ఎస్.ఎ. సామినాథ అయ్యర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎస్.ఎ. సామినాథ అయ్యర్
Serugudi Anantharama Saminatha Iyer.jpg
ఎస్.ఎ. సామినాథ అయ్యర్ చిత్రపటం
మరణం1899, ఆగస్టు 12
జాతీయతబ్రిటీష్ ఇండియా
వృత్తిన్యాయవాది
సుపరిచితుడుదివ్యజ్ఞాపకుడు, నిర్వాహకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు
బిరుదురావు బహదూర్
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్

రావు బహదూర్[1] ఎస్.ఎ. సామినాథ అయ్యర్ (మరణం 1899), తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యాయవాది, దివ్యజ్ఞాపకుడు, నిర్వాహకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఇతడిని తంజావూర్ సామినాథ అయ్యర్ అని కూడా పిలుస్తారు. 1885, 1886, 1887, 1889లలో తంజావూర్ మునిసిపాలిటీ ఛైర్మన్ గా, 1894లో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల ప్రతినిధిగా పనిచేశాడు. 1885లో నిర్వహించిన మొదటి సెషన్‌లో ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా మాట్లాడాడు. 1887లో కాంగ్రెస్ రాజ్యాంగాన్ని వ్రాసిన 32 మంది సభ్యుల బృందంలో ఒకడిగా ఉన్నాడు. క్రిస్టోఫర్ బేకర్, డిఎ వాష్‌బ్రూక్ ఇతడిని "తంజావూర్ పెద్దమనుషుల ముఖ్య ప్రతినిధి" గా అభివర్ణించారు.

తొలి జీవితం[మార్చు]

ఎస్ఎ స్వామినాథ అయ్యర్ తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో జన్మించాడు. శంకరనారాయణ దీక్షితార్ నలుగురు కుమారులలో ఇతడు పెద్దవాడు. తన విద్యాభ్యాసం పూర్తయిన తరువాత నెగపటంలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు.[2][3][4][5] 1887లో సామినాథ అయ్యర్ తంజావూర్ కు వలస వచ్చి, అక్కడి తంజావూర్ జిల్లా కోర్టులో పబ్లిక్ ప్రాసిక్టర్‌గా పనిచేశాడు.

రాజకీయాలు[మార్చు]

నెగపటంలో ప్లీడర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాజకీయాలపై ఆసక్తివున్న సామినాథ అయ్యర్ 1880ల ప్రారంభంలో నెగపటం మునిసిపాలిటీకి ఎన్నికయ్యాడు, సభ్యుడిగా పనిచేశాడు.[3] 1882లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ శాఖను జిల్లాలో నిర్వహించడానికి నాయకత్వం వహించాడు. 1883లో దివ్యజ్ఞాన సమాజం నెగపటం శాఖను కూడా స్థాపించి, కార్యదర్శిగా పనిచేశాడు. 1884లో ఏర్పడిన మద్రాస్ మహాజన సభలోసభ్యుడిగా చేరాడు.[3][6]

1885, సెప్టెంబరులో కుంభకోణం వెళ్ళిన సామినాథ అయ్యర్, సర్ అమరావతి శేషయ్య శాస్త్రి తరువాత తంజావూర్ పీపుల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు.[3] 1885 డిసెంబరు 25- 28ల మధ్య బొంబాయిలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి సెషన్‌కు అసోసియేషన్ ఏకైక ప్రతినిధిగా వెళ్ళాడు.[7][8] సామినాథ అయ్యర్ తరువాత "రావు సాహిబ్" గా పిలువబడ్డాడు.

ఆ సెషన్‌లో ఉప్పు పన్నును తీవ్రంగా విమర్శించాడు.[9][10][11]

1887లో మద్రాసులో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూడవ సెషన్‌లో సామినాథ అయ్యర్ 35 మంది సభ్యుల కమిటీలో సభ్యుడిగా నియమించబడ్డాడు. ఈ కమిటీ భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని రూపొందించింది.[12][13] 1886, 1889, 1894 సెషన్లలో కూడా పాల్గొన్నాడు.

