మాల్గుడి కథలు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మాల్గుడి కథలు-పుస్తకముఖచిత్రం

మాల్గుడి కథలు అనే కథాసంకలనపుస్తకం ప్రముఖ, ప్రసిద్ధ ఆంగ్లకథా రచయిత ఆర్.కె. నారాయణ్ రచించిన 'మాల్గుడి డేస్' అనే ఆంగ్లకథాసంకలమునకు తెలుగుసేత. తెలుగు అనువాదాన్నిడా.సి.మృణాళిని చేసారు.ఈ తెలుగు అనువాదపుస్తకము ప్రిజం బుక్సు (ప్రవైట్) లిమిటెడ్, బెంగళూరు వారిద్వారా ప్రచరింపబడింది.మొదటి ముద్రణ మార్చి2012 లో అవ్వగా, వెనువెంటనే అదే సంవత్సరము మరి రెండుసార్లు పునర్ముద్రణ పొందినది.ఈ పుస్తకం ముఖచిత్రాన్ని చంద్రనాథ ఆచార్య గీసారు.డి.టి.పి.పని జి.నరసింహారావు గారి చేతులమీదుగా జరిగింది.పుస్తకముద్రణ 'శ్రీ రంగ ప్రింటర్సు {ప్ర}లిమిటెడ్, బెంగళూరులో జరిగింది. భారతీయజాతికిచెంది, ఆంగ్లంలో సాహిత్యరచనకావించి, పేరుప్రఖ్యాతులు గడించిన ముగ్గురు రచయితలలో ఆర్.కె.నారాయణ్ ఒకరు.మిగతా ఇద్దరు ముల్క్ రాజ్‌ఆనంద్ , మరియు రాజారావు ఈయన కథలను, నవలను ఆంగ్లంలో వ్రాసినప్పటికి, చదవటానికి ఎంతో సొగసుగా వుంటాయి ఈయన రచనలు.ఇతనికథలలోని పాత్రలు ప్రతి నిత్యం మనకు తారసపడెవే.అంతో ఇంతో వాటితో, వారితో మనకు పరిచయముంటుంది. కాకపోతే ఆవ్యక్తులజీవితపు లోతులలోకి మనకంటే లోతుగా తొంగిచూసి, అప్పటివరలు మనం చూడని మరోలోపలి వ్యక్తిత్వాన్ని మనముందు ప్రత్యక్షింపచేస్తాడు రచయిత.కథలలోని ప్రతిపాత్ర ఎదోఒకసంక్షోభాన్ని ఎదుర్కొం టుంది. అలాఎదుర్కొన్న సంక్షోభాన్ని ఆపాత్రకొన్ని సార్లు పరిష్కరించుకుంటుంది.కొన్ని సార్లు సమాధానపడుతుంది.నారాయణ్ కథలలోని పాత్రలు ఒకమనిషి వ్యక్తిత్వం యొక్క ఒక ప్రేరణకు సంబంధించి లేదా ఒక పరిస్థితికి సంబంధించినది అయ్యిండవచ్చును.

ఆర్.కె.నారాయణ్[మార్చు]

నారాయణ్ పూర్తిపేరు రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి.జననం 1906 అక్టోబరు 10, నాటిమద్రాసు, నేటి చెన్నైలో జన్మించారు [1].కథలు, నవలలు రెండింటిని రచించడంలో సిద్దహస్తుడు.సాధారణంగా మిగతా రచయితల అభిప్రాయం ప్రకారం కథను వ్రాయడం నవల వ్రాయడంకన్న కష్టమైనది.నవల పెద్దదిగా వుండటంవలన కథనంను, పాత్రలను, సన్నివేశాలను విపులంగా వర్ణించె వీలున్నది.కానికథను క్లుప్తంగా వ్రాయవలసి రావడం వలనప్రధానకథావస్తువును అతిజాగ్రత్తగా, ప్రాంరంభంనుండి ముగింపువరకు నడిపించవలసివుంటుంది.కాని నారాయణ్ అభిప్రాయం- కథకన్న నవల వ్రాయడం కష్టం.ఎందుకంటే కనీసం 60వేలనుండి లక్ష పదాలవరకు వ్రాయాలి తదనుగుణ్యంగా పాత్రలను, సన్నివేశాలను, పరిసరాలను విస్తరిస్తూ, వ్రాయాలి.అతే కథయినచో వివరాలను సూచ్యప్రాయంగా చెబుతూ, ప్రధానవస్తువు, ముగింపు, ఈ రెండింటి పట్ల శ్రద్ధవహిస్తే చాలంటాడు.ఆర్.కె.నారాయణ్ అంగ్లంలో వ్రాసిన ఈచిన్నకథల (short stories) కథాసంకలము మొదట 1943 లో ఇండియన్ థాట్ పబ్లికేసన్ ద్వారా ప్రచురితమైనది.1982 లో విదేశాలలో పునర్ముద్రణ పొందినది, ఇందులో 19 కొత్త కథలను చేర్చడం జరిగినది[2].

