మీరా నాయర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీరా నాయర్
ఒరియా: ମୀରା ନାୟାର
జననం (1957-10-15) 1957 అక్టోబరు 15 (వయసు 66)
రూర్కెలా, ఒడిషా, భారతదేశం
విద్యహార్వర్డ్ విశ్వవిద్యాలయం మిరండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయం
వృత్తిసినిమా దర్శకురాలు, సినిమా నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం వరకు
జీవిత భాగస్వామిమిచ్ ఎప్స్టీన్ (విడాకులు తీసుకున్నారు)
మహమూద్ మందాని (1991–ప్రస్తుతం)
పిల్లలు1
పురస్కారాలుపద్మభూషణ్ (2012)

మీరా నాయర్ (జననం 15 అక్టోబర్ 1957) న్యూయార్క్ సిటీ లో నివసిస్తున్న భారతీయ సినిమా నిర్మాత, దర్శకురాలు.[1] ఆమె చిత్రనిర్మాణ సంస్థ మీరాబాయి ఫిలిమ్స్ భారతీయ సమాజం యొక్క సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక పార్శ్వాలను సినిమా మాధ్యమంలో అంతర్జాతీయ ప్రేక్షకులకు చూపడంలో ప్రత్యేకతను సంతరించుకుంది. ఈమె తీసిన సినిమాలలో మిసిసిపి మసాలా, ది నేమ్‌సేక్, మాన్సూన్ వెడ్డింగ్, సలాం బాంబే వంటివి ఉన్నాయి.

ఆరంభ జీవితం, విద్య

[మార్చు]

ఈమె 1957, అక్టోబరు 15న ఒడిషా రాష్ట్రంలోని రూర్కెలాలో అమృత్ నాయర్, ప్రవీణా నాయర్ దంపతులకు జన్మించింది. తన ఇద్దరు అన్నయ్యలు, తల్లిదండ్రులతో కలిసి ఈమె భువనేశ్వర్ లో జీవించింది.[2] ఈమె తండ్రి అమృత్ నాయర్ ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, తల్లి ప్రవీణ్ నాయర్ నిరక్షరాస్యులైన పిల్లల గురించి పనిచేసే ఒక సమాజసేవకురాలు.[3] ఈమె 11 యేళ్ళ వయసులో తండ్రి బదిలీ కారణంగా ఈమె కుటుంబం ఢిల్లీకి తరలి వెళ్లింది. తన 13వయేట ఈమె సిమ్లాలోని లోరెటో కాన్వెంటులో చేరింది. అక్కడ ఈమెకు ఆంగ్ల సాహిత్యం పట్ల మోజు ఏర్పడింది. తరువాత ఈమె మిరండా హౌస్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చేరి సోషియాలజీ చదివింది. అత్యుత్తమ విద్యను అభ్యసించడానికి ఈమె పశ్చిమ దేశాలలోని అనేక కళాశాలలకు దరఖాస్తు చేసుకున్నది. చివరకు ఈమెకు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపకార వేతనం లభించడంతో అక్కడ చేరింది.[4]

వృత్తి

[మార్చు]

డాక్యుమెంటరీలు

[మార్చు]

నిర్మాతగా మారక ముందు ఈమె నటనలో ఆసక్తిని కనబరచింది. బెంగాలీ రచయిత బాదల్ సర్కార్ నాటకాలలో నటించింది. హార్వర్డ్ యూనివర్సిటీలో ఈడిపస్ నాటకంలో జొకాస్టా పాత్రను నటించి బహుమతి కూడా పొందింది.[2]

ఈమె చిత్రనిర్మాణాన్ని వృత్తిగా చేపట్టిన తొలిదశలో భారతీయ సంస్కృతి ప్రతింబింబించే డాక్యుమెంటరీలను తీసింది. హార్వర్డ్ యూనివర్సిటీ చదువులో భాగంగా 1978 -1979ల మధ్య తన మొదటి డాక్యుమెంటరీ "జామా మస్జీద్ స్ట్రీట్ జర్నల్"ను నిర్మించింది. 18 నిమిషాల ఈ నలుపు - తెలుపు చిత్రంలో పాత ఢిల్లీ వీధులలోని సహజసిద్ధమైన సంభాషణలతో కూడిన సంఘటనలను చొప్పించింది[4]

