Jump to content

ఎస్. జగద్రక్షకన్

వికీపీడియా నుండి
S. Jagathrakshakan
జననం (1950-08-15) 1950 ఆగస్టు 15 (వయసు 74)
Kalingamali, Distt. Villupuram (Tamil Nadu)
వృత్తిMember of Parliament
జీవిత భాగస్వామిJ. Anusuya
పిల్లలుone son(Mr. J.Lakshmi Narayana Alias Sundeep Aanand ) and one daughter(Mrs. Srinisha )
తల్లిదండ్రులుG. Swamikannu Gounder and Lakshmiamma[1]

ఎస్. జగద్రక్షకన్ తమిళనాడులోని అరక్కోణం పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రస్తుత 15వ లోకసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

బాల్యం

[మార్చు]

ఎస్. జగద్రక్షకన్ ఫిబ్రవరి 6, 1948లో తమిళనాట విల్లుపురం, కలింగమలై, లో జన్మించారు. వీరి తల్లి దండ్రులు లక్షమమ్మ, స్వామికన్ను గౌండర్.

కుటుంబము

[మార్చు]

వీరు 1973 సెప్టెంబరు 9 లో అనసూయను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె కలరు.

రాజకీయ ప్రస్తావనం

[మార్చు]

జగద్రక్షకన్ 1980-84 వరకు తమిళనాడు శాసనసభలో సభ్యునిగా ఉన్నారు. 1985లో 8వ లోకసభకు ఎ.ఐ.డి.ఎం.కె తరుపున పోటీ చేసి ఎన్నికయి పార్లమెంటులో అడుగు పెట్టారు. 1999 లో తిరిగి లోకసభకు గెలుపొందారు. 2009 లో 15వ లోకసభకు ఎన్నికయి కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.

గ్రంథ రచన

[మార్చు]

వీరు వివిధ విషయాలపై 60 పైగా గ్రంథాలు రచించారు. వాటిలో చాల వరకు వివిధ విశ్వవిద్యాలయాలో పాఠ్య పుస్తకాలుగా ఎన్నుకోబడ్డాయి. వీరు మదర్ థెరిసాపై కూడా ఒక గ్రంథం వ్రాసారు. వీరి పుస్తకాలు అనేక పురస్కారలను అందుకున్నాయి.

మూలాలు

[మార్చు]
  1. "Biographical sketch at Indian Parliament website". National Informatics Centre. Archived from the original on 5 అక్టోబరు 2013. Retrieved 22 November 2013.

ఇతర లింకులు

[మార్చు]