ఎస్.హెచ్.రజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మవిభూషణ
సయ్యద్ హైదర్ రజా
Sayed Haider Raza (1995).png
Syed Haider Raza
జననం(1922-02-22) 1922 ఫిబ్రవరి 22
బబారియా, సెంట్రల్ ప్రోవిన్స్ అండ్ బేరర్
బ్రిటిష్ ఇండియా
మరణం2016 జూలై 23 (2016-07-23)(వయసు 94)
న్యూఢిల్లీ, భారతదేశం
జాతీయతభారతీయుడు
రంగంచిత్రకారుడు
అవార్డులుపద్మవిభూషణ 2013
పద్మభూషణ 2007
లలిత కళా అకాడమీ ఫెలోషిప్ 1981
పద్మశ్రీ 1981
కమాండర్ ఆఫ్ లిగయాన్ హానర్ 2015

సయ్యద్ హైదర్ రజా (ఎస్.హెచ్.రజా) (22 ఫిబ్రవరి 1922 – 2016 జూలై 23) భారతీయ చిత్రకారుడు. ఆయన 1950 నుండి ఫ్రాన్స్లో నివాసముంటున్నాఅరు. ఆయనకు భారతదేశంతో బలమైన అనుబంధం ఉంది.[1]

ఆయన భారతీయ భావనలను, ప్రతీకలను తన కుంచె ద్వారా ప్రపంచానికి ఆవిష్కరించిన ప్రముఖ చిత్రకారుడు.[2][3] బిందు, పురుష్-ప్రకృతి, నారి వంటి కళాఖండాల ద్వారా ఆయన ప్రసిద్ధి పొందారు.[4] సులభంగా అర్థమయ్యే అమూర్త రేఖాగణిత శైలిలో ఆయన బొమ్మలు గీసేవారు. ఆయనకు 1981లో పద్మశ్రీ మరియు లలిత కళా అకాడమీలో ఫెలోషిప్ లభించాయి.[5] 2007లో పద్మభూషణ పురస్కారాన్ని అందుకున్నారు.[6] 2013లో పద్మవిభూషణ పురస్కారాన్ని పొందారు.[7] 2015 జూలై 14లో ఫ్రాన్స్ దేశపు అత్యున్నత పురస్కారం అయిన "కమాడియర్ డె లా లెగియన్ డి హోనర్" పురస్కారం పొందారు.[8]

ఆయన భారతదేశంలో ఖరీదైన నవీన చిత్రాలు వేసిన కళాకారునిగా 2010 జూన్ 10 న "సౌరాష్ట్ర" చిత్రం 16.42 కోట్లకు క్రిస్టిల్స్ వేలంపాటలో అమ్మడంద్వారా ప్రసిద్ధి పొందాడు.[9][10]

1959లో ఆయన ఫ్రెంచ్ కళాకారిణి జానినే మొంగిలాట్ ను వివాహమాడారు. కానీ ఆమె 2002లో క్యాన్సర్ వ్యాధితో మరణించింది. తరువాత ఆయన భారతదేశం తిరిగి రావడానికి నిర్ణయించాడు.[11][12]

జీవిత విశేషాలు[మార్చు]

సయ్యద్మ హైదర్ రజా మధ్యప్రదేశ్ లోని మడాలా జిల్లా బాబరియాలో సయ్యద్ మొహమ్మద్ రజా మరియు తహీరా బేగం దంపతులకు 1922లో జన్మించారు.[13] ఆయన తండ్రి జిల్లా డిప్యూటీ అటవీ అధికారిగా పనిచేసారు.[14][15] ఆయన తన 12వ యేట నుంచే బొమ్మలు వేయడం ప్రారంభించారు. తన 13 వయేట మధ్యప్రదేశ్ లోని "డమో"కు వెళ్ళి [16] పాఠశాల విద్యను ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డెమోలో పూర్తిచేసారు.[17]