1982లో రెండవ డాక్యుమెంటరీ "సో ఫార్ ఫ్రమ్‌ ఇండియా" ను తీసింది. 52 నిమిషాలు నిడివిగల ఈ చిత్రంలో న్యూయార్కులో నివసించే భారతీయ పత్రికా విలేఖరి కోసం గర్భవతి అయిన అతని భార్య ఇంటిలో ఎదురుచూడడాన్ని చిత్రించింది[3] ఇది అమెరికన్ ఫిలిం ఫెస్టివల్ లోను, న్యూయార్క్ గ్లోబల్ విలేజ్ ఫిలిం ఫెస్టవల్ లోను ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపికయ్యింది.[4]

ఇక 1984లో విడుదలైన మూడవ డాక్యుమెంటరీ "ఇండియా క్యాబరెట్" అనేక విమర్శలకు, వివాదాలకు తెరలేపింది. ఈ చిత్రంలో బొంబాయిలోని క్యాబరే డ్యాన్సర్ల జీవితాలను చూపించింది.[4]

ఈమె తన చివరి డాక్యుమెంటరీ చిత్రాన్ని ఒక కెనడియన్ టెలివిజన్‌కు తీసింది. ఇది కూడా వివాదాలను, విమర్శలను మూటగట్టుకుంది. 1987లో నిర్మించడిన "చిల్డ్రన్ ఆఫ్ ఎ డిసైర్డ్ సెక్స్" అనే ఈ చిత్రంలో ఆడ శిశువులను గర్భంలోనే ఎలా చిదిమివేసేది, మగశిశువుల కోసం సమాజం ఎలా తపన పడేది చూపించబడింది.

కథా చిత్రాలు

[మార్చు]

డాక్యుమెంటరీ చిత్రాల నుండి తప్పుకున్న తరువాత ఈమె తన పాత స్నేహితురాలు సూని తారాపూర్‌వాలాతో కలిసి సలాం బాంబే చిత్రాన్ని తయారు చేసే పనిలో పడింది. ఐదు సంవత్సరాల తరువాత ఈ చిత్రం 1988లో విడుదలయ్యింది. ఈ చిత్రంలో వీధి పిల్లల బతుకులను వారు కోల్పోతున్న బాల్యాన్ని వాస్తవిక దృష్టితో చూపించింది.[2] ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా విజయవంతం కాకపోయినా 23 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది.[5]

సలాం బాంబే విజయం తరువాత ఈమె 1991లో ఉగాండాలో పుట్టిన భారతీయుల కథను మిసిసిపి మసాలా చిత్రంలో చూపించింది.[3] సలాం బాంబే మాదిరిగా ఈ సినిమాకూడా పలు అవార్డులను కైవశం చేసుకుంది.[4]

తరువాత ఈమె మాన్‌సూన్ వెడ్డింగ్, హిస్టీరికల్ బ్లైండ్‌నెస్, ది నేమ్‌సేక్, అమీలియా, ది రిలక్టంట్ ఫండమెంటలిస్ట్ మొదలైన అనేక సినిమాలను నిర్మించింది.

ఇతర కార్యకలాపాలు

[మార్చు]

ఈమె తూర్పు ఆఫ్రికా దేశాలలోని యువ దర్శకులకు శిక్షణ ఇవ్వడానికి 2005 నుండి ఉగాండా దేశంలోని కంపాలా నగరంలో మైషా ఫిలిం లాబ్‌ను ఏర్పాటు చేసింది. "మన కథలను మనమే చెప్పుకోక పోతే ఇంకెవ్వరూ చెప్పరు" అనే మూల సూత్రంతో ఈ సంస్థ 2005 నుండి అనేక మంది యువ దర్శకులకు లాభాపేక్ష లేకుండా శిక్షణను ఇస్తున్నది[ఆధారం చూపాలి]

ఈమె 1998లో "సలాం బాంబే" సినిమాతో వచ్చిన లాభాలతో వీధి బాలల సంక్షేమానికి "సలాం బాలక్ ట్రస్ట్" ను ప్రారంభించింది.[ఆధారం చూపాలి]

ఈమె ప్రస్తుతం న్యూయార్క్ సిటీలో నివసిస్తున్నది. అక్కడ కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లోని ఫిలిం డివిజన్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నది. ఈ విశ్వావిద్యాలయం, ఈమెకు చెందిన మైషా ఫిలిం లాబ్‌ సహకారంతో అంతర్జాతీయ విద్యార్థులు కలిసి పనిచేయడానికి, చిత్ర నిర్మాణంలో వారి అభిరుచులను పంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఈమె 1977లో తన మొదటి భర్త మిట్చ్ ఎప్‌స్టీన్‌ను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఫోటోగ్రఫీ తరగతులలో కలిసింది. ఈ జంట 1987లో విడిపోయింది.[2] ఈమె ఉగాండాలో "మిసిసిపి మసాలా" సినిమాకోసం పనిచేస్తున్నప్పుడు తన రెండవ భర్త మహమూద్ మందానిని తొలిసారి కలిసింది. వీరికి 1991లో జోహ్రాన్ అనే కుమారుడు కలిగాడు. ఇతడు తన భార్య వలె కొలంబియా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెబుతాడు.[3]

