మణ్యం, నారాయణ సుబ్రహ్మణ్యం, అంబి సుబ్రహ్మణ్యం అనే నలుగురు సంతానం కలిగారు. ఈమె 1995 ఫిబ్రవరిన చనిపోయింది. తరువాత 1999లో ఇతడు గాయకురాలు కవితా కృష్ణమూర్తిని వివాహం చేసుకున్నాడు.

తన కుమారుడు అంబి సుబ్రహ్మణ్యంతో కలిసి కచేరీ చేస్తున్న ఎల్.సుబ్రహ్మణ్యం

ఇతడు తన కుమార్తె గాయని, రచయిత్రి బిందు సుబ్రహ్మణ్యంతో,[11]తన కుమారుడు అంబి సుబ్రహ్మణ్యంతో,[12] కవితా కృష్ణమూర్తితో కలిసి అనేక కచేరీలు చేశాడు. వీరి భాగస్వామ్యాన్ని "సుబ్రహ్మణ్యం ఘరానా" అని సరదాగా అంటారు.[13] ఇతడు తన పెద్ద కుమారుడు నారాయణ సుబ్రహ్మణ్యంతో కూడా కలిసి సంగీత కార్యక్రమాలు చేశాడు.[14]

అవార్డులు, గుర్తింపులు[మార్చు]

 • భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం (2001)[15]
 • భారత ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారం (1988)
 • జైన్ విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో పి.హెచ్.డి. (2017)
 • ఐ.టి.ఎం.యూనివర్సిటీ, గ్వాలియర్ నుండి గౌరవ డి.లిట్ పట్టా (2016)
 • బెంగళూరు విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్ (2003)
 • సృజనాత్మక & ప్రయోజనాత్మక సంగీత విభాగంలో సంగీత నాటక అకాడమీ అవార్డు (1990)
 • లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి నుండి జీవిత సాఫల్య పురస్కారం (2012)
 • గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ (GiMA) వారి నుండి మూడు పురస్కారాలు (2010, 2012)
 • జియాలాల్ వసంత్ అవార్డు (2011)
 • బిగ్ స్టార్ ఐ.ఎం.ఎ.అవార్డు (2011)
 • సంగీతరత్న మైసూర్ టి.చౌడయ్య స్మారక అవార్డు (1996)
 • కంచి కామకోటి పీఠం వారిచే తంత్రీ నాదమణి (2009)
 • భారత్ కళాకార్, చెన్నై వారిచే విశ్వకళా భారతి (2004)
 • బెంగళూరు గాయన సమాజ వారిచే సంగీత కళారత్న (2004)
 • పర్కుసివ్ ఆర్ట్స్ సెంటర్, బెంగళూరు వారిచే సంగీత కళాశిరోమణి (2004)
 • కల్చరల్ సెంటర్ ఆఫ్ పర్పార్మింగ్ ఆర్ట్స్ వారిచే సంగీత సాగరం (1984)
 • భారత రాష్ట్రపతిచే ఆల్ ఇండియా రేడియో ఉత్తమ వయోలినిస్ట్ అవార్డు (1963)[16]
 • ఇస్కాన్ బెంగళూరు ఆస్థాన విద్వాంసుడు (2009)
 • ఇంకా నాద చక్రవర్తి, వయోలిన్ చక్రవర్తి మొదలైన బిరుదులు.

సినిమా రంగం[మార్చు]

ఇతడు మీరా నాయర్ నిర్మించిన సలాం బాంబే, మిసిసిపి మసాలా సినిమాలకు సంగీతం అందించాడు. ఇంకా లిటిల్ బుద్ధ, కాటన్ మేరీ సినిమాలలో వయోలిన్ వాద్యాన్ని వినిపించాడు.[6]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

సంగీత దర్శకుడు[మార్చు]

సోలోయిస్టు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Visionary Violinist". March 2001. Archived from the original on 19 అక్టోబరు 2018. Retrieved 13 January 2016.
 2. 2.0 2.1 2.2 "Artist: L. Subramaniam". Concord Music Group. March 1986. Retrieved 1 December 2007.
 3. "L Subramaniam- The doctor who became the international face of Carnatic violin". 2016-07-23. Retrieved 2016-09-07.
 4. "Music director L. Vaidyanathan dead". The Hindu. 20 May 2007. Archived from the original on 21 మే 2007. Retrieved 16 January 2014.
 5. 5.0 5.1 "Lakshminarayan Global Music Festival With L. Subramaniam". Chicago Reader.
 6. 6.0 6.1 6.2 6.3 "L. Subramaniam: Short Biography". Sampad. February 2005. Archived from the original on 27 September 2007. Retrieved 20 February 2007.
 7. "L. Subramaniam: Official Site". Official Site. Retrieved 20 February 2007.
 8. 8.0 8.1 Buzz Bureau. "A Fusion Of Unique Violin Styles — Buzzintown". buzzintown.com. Archived from the original on 3 April 2015. Retrieved 25 November 2012.
 9. "Buy online Indian and International CDs, LPs, Blu-rays, DVDs and VCDs — Rhythm House". rhythmhouse.in. Archived from the original on 3 April 2015. Retrieved 25 November 2012.
 10. "SaPa India – Subramaniam Academy of Performing Arts". sapaindia.com.
 11. "'Being L Subramaniam's daughter didn't help'". Rediff. 12 May 2011.
 12. "Violinist Dr. L. Subramaniam — Ambi Subramaniam — Kavita Krishnamurthy — Bangalore". mybangalore.com. Archived from the original on 31 October 2018. Retrieved 25 November 2012.
 13. "Article — Subramaniam gharana". timesofindia.com. Archived from the original on 2016-03-04. Retrieved 2021-04-23.
 14. "Narayana Subramaniam during TOI Crest experience musical program organized by The Times Of India at NCUI auditorium, Delhi". indiatimes.com.
 15. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved July 21, 2015.
 16. "L Subramaniam's Official Website". Retrieved 5 December 2012.
 17. Violinist L. Subramaniam Quit from the project, first he was selected to work as the music composer and completed recording songs for the project. However, before finishing his entire commitment for the film, he left the project fearing that his association with the film may offend Hindu people due to its contentious storyline. Ilayaraaja was subsequently selected to replace him and helped score music over the version recorded by Subramaniam and the songs of Subramaniam which are already shot/filmed. illayaraja had composed the music according to the lip movements in songs

బయటి లింకులు[మార్చు]