Jump to content

ఎస్కిమోలు

వికీపీడియా నుండి
ఎస్కిమోలు
Total population
183,500
భాషలు
అల్యుయిట్,యుపిక్,ఇన్యుపిక్

ఎస్కిమోలు (ఆంగ్లం Eskimo) తూర్పు సైబీరియా (రష్యా) నుండి అలాస్కా (యునైటెడ్ స్టేట్స్), ఉత్తర కెనడా, నునావిక్ గ్రీన్‌లాండ్ వరకు ఉత్తర సర్క్యూపోలార్ ప్రాంతంలో నివసించిన ప్రజలు ఎస్కిమోలు.

చరిత్ర

[మార్చు]

ఈ జాతి ప్రజలు ఆదిమ జాతికి చెందినవారు కానీ ఆ పదం వీరికి వర్తించదు ఎందుకంటే వారు ఇప్పటికి కూడా జీవించే ఉన్నారు.[1]ఎస్కిమో అనగా మంచు బూట్ల వ్యక్తి అని అర్థం.[2][3] వీరి భాషలో ఇన్యుయిట్ అంటే ప్రజలు అని అర్థం. 5 వేల సంవత్సరాల క్రితం ఆసియా నుండి బేరింగ్ జలసంధి దాటి ఎస్కిమోలు ఉత్తర అమెరికాలో ప్రవేశించారు.వీరు గ్రీన్ ల్యాండ్ కెనడా అలస్కా సైబీరియా ప్రాంతాలలో చిన్నచిన్న నివాసాలు ఏర్పరుచుకున్నారు. [4][5]వీరిలో లో కొందరు పశ్చిమ వైపు ప్రయాణించి బేరింగ్ సముద్ర తీరాన స్థిరపడ్డారు.వేలాది సంవత్సరాల పాటు ఇతరులతో సంబంధం లేకుండా జీవనం సాగించారు. వీరు ప్రధానంగా జంతువులను వేటాడుతారు వేట వీళ్ల జీవనాధారం. ఆహారంతో పాటు దుస్తులు, నివాస గృహాలు కూడా జంతువుల ఎముకలు, చర్మాలతోనే తయారుచేసుకుంటారు.వీరి ఆహారంలో ప్రధానంగా మాంసం, చేపలు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తింటారు. వీరు వేటాడిన చేపలను మంచులో తవ్వి నిల్వచేస్తారు. కొన్ని రకాల పచ్చి మాంసం కొద్దిగా కుళ్ళిన తర్వాత తింటారు.

జీవన విధానం,నివాస గృహాలు

[మార్చు]
ఎస్కిమో నివాసగృహం

ఎస్కిమోలు 1000 మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలు ఉత్తర అలాస్కా తీరంలో ఉన్నాయి. వీరు సంవత్సరమంతా ఒక చోట నుండి మరొక చోటికి సంచార జీవనం గడుపుతూ ఉంటారు.శీతాకాలంలో సముద్రానికీ దగ్గరగా ఉంటూ సముద్రపు సీల్ జంతువులను, చేపలు వేటాడుతూ ఉంటారు. వీరి సంసార జీవితం లో 1100 కిలోమీటర్లు తిరుగుతారు. వీరు రవాణాకు మంచి కుక్కలను ఉపయోగిస్తారు.వీరు మంచు తో చేసిన ఇగ్లూ లలో నివసిస్తారు.ఇగ్లూ అంటే ఎస్కిమో పదానికి ఆశ్రయం అని అర్థం.తూర్పు మధ్య ప్రాంతాల్లో మాత్రమే మంచు ఇళ్లను ఉపయోగిస్తారు.వేసవికాలంలో జంతు చర్మంతో చేసిన గుడారాలను ఏర్పాటు చేసుకుంటారు. గ్రీన్ లాండ్ లో అయితే రాతి పలకలతో ఇల్లు నిర్మించుకుంటారు.

మతం,భాష

[మార్చు]

ఆరోగ్యం జీవితం ఆకలి మరణాల పట్ల ఎస్కిమోలు మతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంది.ఎస్కిమోలు శిలా అనే అతీత శక్తిని ఆత్మలను (ఆహారం ఆరోగ్యం జీవనం) దేవత అయిన సెడ్నా వంటి దేవతల నమ్ముతారు. మనుషులు జంతువులు చనిపోయిన వారి ఆత్మ లు జీవించి ఉంటాయని బలంగా నమ్ముతారు.ఎస్కిమోలుకి భాష ఉంది కానీ ఇప్పటివరకు లిపి లేదు. వీరికి ప్రధానంగా మూడు భాషలు ఉన్నాయి. అందులో అల్యుయిట్,ఇన్యుపిట్,యిపిక్. ఉత్తర అలస్కా నుండి గ్రీన్ లాండ్ వరకు ఇన్యుపిట్ ఎక్కువగా మాట్లాడతారు.

మూలాలు

[మార్చు]
  1. "Arctic Studies". alaska.si.edu. Archived from the original on 2020-06-22. Retrieved 2020-07-25.
  2. R. H. Ives Goddard, "Synonymy". In David Damas (ed.) Handbook of North American Indians: Volume 5 Arctic (Washington, DC: Smithsonian Institution, 1985, 978-0874741858), pages 5–7.
  3. stason.org, Stas Bekman: stas (at). "91 "Eskimo" (Word origins - alt.usage.english)". stason.org.
  4. Stern, Pamela R. (2013-09-26). Historical Dictionary of the Inuit (in ఇంగ్లీష్). Scarecrow Press. ISBN 978-0-8108-7912-6.
  5. "Eskimo | Definition, History, Culture, & Facts". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-07-25.