పాఠశాల విద్య తరువాత ఆయన 1939-43 మధ్య నాగపూర్ లోని నాగపుర్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లొ విద్యనభ్యసించారు. తరువాత 1943-47 మధ్య బాంబే లోని సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదివారు.[18] ఆయన అక్టోబరు 1950లో పారిస్ లోని "ఎకోల్ నేషనల్ సుపెరియర్ డెస్ బెయాక్జ్"లో విద్యనభ్యసించడానికి ఫ్రాన్స్ కు వెళ్ళే ముందు ఆయన యురప్ గుండా ప్రయాణించారు. తరువాత ఆయన పారిస్ లో జివించడానికి అచ్చట తన ప్రదర్శనలివ్వడాన్ని కొనసాగించారు.[17] 1956 లో పారిస్ లో ఆయనకు "ప్రిక్స్ డె లా క్రిటిక్" అనే పురస్కారం వచ్చింది. ప్రెంచ్ దేశీయుడు కాని వ్యక్తి పొందిన మొదటి పురస్కారం యిది.[19]

ప్రజా సేవలు[మార్చు]

ఆయన "రజా ఫౌండేషన్"ను భారతదేశాంలో స్థాపించారు. దీనిని భారతదేశంలోని యువకులలో చిత్రకళను అభివృద్ధి చేయాలనే తలంపుతో ప్రారంభించారు. ఈ సంస్థ ప్రతీయేటా యువ కళాకారునికి "రజా ఫౌండేషన్ పురస్కారం"ను అందిస్తుంది.[20]

పురస్కారాలు[మార్చు]

 • 1946: సిల్వర్ మెడల్, బాంబే ఆర్ట్ సొసైటీ, ముంబై
 • 1948: బంగారు పతకం, బాంబే ఆర్ట్స్ సొసైటీ, ముంబై.
 • 1956: ప్రిక్స్ డే లా క్రిటిక్ పురస్కారం, పారిస్.
 • 1981: పద్మశ్రీ పురస్కారం, భారతదేశ ప్రభుత్వం.
 • 1981: లలిత కళా అకాడామీ ఫెలోషిప్, న్యూఢిల్లీ.
 • 1981: కళా సమ్మాన్, మధ్యప్రదేశ్ ప్రభుత్వం..
 • 2007: పద్మభూషణ్ పురస్కారం భారత ప్రభుత్వం.
 • 2013: పద్మ విభూషణ్ పురస్కారం భారత ప్రభుత్వం.
 • 2013: జీవించి ఉన్న ప్రసిద్ధ భారతీయులలో ఒకరు...ఎన్.డి.టి.వి. ఇండియా
 • 2015: కమాండెర్ డే లా లెజియన్ హన్నెర్, ఫ్రాన్స్ ప్రభుత్వం

మూలాలు[మార్చు]

 1. Syed Haider Raza turns 85 The Hindu, 21 Feb 2007.
 2. Painting is like sadhana... dnaindia, 18 September 2005.
 3. Artist Details Raza at serigraphstudio.com.
 4. కళారంగ మేరునగం ఎస్‌హెచ్ రజా కన్నుమూత
 5. Lalit Kala Ratna Profiles Official list of Awardees at lalitkala.gov.in.
 6. Padma Bhushan Awardees
 7. "Padma Awards". pib. 29 January 2013. Retrieved 29 January 2013. Cite web requires |website= (help)
 8. "Noted artist Raza conferred highest French civilian honour". The Hindu. 15 July 2015. Retrieved 17 July 2015. Cite web requires |website= (help)
 9. "Raza work fetches record Rs 16.3cr". Times of India. 11 June 2010. Retrieved 27 January 2013.
 10. Raza's Saurashtra Artwork and Auction details OSIANAMA.COM
 11. http://www.taoartgallery.com/s-h-raza/
 12. http://timesofindia.indiatimes.com/city/delhi/S-H-Raza-dies-at-94-end-of-an-era-in-Modern-Indian-art/articleshow/53353797.cms
 13. Biography shraza.net, the Official website.
 14. Artist Bio Raza Retrospective 2007, New York.
 15. Profiles S H Raza at delhiartgallery.com.
 16. Profile of the Month Sayed Haider Raza at indianartcircle.com.
 17. 17.0 17.1 Artist Summary Sayed Haider Raza at artfact.com.
 18. Artist Background
 19. [1] S. H. Raza at vadehraart.com.[dead link]
 20. Newsmakers The Milli Gazette Online, April 2005.

ఇతర లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
Online Work