రచయిత గురించి మరింత సమాచారానికై ప్రధాన వ్యాసం;ఆర్.కే. నారాయణ్ చదవండి.

అనువాద రచయిత్రి- డా.సి.మృణాళిని[మార్చు]

ఆర్.కె.నారాయణ్ ఆంగ్లంలో వ్రాసిన మాల్గుడి డేస్ కథాసంకలమును రసరమ్యంగా, మూలకథనానికి ఎటువంటి భంగం వాటిల్లకుండ తెలుగులోకి అనువాదం చేసిన రచయిత్రి. ఈమె స్వతహాగా ఆర్కే గారి అభిమాని.

మృణాళిని ఉన్నతవిద్యావేత్త. తెలుగు, ఇంగ్లీషు, మరియు విమెన్‌స్టడిస్‌లో ఏం.ఏ (M.A) పట్టభద్రురాలు. తెలుగులో పి.హెచ్.డి.చేసారు. వీరు ఇప్పటివరకు 12 పుస్తకాలను ప్రచురించారు. కొన్నివందల సదస్సులలో పాల్కొని పత్ర సమర్పణ చేశారు. వీరి రచనలలో కొన్ని

  • కోమలి గాంధారం (కథల సంపుటి)
  • తాంబులం (సోషల్ సెటైర్)
  • గుల్జార్ కథలు (అనువాదం)
  • దిమాంక్ హూ సీల్డ్ ఫెరారీ (తెలుగు అనువాదం) మొదలైనవి.

సాహిత్యం, మహిళా అధ్యయనం, మీడియాలు మృణాళిని గారి అభిమాన విషయాలు.ప్రస్తుతం (2012 నాటికి) హైదరాబాద్ లోనిపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక ఆధ్యయన కేంద్రంలో ప్రోఫెసరుగా, కేంద్రాధిపతిగా పనిచేస్తున్నారు.

మాల్గుడి కథలు[మార్చు]

ఈపుస్తకంలోని కథలు మాల్గుడిఅనే వూరును కేంద్రంగా చేసుకొని, ఆవూరిలోని ప్రజలజీవితంలోని సంఘటనలను ఆధారంచేసుకొని కథలల్లబడ్డాయి. రచయిత చెప్పినదానిప్రకారం ఈ మాల్గుడి అనేది తన కథలలోని కల్పితపాత్రలలా, సంఘటనలలా, తన ఊహాలనుంచిపుట్టిన కల్పిత నగరం.రచయిత మనోభావం ప్రకారం మాల్గుడి లాంటి నగరం, దానిలోని వీథులవంటివి, అందులో కనిపించే జనులు ఎక్కడైన చూడగల్మంటాడు.ఉదాహరణకు తాను 1959 నుంచి అప్పు డప్పుడూ నివసిస్తూవచ్చిన వెస్ట్ ట్వేంటి థర్డ్ స్ట్రీట్‌లో మాల్గుడి లక్షణాలున్నాయంటాడు ఆర్కే.నారాయణ్. మాల్గుడి డేస్ లోని ఈ వూరు ప్రపంచంలోని పాఠకులను ఎంతప్రభావితంచేసిందంటే, చికాగో విశ్వవిద్యాలయంప్రెస్సు ఒక సాహిత్యపత్రాన్ని చిత్రించి, అందులోని భారతదేశంలోని చిత్రపటంలో మాల్గుడిని కూడా చూపించింది (రచయిత తనముందుమాటలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు). కొందరు పాఠకులఉహాగాన ప్రకారం, తమిళనాడులోనీ కోయంబత్తూరు కావొచ్చునని. కర్నాటకలోని లాల్గూడి యే మాల్గుడియని కొందరి భావన.