1888 ఏప్రిల్ లో మద్రాస్ క్రైస్తవ కళాశాలలో ఒక బ్రాహ్మణ విద్యార్థి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు పుకార్లు వచ్చినప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో తీవ్రమైన అవాంతరాలు సంభవించాయి.[14] 1888 జూన్ లో తంజోరు జిల్లాలోని నన్నిలం పట్టణంలో బ్రాహ్మణ విద్యార్థులు పట్టణంలోని మిషనరీ పాఠశాలను మూసివేయాలని ఆందోళన చేశారు.[15][16] ఆ సందర్భంగా జిల్లాలో జరిగిన సమావేశానికి సామినాథ అయ్యర్ అధ్యక్షత వహించాడు. దీనిలో అయ్యర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి క్లుప్త వివరణ ఇచ్చాడు. క్రైస్తవ పాఠశాలను బహిష్కరించాలని, బదులుగా పిల్లల విద్య కోసం జాతీయ పాఠశాలను ప్రారంభించాలని ప్రజలకు సూచించాడు.[15][16] ప్రస్థాన ప్రజలు పేదరికంతో బాధపడుతుండగా, మిషనరీ కళాశాలల అధ్యాపకుల ఉదారవాద వ్యయాలను సామినాథ అయ్యర్ విమర్శించాడు.[17]

సామినాథ అయ్యర్ 1886లో తంజావూర్ జిల్లా బోర్డుకు ఎన్నికయ్యాడు. 1887లో తంజావూరు మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ గా నామినేట్ అయ్యాడు. అదే సంవత్సరం అతడిని "రావు బహదూర్"గా చేశారు. చైర్మన్ గా సామినాథ అయ్యర్ తంజావూర్ నగరంలో క్వీన్ విక్టోరియా పాలన స్వర్ణోత్సవ వేడుకలకు అధ్యక్షత వహించాడు. తంజావూర్ లోని రాజా మిరాస్‌దార్ హాస్పిటల్ కార్యదర్శిగా కూడా ఎన్నికయ్యాడు. 1892లో థియోసాఫికల్ సొసైటీ తంజావూర్ శాఖ అధ్యక్షుడయ్యాడు.[18] 1893లో సామినాథ అయ్యర్ తంజావూర్ మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా కె. కళ్యాణసుందరామియర్ చేత నియమించబడ్డాడు.

1892లో తంజావూర్ జిల్లాలోని మిరాసీదార్‌లు భూమి ఆదాయం రూ. 3.9 మిలియన్ నుండి రూ. 5.6 మిలియన్ పెరగడానికి వ్యతిరేకంగా ఆందోళన చేసినప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన శాస్త్రీయ పరిష్కారం ప్రకారం, సామినాథ అయ్యర్ ఉద్యమానికి నాయకత్వం వహించాడు.[19] మునిసిపాలిటీల స్థానానికి మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలో సామినాథ అయ్యర్ ఓడిపోయాడు.[20]

ఆలయ రాజకీయాలు[మార్చు]

కుంభకోణం, మాయవరం, షియాలి తాలూకాలతో ఉన్న కుంభకోణం డివిజన్‌లోని హిందూ దేవాలయాలను నిర్వహించే కుంభకోణం ఆలయ కమిటీకి సామినాథ అయ్యర్ ఎన్నికై హిందూ దేవాలయాల పరిపాలనా వ్యవహారాలు చూసుకున్నాడు.[21][22] అయ్యర్ 1885 నుండి 1899లో మరణించే వరకు కమిటీలో సభ్యుడిగా ఉన్నారు.

