Jump to content

ఎ.జి. మిల్ఖా సింగ్

వికీపీడియా నుండి
ఎ.జి. మిల్ఖా సింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
అమృత్‌సర్ గోవింద్‌సింగ్ మిల్ఖా సింగ్
పుట్టిన తేదీ(1941-12-31)1941 డిసెంబరు 31
మద్రాసు, మద్రాసు రాష్ట్రం
మరణించిన తేదీ2017 నవంబరు 10(2017-11-10) (వయసు 75)
చెన్నై
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం పేస్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 97)1960 జనవరి 13 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1961 నవంబరు11 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా
మ్యాచ్‌లు 4 88
చేసిన పరుగులు 92 4,324
బ్యాటింగు సగటు 15.33 35.44
100లు/50లు 0/0 8/27
అత్యధిక స్కోరు 35 151
వేసిన బంతులు 6 410
వికెట్లు 0 5
బౌలింగు సగటు 49.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/22
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 44/–
మూలం: ESPN Cricinfo, 2017 మార్చి 16

అమృత్‌సర్ గోవింద్‌సింగ్ మిల్ఖా సింగ్ (1941 డిసెంబరు 31 – 2017 నవంబర్ 10) భారతీయ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. [1] మిల్ఖా సింగ్ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్. అప్పుడప్పుడు కుడిచేతితో మీడియం పేస్ బౌలింగు కూడా చేసేవాడు. అతను ప్రసిద్ధ క్రికెటర్లు AG రామ్ సింగ్, AG కృపాల్ సింగ్‌ల కుటుంబానికి చెందినవాడు.

అతను తెలివైన స్కూల్‌బాయ్ క్రికెటర్. అతని ప్రదర్శనల కారణంగా 16 సంవత్సరాల వయస్సులో అతనికి తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ ఆడే అవకాశం వచ్చింది. అతను ఇంటర్జోనల్ కూచ్ బెహార్ ట్రోఫీలో సౌత్ జోన్ పాఠశాలలకు ప్రాతినిధ్యం వహించాడు. వెస్ట్ జోన్‌తో జరిగిన ఫైనల్‌లో 114 పరుగులు చేశాడు. ఆ సంవత్సరం సిలోన్‌లో పర్యటించిన ఇండియన్ స్కూల్స్ వైస్ కెప్టెన్సీకి ఎంపికయ్యాడు. చెన్నైలోని లయోలా కాలేజీలో చదివిన మిల్ఖా రెండుసార్లు ఉత్తమ కాలేజి క్రికెటర్‌గా ఎన్నికయ్యాడు. విశ్వవిద్యాలయానికి, రాష్ట్రానికీ ప్రాతినిధ్యం వహించారు.

మిల్ఖా సింగ్ నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 1959-60లో ఆస్ట్రేలియన్‌లకు వ్యతిరేకంగా తొలి మ్యాచ్‌ ఆడాడు. 1960-61లో పాకిస్థాన్‌లో పర్యటించాడు. 1961-62లో ఇంగ్లండ్‌తో ఒక టెస్టు ఆడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో, భారత జట్టులో AG కృపాల్ సింగ్, వామన్ కుమార్ కూడా ఉన్నారు. ముగ్గురు తమిళనాడు ఆటగాళ్ళు భారత జట్టులో కనిపించిన ఏకైక సందర్భం అది. మిల్ఖా తన చివరి టెస్టు ఆడినప్పుడు అతనికి కేవలం 19 ఏళ్లు.


అతను రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున 2,000 పైచిలుకు పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫీలో సెంచరీ చేసిన మొదటి ఆటగాడతడు.

మూలాలు

[మార్చు]
  1. "Former TN and India cricketer AG Milkha Singh dies aged 75". ESPNcricinfo. 10 November 2017. Retrieved 10 November 2017.