ఎ.టి.అరియరత్నె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అహంగమాగె తుదొర్ అరియరత్నె
Dr Ariyaratne meeting with leaders in the North.jpg
డాక్టర్. ఎ.టి.అరియరత్నె
జననం (1931-11-05) 1931 నవంబరు 5 (వయస్సు: 88  సంవత్సరాలు)
ఉనవతునా, గల్లె జిల్లా, శ్రీలంక
జాతీయతశ్రీలంకన్
విద్యాసంస్థలుమహింద కాలేజి, గల్లె
విద్యోదయ విశ్వవిద్యాలయం
ప్రసిద్ధులుసర్వోదయ శ్రమదానోద్యమ వ్యవస్థాపకుడు
మతంబౌద్ధం

శ్రీలంకాభిమాన్య అహంగమాగె తుదొర్ అరియరత్నె (Sinhala:අහන්ගමගේ ටියුඩර් ආරියරත්න) శ్రీలంకలో సర్వోదయ శ్రమదానోద్యమ వ్యవస్థాపకుడు.

జీవితం[మార్చు]

ఎ.టి. అరియరత్నె 5 నవంబరు 1931న శ్రీలంకలోని గల్లె జిల్లాలో ఉనవతునె గ్రామంలో జన్మించారు. గల్లెలోని మహింద కళాశాలలో పాఠశాల విద్యనభ్యసించారు. ఆయన ఉపాధ్యాయుల పాఠశాలలో విద్యను అభ్యసించారు, ఆ తర్వాత 1972 వరకూ కొలంబోలోని నలంద కళాశాలకు చెందిన ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. అరియరత్నె సర్వోదయ శ్రమదానోద్యమంలో కృషిచేయడం 1958 నుంచి ప్రారంబించారు. విద్యోదయ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో బి.ఎ. పట్టాను పొంది, అనంతరం తన కృషికి గాను అదే విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డి.లిట్. స్వీకరించారు. ఫిలిప్పైన్స్‌కు చెందిన ఎమిలియొ అగునల్డొ కళాశాల నుంచి హ్యుమానిటీస్ రంగంలో గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. అరియరత్నె బౌద్ధంలో అంకితభావం కలిగిన భక్తుడు, సమాజాభివృద్ధి సంబంధిత కార్యకలాపాల్లోనూ, శ్రీలంక రాజకీయాల్లోనూ చురుకుగా పనిచేస్తున్నారు.

1969లో ప్రజానాయకత్వానికి గాను రామన్ మెగసెసే పురస్కారం, 1996లో భారత ప్రభుత్వం నుంచి గాంధీ శాంతి బహుమతి, 1992లో నివానో శాంతి బహుమతి సహా అనేక అంతర్జాతీయ గౌరవాలను, పురస్కారాలను శాంతి, గ్రామాభివృద్ధి రంగాల్లో కృషికి పొందారు. 2006లో, 2005కు గాను ఆచార్య సుశీల్ కుమార్ అంతర్జాతీయ శాంతి బహుమతిని పొందారు. ఈ అవార్డును పొందినవారిలో జాన్ పొలాన్యి, 2004లో దలైలామా ఉన్నారు. 2007లో శ్రీలంకలో అత్యున్నత జాతీయ గౌరవమైన అరియరత్నె శ్రీలంకాభిమన్యను స్వీకరించారు.[1]

అరియరత్నె, గాంధేయవాద సిద్ధాంతాలైన అహింస, గ్రామీణాభివృద్ధి, త్యాగం వంటివాటిని గాఢంగా విశ్వసిస్తారు. ఈ సిద్ధాంతాల ద్వారానే సర్వోదయ ఉద్యమంలో బౌద్ధమతాదర్శాలైన స్వార్థత్యాగం వంటివాటికి, అభివృద్దికి సంబంధించిన లౌకిక సిద్ధాంతాలకు మధ్య బలమైన బంధాన్ని నిర్మించారు. అంకితభావం కలిగిన బౌద్ధునిగా, వేలాది కుటుంబ సమ్మేళనాలు, ధ్యాన కార్యక్రమాలలోనూ శ్రీలంకలోని, ప్రపంచవ్యాప్తంగానూ లక్షలాదిమందిని పాల్గొనేలా చేశారు. హ్యుబర్ట్ హెచ్. 1994లో హంఫ్రే అంతర్జాతీయ పురస్కారాన్ని మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి సంబంధించిన హ్యుబర్ట్ హెచ్. హంఫ్రే ప్రజాసంబంధాల పాఠశాల ద్వారా పొందినప్పుడు ఆయన శిష్యుడు డాక్టర్ పాట్రిక్ మెండిస్ అరియరత్నెను శ్రీలంక గాంధీగా సంబోధించారు.[2]

  1. "Conferred Sri Lankabhimanya". మూలం నుండి 3 డిసెంబర్ 2007 న ఆర్కైవు చేసారు. Retrieved 2 December 2007. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite web requires |website= (help)
  2. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2011-07-15 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-02-21. Cite web requires |website= (help)