Jump to content

ఎ.కె.ఎస్.విజయన్

వికీపీడియా నుండి
ఎ.కె.ఎస్.విజయన్

తరువాత ఎం. సెల్వరసు
నియోజకవర్గం నాగపట్నం

వ్యక్తిగత వివరాలు

జననం (1961-12-15) 1961 డిసెంబరు 15 (వయసు 63)
Tiruvarur, తమిళనాడు
రాజకీయ పార్టీ డిఎంకె
జీవిత భాగస్వామి V. Jothi
నివాసం Tiruvarur
September 22, 2006నాటికి

శ్రీ ఎ.కె.ఎస్.విజయన్ 15వ లోక్ సభ సభ్యుడు. ఆయన నాగపట్నం నుండి డి.ఎం.కె పార్టీ తరపున గెలిచి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యాడు.

బాల్యము

[మార్చు]

శ్రీ ఎ.కె.ఎస్. విజయ గారు డెశెంబరు 15 న 1961 లో తమిళనాడు తిరువరూర్ జిల్లా సీతామల్లి గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి పేరు: శ్రీ ఎ.కె.సుబ్బయ్య. తల్లి: శ్రీమతి సుబ్బమ్మాళ్. వీరి విద్యాభ్యాసము చెన్నైలోని మద్రాస్ విశ్వవిద్యాలయంలో సాగినది. వీరు బి.ఎ. పట్టా పొందారు.

కుటుంబము

[మార్చు]

వీరు జూలై 14 వ తారీఖున 1993 వ సంవత్సరంలో శ్రీమతి జ్యోతి గారిని వివాహం చేసుకున్నారు. వీరి నివాసము తమిళనాడు లోని తిరువారూర్.

రాజకీయ ప్రస్తానం

[మార్చు]

వీరి రాజకీయ ప్రస్థానం 1991 లో డి.ఎం.కె. పార్టీ యూనియన్ డిప్యూటి సెక్రటరీగా ప్రారంభమైనది. 1996 లో తమిళనాడు కొత్తూరు జిల్లా డి.ఎం.కె. సెక్రటరీగా పనిచేశారు. ఆతర్వాత 1999 లో 13 వ లోక్ సభకు ఎన్నికై సేవలందించారు. పార్లమెంటు సభ్యునిగానే వుంటూ అనేక పార్లమెంటరీ కమిటిలలో సభ్యునిగా సేవ లందించారు. 2004 లో ఎ.కె.ఎస్.విజయన్ గారు ప్రస్తుత 15వ లోక్ సభ సభ్యుడు. వీరు నాగపట్టిణం (ఎస్.సి) నియోజిక వర్గం నుండి డి.ఎం.కె పార్టీ తరపున గెలిచి పార్లమెంటులు సభ్యునిగా సేవలందిస్తున్నారు.

పర్యటించిన దేశాలు

[మార్చు]

వీరు కనడా, జర్మనీ,మలేషియా, ఫ్రాన్స్, సింగపూరు, శ్రీలంక, తాయ్ లాండ్, యు.ఎ.ఇ., యు.ఎస్.ఎ. యు.కె. మొదలగు దేశాలలో పర్యటించారు.

మూలాలు

[మార్చు]