రాజకీయ దృక్పథం

[మార్చు]

పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ వైఖరికి నిరసనగా ఈమె 2013 జూలైలో హైఫా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వచ్చిన ఆహ్వానాన్ని తోసిపుచ్చింది.[7]

చిత్ర సమాహారం

[మార్చు]
  • జామా స్ట్రీట్ మస్జీద్ జర్నల్ (1979)
  • సో ఫార్ ఫ్రం ఇండియా (1982)
  • ఇండియా కాబరెట్ (1985)
  • చిల్డ్రన్ ఆఫ్ ఎ డిజైర్డ్ సెక్స్ (1987)
  • సలాం బాంబే (1988)[8]
  • మిసిసిపి మసాలా (1991)[8]
  • ది డే ద మెర్సిడిస్ బికేమ్‌ అ హ్యాట్ (1993)
  • ది పెరెజ్ ఫ్యామిలీ (1995)[8]
  • కామసూత్ర: ఎ టేల్ ఆఫ్ లవ్ (1996)[8]
  • మై ఓన్ కంట్రీ (1998)
  • మాన్సూన్ వెడ్డింగ్ (2001)[8]
  • హిస్టీరికల్ బ్లైండ్‌నెస్ (2002)
  • 11'9"01 సెప్టెంబర్ 11 (2002)
  • స్టిల్, ది చిల్డ్రన్ ఆర్ హియర్ (2003)
  • వ్యానిటీ ఫెయిర్ (2004)[8]
  • ది నేమ్‌సేక్ (2006)[8]
  • మైగ్రేషన్.. (2007)[9]
  • న్యూయార్క్, ఐ లవ్ యూ (2009)[10]
  • 8 (2008)[11]
  • అమీలియా (2009)[8]
  • ది రిలక్టంట్ ఫండమెంటలిస్ట్ (2012)
  • వర్డ్స్ విత్ గాడ్స్ (2014)
  • ది బెంగాలీ డిటెక్టివ్ (2015)
  • క్వీన్ ఆఫ్ కాట్వే (2016)

పురస్కారాలు

[మార్చు]
జంజిబర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌,2013లో ప్రసంగిస్తున్న మీరా నాయర్

ఈమెకు ఇండియా అబ్రాడ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ -2007 పురస్కారం లభించింది.[12] 2012లో ఈమెకు భారత మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ అప్పటి భారత రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ప్రదానం చేయబడింది.[13]

