ఎ.కె.సి.నటరాజన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎ.కె.సి.నటరాజన్
AKC Natarajan.jpg
వ్యక్తిగత సమాచారం
జననం (1931-05-30) 1931 మే 30 (వయస్సు 90)
తిరుచిరాపల్లి, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వాయిద్యాలుక్లారినెట్

ఆంజల కుప్పుస్వామి చిన్నికృష్ణ నటరాజన్ (జననం 30 మే 1931) ఒక కర్ణాటక సంగీత క్లారినెట్ విద్వాంసుడు. ఇతడు కర్ణాటక గాత్ర సంగీతాన్ని అలత్తూర్ వెంకటేశ అయ్యర్ వద్ద, నాదస్వరాన్ని ఇలుప్పుర్ నటేశపిళ్ళై వద్ద నేర్చుకున్నాడు.[1] నాదస్వర పండితుడు టి.ఎన్.రాజరత్నంపిళ్ళై ఇతడిని "క్లారినెట్ ఎవరెస్ట్"గా అభివర్ణించాడు.[2]మద్రాసు సంగీత అకాడమీ 2008లో ఇతనికి సంగీత కళానిధి పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1994లో సంగీత నాటక అకాడమీ అవార్డు ఇతడిని వరించింది.[3] తిరుచిరాపల్లి లోని నాదద్వీపం ట్రస్టు ఇతడిని "నాదద్వీప కళానిధి" బిరుదుతో గౌరవించింది.[4] 2019లో శ్రీపురం శ్రీనారయణీ పీఠం ఇతడిని ఆస్థాన విద్వాంసునిగా నియమించింది. ఇతడు ఆకాశవాణి నిలయవిద్వాంసునిగా పలుసార్లు ఆకాశవాణిలో సంగీత కార్యక్రమాలు చేశాడు.

మూలాలు[మార్చు]

  1. "A.K.C. Natarajan to be honoured with 'Sangita Kalanidhi' title". The Hindu. Archived from the original on 2 ఆగస్టు 2013. Retrieved 2 August 2013.
  2. Nahla Nainar (20 June 2020). "AKC Natarajan: A decades-old bridge between the clarinet and Carnatic music". The Hindu. Retrieved 2 March 2021.
  3. "list of awardee". Sangeet Natak Academy. Archived from the original on 30 May 2015. Retrieved 2 August 2013.
  4. "AKC Natarajan honoured". The Hindu. Archived from the original on 2 ఆగస్టు 2013. Retrieved 2 August 2013.