ఆచార్య సి.మృణాళిని అనువాదంచేసిన, ఆర్కె, నారాయణ్ విరచితమైన ఈ పుస్తకంలో మొత్తం 32 కథలున్నాయి. అందులో మొదటి 16 కథలు జ్యోతిష్కుడి జీవితంలో ఒకరోజు సంకలమునుండి, మరో ఎనిమిది కథలు లాలీరోడ్ సంకలమునుండి, చివరి ఎనిమిది కథలు అనంతర కథలు కథల సంకలమునుండి తెలుగులోకి అనువాదమొనర్చబడినవి.

అనువాదపుసక్తములోని కథలు 1.జ్యోతిష్యుడి జీవితంలో ఒకరోజు,2.తప్పిపోయిన ఉత్తరం,3.వైద్యుడిమాట,4.కాపదారు కానుక,5.గుడ్డికుక్క,6.ఆగంతకుడు,7.పులిపంజా,8.ఈశ్వరన్,9.పరిపూర్ణత!,10.తండ్రి సాయం,11.పాముకాటు,12.ఇంజను లోపం,13.నెలకు నలబై అయిదు,14.వ్యాపారం పోయింది,15.అత్తిలా,16.కత్తి,17.లాలీ రోడ్,18.ఆకుపచ్చనికోటు వెంట...,19.అమరజీవుల నెలవు,20.భార్య సెలవు,21.నీడ,22.ప్రియమైన బానిసత్వం,23.లీల స్నేహితుడు,24.తల్లీ కొడుకు,25.నాగా,26.సెల్వి,27.మరో అభిప్రాయం,28.పిల్లిదయ్యం,29.కొన,30.దేవుడూ, చెప్పులుకుట్టేవాడూ,31.ఆకలిగొన్న పిల్లవాడు,32.ఎమ్డెన్.

మాల్గుడి కథలగురించి-టూకీగా[మార్చు]

