ఎవరికీ తలవంచకు (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎవరికీ తలవంచకు
Evarikee talavanchaku-apj abdul kalam 001.jpg
ఎవరికీ తలవంచకు? పుస్తక ముఖచిత్రం
కృతికర్త: అబ్దుల్ కలాం
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రచురణ: reem publication pvt.ltd, Delhi
విడుదల: 2011
పేజీలు: 250


ఎవరికీ తలవంచకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి మానసిక వ్యక్తిత్య పుస్తకం. ఈ పుస్తకాన్ని వాడ్రేవు చినవీరభద్రుడు తెనుగీకరించారు. దీన్లో తన అనుభవాలను అనేకం చెప్తూ విద్యార్థులకు ఉపయోగపడు అనేక విశేషాలను జతచేసారు రచయిత.

పుస్తకంలో విభాగాలు[మార్చు]

 • ఉత్తేజపరచే జీవితాలు
 • నా గురువులు
 • విద్యా లక్ష్యం
 • సృజనశీలతా, ప్రయోగపరత్వమూ
 • కళలు, సాహిత్యం
 • విలువలకు కట్టుబడి ఉందటం
 • సైన్సు, ఆధ్యాత్మికత
 • రేపటి పౌరులు
 • సాధికారత సాధించిన మహిళలు
 • విజ్ఞాన సమాజం దిశగా
 • నవభారత నిర్మాణం
 • పరిణితి చెందిన పౌరులు
 • కొత్త తరహా నాయకత్వం
 • ఎవరికీ తలవంచకు
 • సూచికలు

విశేషాలు[మార్చు]

 • తన జీవితాశయానికి మార్గం వేసిన ఒక సంఘటన గురించి కలాం మాటల్లో - తన అయిదవ తరగతి ఉపాధ్యాయుడైన శివశంకర్ అయ్యర్ పక్షుల గమనం శరీర నిర్మాణం గురించి చెపుతూ కలాంను నీకు అర్ధమయ్యిందా అని అడుగుతాడు. తనకు అర్ధం కాలేదన్న కలాంను తీసుకొని రామేశ్వరం సముద్ర తీరప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ ఎగిరే పక్షులను చూపుతూ వాటి శరీర నిర్మాణం, తోక భాగం, రెక్కలు వాటి పనితీరు వివరిస్తాడు. ఆయన వివరణ కలాం యొక్క భవిష్యత్ చిత్రించి, తను చదివే చదువు ఆకాశయాన వ్యవస్థకు సంబంధించినదై ఉండాలని నిర్ణయించుకున్నారు.
 • తనకు స్ఫూర్తినిచ్చిన వారిగా తన తల్లిని, ఎం.ఎస్.సుబ్బలక్ష్మిలను చెపుతారు, మహాత్ములుగా విక్రం సారాభాయ్, సతీష్ ధావన్, బ్రహ్మ ప్రకాష్, ఎం.జి.కె. మీనన్, డా.రాజారామన్నలుగా పేర్కొన్నారు.