సాంఘిక శాస్త్రం
Appearance
సాంఘిక శాస్త్రం (Social Studies) అనేక దేశాల పాఠ్యాంశాలలో, సామాజిక అధ్యయనాలు ప్రధానంగా చరిత్ర, ఆర్థిక శాస్త్రం, పౌర శాస్త్రాలతో సహా మానవీయ శాస్త్రాలు, కళలు, ఇంకా సామాజిక శాస్త్రాల సంయుక్త అధ్యయనం. ఈ పదాన్ని ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో అమెరికన్ అధ్యాపకులు అన్ని సాంఘిక విషయాల అధ్యయనాన్ని కలిపి ఒక పదంగా ఉపయోగించారు. ఇంకా కింది స్థాయి చదువులకు సరిపడని తత్వశాస్త్రం, మానసిక శాస్త్రం లాంటి అంశాలను కూడా ఇందులో చేర్చారు.[1] వైరుధ్యాలు కలిగిన ప్రజాస్వామ్య సమాజంలో విద్యార్థులకు సమాచారం, బాధ్యతాయుతమైన భాగస్వామ్యం కోసం శిక్షణ ఇవ్వడం సాంఘిక అధ్యయనాల లక్ష్యం. ఈ శాస్త్రం పౌతుల్లో సామాజిక అధ్యయనాల విలువలు, హేతుబద్ధమైన అభిప్రాయాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన నేపథ్య జ్ఞానాన్ని అందిస్తుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ David Warren Saxe. "On the Alleged Demise of Social Studies: The Eclectic Curriculum in times of Standardization—A Historical Sketch" (PDF). Eric.ed.gov. Retrieved January 20, 2018.
- ↑ Larson, Bruce, E. (2017). Instructional Strategies for Middle and High School Social Studies, Second Edition. New York, NY: Routledge. ISBN 978-1-138-84677-7.
{{cite book}}
: CS1 maint: multiple names: authors list (link)