  • జ్యోతిష్కుడి జీవితంలో ఒక రోజు :ఎ న్నో ఏళ్ళక్రితం, ఈజ్యోతిష్కుడు, 200 మైళ్ళ అవలనున్న వూరినించి వచ్చాడు మల్గుడికి జ్యోతిష్యం రాకపొయిన తన మాటల చాతుర్యంతో, తెలివితేటలతో ప్రజలను మాయపెట్టి, మభ్యపెట్టి జీవనం కొనసాగిస్తున్నాడు. తన వూరినింఛి హఠాత్తుగా ఎందుకొచ్చాడో, అ జ్ఞాతంగా బ్రతుకుతున్న విషయం ఎవ్వరికి తెయదు. ఒకరోజు సాయంత్రం, చిక్కట్లు కమ్మిన వేళ తనవద్దకు జాతకం చెప్పించుకోవటానికి వచ్చిన వ్యక్తిని చూసి అవాక్కు అవ్వుతాడు. ఎవ్వరావ్యక్తి? ఏమిటాకథ?
  • తప్పిపోయిన వుత్తరం:ఇప్పుడంటే అంతా సెల్లుమయం.ఎవ్వరిచేతిలో చూసిన పిడెకెడంత సెల్లు చేసే హంగామా అంతాఇంతాకాదు.శుభమైన, అశుభమైన, అవసరమైన, అనవసరమైన అంతా సొల్లు సెల్లుమయమే. ఇందుగలదు, అందులేదని సందేహం వలదు, ఎందెందు చూసిన అందందే చెవికి అతుక్కుపోయి సెల్లుదర్శనమిస్తుంది.కాని 50-60సంవత్సరాలక్రితం ఒకరినుంచి మరొకరికిసమాచారాన్ని చేరవేసె ఉత్తమసాధనము వుత్తరము .అప్పటికి టెలిఫొనులు సామాన్యులకు అందుబాటులో లేనిరోజులవి.పేదవాడైన, పెద్దవాడైన సమాచారం కావాలన్నా, పంపాలన్నా తపాలే ఆధారం.అండుకే అప్పుడు ఇంటింటికి వుత్తరాలను చేరవేసె తపాలా మనిషి/పోస్ట్‌మాన్ (post man), ప్రతి ఇంటివారికి అవసరమైనవాడే.ప్రతిరోజు పోస్టుమేన్ వచ్చెసమయానికి అప్తుడయ్యిన మనిషికై చూసినట్లు ఎదురుచూసేవారు.పోస్టుమేన్ కూడా అలాగే గ్రామస్తులతో కుటుంబ సభ్యుడులా మెలిగేవాడు.శుభవార్తతెచ్చినప్పుడు వారిసంతోషంలో తాను పాలుపంచుకొనేవాడు, అశుభవార్త అయ్యినచో వారితోపాటూ తాను దుఃఖంలో పాలుపంచుకొనేవారు.ఈ కథలోని పోస్టుమేన్ కూడా అచ్చు ఆలాంటి వాడే.అంతరితలలో నాలికలా వుండేవాడు.ముఖ్యంగా మల్గుడిలోని, వినాయకవీధిలోని 10వ నెంబరు ఇంటిలోని రామానుజంతో మరింత సన్నిహితంగా వుండేవాడు.రామానుజం కూతురు కామాక్షి పుట్టినప్పడినుండి, కామాక్షికి పెళ్ళీడురాగానే పోస్టుమేన్ ఒకమంచి ఢిల్లీసంబంధం కుదిర్చాడు.వరుడు ఉన్నతశిక్షణకై 20రోజుల్లో వెళ్ళవలసిరావటం, అతరువాత 3సంవత్సరాలవరకు పెళ్ళిచేయుటకు కుదరదు.అందువలన 20రోజుల్లో పెళ్ళిజరగాలి.రామానుజం సమయంతక్కువగావుందని, ఈలోపు జరుగగూడని అశుభం ఏదైన జరిగినచో పెళ్ళి మూడుసంవత్సరాలు వాయిదా పడుతుందని కంగారుపడగా భయంవలదని ధైర్యం చెప్పి, పోస్టుమేన్ దగ్గరుండి, అన్నితానై ఆశుభకార్యం పూర్తి చేస్తాడు.పెళ్లిజరిగిన15 రోజులకు పోస్టుమేన్ ఒకవుత్తరం, ఒక టెలిగ్రాం తీకొని రామానుజం ఇంటికొస్తాడు.వుత్తరంలో సేలంలోవున్న రామానుజం పెద్దనాన్నఆరోగ్యం బాగాలేదని వుంది, టెలిగ్రాంలో పెద్దనాన్న మరణించినట్లు సమాచారం.అదిచదివి రామానుజం కంగారుగాబయలు దేరుతుండగా పోస్టుమేను-, "ఆ వుత్తరం పెళ్ళికి ముందురోజువచ్చింది,టెలిగ్రాం పెళ్ళిరోజు వచ్చింది,ఈవిషయం తెలిస్తేనీవు పెళ్ళి ఆపివేస్తావని,చెప్పలేదు.అందుకే దాచి వుంచాను.ఇదితప్పే.కావల్సినచో మీరు నాపై అధికారులతో పిర్యాదు చేసుకోవచ్చు,బహుశా నావుద్యోగంపోవచ్చును.కాని కామాక్షి పిళ్ళిజరగడం నాకు అవసరమనిపించింది"అని మెల్లగా వెనుతిరిగి తలవంచుకు వెళ్లిపోతున్న పోస్టుమేనుతో,రామానుజం "నేనేమి నీమీద పైవాళ్లకేమి పిర్యాదు చెయ్యడంలేదు.కాని నీవు చేసింది నాకు నచ్చలేదందే ."అంటాడు.