గెలుపొందినవి

[మార్చు]
  • 1985: గ్లోబల్ విలేజ్ ఫిలిం ఫెస్టివల్ - ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం ఇండియా క్యాబరెట్
  • 1986: ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - గోల్డెన్ అథెనా ఇండియా క్యాబరెట్
  • 1986: అమెరికన్ ఫిలిం ఫెస్టివల్ - బ్లూ రిబ్బన్ ఇండియా క్యాబరెట్
  • 1988: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ - ఆడియన్స్ అవార్డ్ సలాం బాంబే
  • 1988: కేన్స్ ఫిలిం ఫెస్టివల్ - గోల్డెన్ కెమెరా (ఉత్తమ తొలి చిత్రం) సలాం బాంబే
  • 1988: జాతీయ ఉత్తమ హిందీ చలనచిత్రంసలాం బాంబే[14]
  • 1988: నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డు - ఉత్తమ విదేశీ చిత్రం సలాం బాంబే
  • 1988: మాంట్రియల్ వరల్డ్ ఫిలిం ఫెస్టివల్ - అత్యంత జనరంజక సినిమా, జ్యూరీ బహుమతి సలాం బాంబే
  • 1988: లాస్ ఏంజెల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ - న్యూ జనరేషన్ అవార్డ్ సలాం బాంబే
  • 1988: లిలియన్ గిష్ అవార్డ్ సలాం బాంబే
  • 1991: వెనీస్ ఫిలిం ఫెస్టివల్ - గోల్డెన్ ఒసెల్లా (ఉత్తమ స్క్రీన్ ప్లే) సూని తారాపూర్‌వాలాతో కలిసి మిసిసిపి మసాలా [15]
  • 1991: సావొ పాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - క్రిటిక్స్ స్పెషల్ అవార్డ్మిసిసిపి మసాలా
  • 1992: ఇటాలియన్ నేషనల్ సిండికేట్ ఆఫ్ ఫిలిం జర్నలిస్ట్స్ అవార్డ్ - ఉత్తమ దర్శకుడూ (విదేశీ సినిమా) మిసిసిపి మసాలా
  • 1992: ఏషియన్ అమెరికన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - ఏషియన్ మీడియా అవార్డు మిసిసిపి మసాలా
  • 1993: ఇండిపెండెంట్ స్పిరిట్ అవార్డ్ మిసిసిపి మసాలా
  • 2001: వెనీస్ ఫిలిం ఫెస్టివల్ - గోల్డన్ లయన్ (ఉత్తమ చిత్రం) మాన్సూన్ వెడ్డింగ్
  • 2001: వెనీస్ ఫిలిం ఫెస్టివల్ - మాజిక్ లాటర్న్ ప్రైజ్ మాన్సూన్ వెడ్డింగ్
  • 2002: కాంబెర్రా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆడియన్స్ అవార్డ్ మాన్సూన్ వెడ్డింగ్
  • 2002: జీ సినిమా అవార్డ్స్ అంతర్జాతీయ సినిమా కొరకు ప్రత్యేక అవార్డ్ : మాన్సూన్ వెడ్డింగ్
  • 2002: వెనీస్ ఫిలిం ఫెస్టివల్ -యునెస్కో అవార్డ్11'9"01 సెప్టెంబర్ 11
  • 2012 ; పద్మభూషణ్ పురస్కారం[16]

మూలాలు

[మార్చు]
  1. Spelling, Ian (1 September 2004). "Director likes to do her own thing". Waterloo Region Record. pp. C4.
  2. 2.0 2.1 2.2 2.3 Muir, John Kenneth (1 June 2006). Mercy In Her Eyes: The Films of Mira Nair. Applause Theater & Cinema Books. ISBN 1557836493.
  3. 3.0 3.1 3.2 3.3 "Mira Nair". Encyclopedia of World Biography. Encyclopedia of World Biography. Retrieved 29 April 2015.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 Blenski, Simon; Debreyne, Adrien Maurice; Hegewisch, Martha Eugina; Trivedi, Avani Anant. "Mira Nair". University of Minnesota. University of Minnesota. Retrieved 30 April 2015.[ఆధారం యివ్వలేదు]
  5. Crossette, Barabara (23 December 1990). "Homeless and Hungry Youths of India". The New York Times. Retrieved 13 October 2008.
  6. "Global Programs". Columbia University School of the Arts. Columbia University. Archived from the original on 24 జూన్ 2015. Retrieved 30 April 2015.
  7. "Film director Mira Nair boycotting Haifa festival". Jewish Telegraphic Agency. 21 July 2013.
  8. 8.0 8.1 8.2 8.3 8.4 8.5 8.6 8.7 "Mira Nair's works to be screened at IFFI 2010". NDTV. Press Trust of India. 25 November 2010. Retrieved 28 June 2011.
  9. "Mira can't wait to start Shantaram". Rediff. 29 November 2007. Retrieved 28 June 2011.
  10. Vashi, Ashish (1 November 2009). "Hollywood says ILU to Gujarati". The Times of India. Times News Network (TNN). Archived from the original on 1 జూలై 2012. Retrieved 28 June 2011.
  11. Gandert, Sean (22 October 2009). "Salute Your Shorts: Mira Nair's Short Films". Paste Magazine. Archived from the original on 31 జనవరి 2010. Retrieved 25 November 2010.
  12. "Mira Nair is India Abroad Person of the Year 2007". Rediff.com. 29 March 2008.
  13. Jamkhandikar, Shilpa (25 January 2012). "Dharmendra, Shabana Azmi, Mira Nair to get Padma Bhushan". Reuters. Archived from the original on 8 ఏప్రిల్ 2015. Retrieved 27 ఏప్రిల్ 2017.
  14. Taraporevala, Sooni; Mira Nair (1989). Salaam Bombay!. Penguin Books. ISBN 0-14-012724-0.
  15. Sloan, Jane (2007). Reel women. Scarecrow Press. ISBN 0-8108-5738-3.
  16. "Padma Awards Announced". Press Information Bureau. 27 January 2013. Retrieved 27 January 2013.

బయటి లింకులు

[మార్చు]