మరణం[మార్చు]

సామినాథ అయ్యర్ 1899, ఆగస్టు 12న మరణించాడు.[23]

కుటుంబం[మార్చు]

సామినాథ అయ్యర్‌కు సంతానం లేకపోవడంతో ఎస్.ఎ. వెంకటరామ అయ్యర్ (1894-1961) ను దత్తత తీసుకున్నాడు. సామినాథ అయ్యర్‌ మనవరాలు ఎస్.ఎ.కె దుర్గ ఎథ్నోముసికాలజిస్ట్ గా పనిచేస్తోంది.[24]

మూలాలు[మార్చు]

 1. Zaidi, A. Moin; Shaheda Gufran Zaidi (1976). The Encyclopaedia of Indian National Congress. S. Chand. p. 610.
 2. Majumdar, Bimanbehari (1967). Congress and Congressmen in the Pre-Gandhian Era 1885–1917. p. 312.
 3. 3.0 3.1 3.2 3.3 Suntharalingam, R. (1974). Politics and Nationalist Awakening in South India, 1852–1891. Association for Asian Studies by the University of Arizona Press. pp. 218. ISBN 0816504474.
 4. Zaidi, A. Moin; Shaheda Gufran Zaidi (1976). The Encyclopaedia of Indian National Congress. S. Chand. p. 595.
 5. Mehrotra, S. R. (1995). A History of the Indian National Congress: 1885–1918. Vikas Publishing House. p. 372. ISBN 0706980719.
 6. Narasimhan, V. K. (1963). Kasturi Ranga Iyengar. Ministry of Information and Broadcasting. p. 18.
 7. Sivagnanam, M. P. (1988). History of Freedom Movement in Tamil Nadu: Vidutalai poril Tamilakam. Tamil University. p. 67. ISBN 8170901146.
 8. Saroja Sundararajan (1997). Madras Presidency in Pre-Gandhian Era: A Historical Perspective, 1884–1915. Lalitha Publications. p. 60.
 9. Bakshi, Shiri Ram (1989). Indian National Movement and the Raj. India: Criterion Publications. p. 56.
 10. Chandra, Bipan (1966). The Rise and Growth of Economic Nationalism in India: Economic Policies of Indian National leadership, 1880 to 1905. India: People's Publication House. pp. 232.
 11. Bakshi, S R (1994). Struggle for Independence. India: Anmol Publications. pp. 181 & 182. ISBN 8170417147.
 12. Besant, Annie (1915). How India Wrought for freedom. Adyar, Madras: Theosophical Publishing House. pp. 52.
 13. Saroja Sundararajan (1997). Madras Presidency in Pre-Gandhian Era: A Historical Perspective, 1884–1915. Lalitha Publications. p. 72.
 14. Oddie, p 204
 15. 15.0 15.1 Missionary controversy: Discussion, Evidence and Report, 1890. London: Wesleyan Methodist Book Room. 1890. p. 163.
 16. 16.0 16.1 Missionary controversy: Discussion, Evidence and Report, 1890. London: Wesleyan Methodist Book Room. 1890. p. 176.
 17. Missionary controversy: Discussion, Evidence and Report, 1890. London: Wesleyan Methodist Book Room. 1890. p. 114.
 18. Oddie, p 255
 19. The Indian Review. G.A. Natesan & Co. 1937. p. 535.
 20. Markandan, K. C. (1964). Madras Legislative Council: Its Constitution and Working Between 1861 and 1909: Being a Report, Submitted to the Madras University, as a Fellow in the Politics Department Between October 1952 and October 1953. S. Chand. p. 53.
 21. Oddie, p 255
 22. Oddie, p 237
 23. A. Oddie, Geoffrey (1991). Hindu and Christian in South-east India: Aspects of Religious Continuity and Change, 1800–1900. Routledge. p. 72. ISBN 0913215554.
 24. Krishnamachari, Suganthy (12 December 2008). "For intellectual appeal". The Hindu. Archived from the original on 19 December 2008.

 

ఇతర గ్రంథాలు[మార్చు]

 • A. Oddie, Geoffrey (1991). Hindu and Christian in South-east India: Aspects of Religious Continuity and Change, 1800–1900. Routledge. p. 255. ISBN 0913215554.