  • వైద్యుడి మాట :మాటే మంత్రం.అవును నిజం.ఒకవ్యక్తిని గాఢంగా విశ్వసించినప్పుడు,నమ్మినప్పుడు ఆవ్యక్తి చెప్పెమాట నమ్మినవ్యక్తిమీద,మనస్సుమీద ప్రభావం చూపిస్తుంది.భారతంలో ద్రోణాచార్యులకు ధర్మరాజు అబద్ధము చెప్పడని పూర్తినమ్మకము.అందుకే రణభూమిలో ధర్మరాజు "ఆశ్వథామా హతః.." అనిఅనగానే ద్రోణుడు అస్త్రసన్యాసంచేసాడు.అతరువాత ధర్మరాజు "కుంజర"అంటూ అసత్యమాడినదోషం నుండి తెలివిగా తప్పించుకున్నాడు.ఈ కథలోని డాక్టరు రామన్ కూడా అబద్ధము పలకడు.తనవద్దకు వచ్చేరోగులను వారికున్న రోగతీవ్రతను బట్టి,ముందే నిజం చెప్పేవాడు.అందుకే ఆ డాక్టరు అబద్ధమాడడని అందరి నమ్మకం. అదినిజం కూడా.అలాంటి డాక్టరుకూడా అబద్ధం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.భారతంలో ధర్మరాజు స్వార్థంతో అబద్ధంచెప్పి,తనప్రియమైన గురువు మరణానికి కారణమైతే,ఇక్కడ డా.రామన్ మరణించే స్థితిలో వున్న తన మిత్రుని రక్షించెటందుకు,అతనిలో ఆత్మవిశ్వాసం కలిగించేటందుకు " నీకేమి కాదు, నీఆరోగ్యానికి ఏప్రమాదంలేదని" మొదటి సారి అబద్ధం చెప్తాడు.డాక్టరు మీద ఆపారనమ్మకమున్న అతని మిత్రుడు, డాక్టరే ఆశ్చర్యపడెలా ఆరోగ్యవంతుడవ్వుతాడు.మాటకున్న అపారశక్తి ఇది.
  • గుడ్దికుక్క :ప్రపంచంలో అత్యంత విశ్వాసంచూపే పెంపుడుజంతువు ఏదని ప్రశ్నిస్తే అందరు ముక్తకంఠంతో చెప్పెపేరు కుక్క .అవును; ఇది అక్షరసత్యం. కాని ఈ కుక్కవిశ్వాసమే ఒకవూరకుక్కను ఎలా శాశ్విత బానిసత్వంలోకి నెట్టింది వివరించే కథ.నిజం! ఒక్కొసారి, మనవిశ్వాసమే మనపాలిట శాపంగా మారుతుందని నర్మగర్భంగా ఎచ్చరించేకథ.
  • అగంతకుడు :ఈకథ అప్పుడేకాదు ఇప్పుడు కూడా నిత్యంజరిగే కథే.ఎక్కడంటరా?రైలులోని జనరల్ కంపార్ట్‌మెంటులో అనునిత్యం జరిగే సీటుకై పోరాటం.ముందెక్కినవారు సీటుఆక్రమించి కూర్చున్నతరువాత ఆతరువాత వచ్చే ప్రయాణికులు సీటుకై బుజ్జగింపులు, వేడికోలు, అర్థింపులు, ఆపై బెదరింపులు, చొక్కాచేతులు మడవటాలు, మీసాలు దువ్వటాలు, చూసుకుందామా?అంటే; ..చూచుకుందాం...ఇవన్ని..ఆనాడు ఈనాడు షరామాములే!
  • ఈశ్వరన్ : అదిజూన్‌నెల.ఆ రోజు మాల్గుడి ఊరుఊరంతా ఆతురతాగా ఎదురు చూస్తున్నారు ఇంటర్మిడియట్ ఫలితాలకై, ఒక్క ఈశ్వర్ తప్ప.ఈశ్వర్ కూడా పరీక్ష వ్రాసాడు, కాని ఫలితానికై ఆతృతలేదు. ఎందుకంటె ఇప్పటికే ఎన్నోసార్లు ఇంటర్మీడియేట్ పరీక్ష వ్రాయడం, తప్పడంమాములై పోయింది.అందుకే అందరు ఫలితాలకై ఎదురుచూస్తుంటే, తనఫలితమేమిటో తనకుముందే తెలుసుకాబట్టి, ఏ టెన్షను లేకుండాగా సినిమాకెళ్ళాడు వరుసపెట్టి రాత్రి రెండో ఆటవరకు చూశాడు.అటుతరువాత ఇంటికెళ్లటానికి మనసొప్పక సరయు నదివడ్డుకు చేరుతాడు.తనమీద తనకే అసహ్యంవేసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని, ఆలా వుత్తరంవ్రాసింకోటుజేబులోపెట్టి, కోటును ఒడ్డునపెట్టి, మరణించటానికి సిద్ధమై, మరణించేముందు చివరిసారిగా స్కూలును, చూడాలనిపించి, స్కూలుదగ్గరకు వెళ్తాడు.నోటిసుబోర్డులో తాను సెకండు శ్రేణిలో పాసు అయ్యినట్లు తెలుసుకొని ఆనందంతో గుర్రపుస్వారీ చేస్తున్నట్లు ఉహించుకుంటూ గెంతుతూ, గెంతుతూ వెళ్ళి పొరపాటున సరయునదిలో పడిపోతాడు.ఉదయంశవమై అయినవాళ్ళకు కనిపిస్తాడు.

మూలాలు[మార్చు]