ఏంజలినా జోలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏంజలినా జోలీ
Photograph of Angelina Jolie
జూన్ 2014లో లైంగిక హింస వివాదంపై జరిగిన ప్రపంచ సదస్సులో ఏంజలినా
జననం
ఏంజలినా జోలీ వాయిట్

జూన్ 4, 1975
పౌరసత్వం
  • అమెరికా
  • కంబోడియా
వృత్తి
  • నటి
  • సినీ నిర్మాత
  • సామాజిక కార్యకర్త
క్రియాశీల సంవత్సరాలు1982–ప్రస్తుతం
జీవిత భాగస్వామిజానీ లీ మిల్లర్(1996-వివాహం, 2000-విడాకులు)
బిల్లీ బాబ్ తొర్నటన్(2000-వివాహం, 2003-విడాకులు)
బ్రాడ్ పిట్(2014-వివాహం, 2016-విడిపోయారు)
పిల్లలు6
తల్లిదండ్రులు
  • జోన్ వాయిట్
  • మార్చెలైన్ బెర్ట్రాండ్
బంధువులు
  • జేమ్స్ హెవెన్ (సోదరుడు)
  • బేరీ వాయిట్ (అంకుల్)
  • చిప్ టెయిలర్ (అంకుల్)

ఏంజెలినా జోలీ ( అసలు పేరు ఏంజలినా జోలీ వాయిట్ , 1975 జూన్ 4)[1] అమెరికాకు చెందిన ప్రముఖ నటి, నిర్మాత, సామాజిక కార్యకర్త. ఇప్పటి వరకూ ఆమె కెరీర్ లో ఒక ఆస్కార్ అవార్డు, రెండు స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ పురస్కారాలు, మూడు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు అందుకుంది. హాలీవుడ్ లో అత్యంత ఎక్కువ పారితోషికం తీసుకునే నటిగా కూడా ప్రసిద్ధి చెందింది ఆమె. 1982లో ఆమె తండ్రి జాన్ వాయిట్ తో కలసి లుకింగ్ టు గెట్ ఔట్ అనే సినిమాలో బాలనటిగా నటించింది ఏంజలినా. కానీ ఆమె దశాబ్దం తరువాత 1993లో చిన్న బడ్జెట్ సినిమా అయిన కిబోర్గ్ 2 తో అసలు కెరీర్ ప్రారంభించింది. 1995లో హేకర్స్ అనే పెద్ద బడ్జెట్ సినిమాలో కథానాయికగా మొదటిసారి నటించింది ఏంజలినా. ఆ తరువాత 1997లో ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకున్న జార్జి వాలేస్, 1998లో గియా వంటి జీవితచరిత్రాత్మక సినిమాల్లో నటించి, ప్రేక్షకుల మెప్పు పొందింది. 1999లో గర్ల్ ఇంటరప్టెడ్ అనే సినిమాతో ఆమె ఉత్తమ సహాయనటి కేటగిరిలో ఆస్కార్ పురస్కారం అందుకుంది.

2001లో లారా క్రాఫ్ట్: టాంబ్ రైడర్ అనే వీడియో గేమ్ లో కథానాయిక లారా క్రాఫ్ట్ గా నటించడంతో ఏంజలినా హాలీవుడ్లో ప్రముఖ నటిగా ఎదిగింది. ఆమె 2005లో మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్, 2008లో వాంటెడ్, 2010లో, 2021లో ఎటర్నల్స్ సాల్ట్ వంటి యాక్షన్ సినిమాల్లో నటించి, తన కెరీర్ ను సుస్థిరపరచుకుంది. 2007లో నటించిన ఎ మైటీ హార్ట్, 2008లో చేసిన చాలెంజింగ్ సినిమాల్లోని ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. చాలెంజింగ్ సినిమాకుగానూ ఉత్తమ నటి కేటగిరీలో ఏంజలినాకు ఆస్కార్ పురస్కారానికి నామినేషన్ లభించడం విశేషం. 2014లో విడుదలైన ఫాంటసీ చిత్రం మేల్ ఫిసెంట్ తో తన కెరీర్ లోనే అతి పెద్ద కమర్షియల్ విజయం అందుకుంది ఆమె. 2010వ దశకంలో ఏంజలినా రచయిత, నిర్మాతగానూ మారింది. 2011లో ఇన్ ది లాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ, 2014లో అన్ బ్రోకెన్, 2017లో ఫర్స్ట్ దే కిల్డ్ మై ఫాదర్ సినిమాలకు రచన, నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.

తొలినాళ్ళ జీవితం, కుటుంబం[మార్చు]

ఏంజలినా కాలిఫోర్నియాలోని లాస్ ఏంజలెస్లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జాన్ వాయిట్, మార్చెలైన్ బెర్ట్రాండ్ లు ఇద్దరూ సినీ నటులే. ఆమె బాబాయి చిప్ టెయిలర్ ప్రముఖ గాయకుడు, గీత రచయిత.[2] ఏంజలినా పెద్దనాన్న బేరీ వాయిట్ ప్రముఖ భౌగోళిక అగ్నిపర్వత శాస్త్రజ్ఞుడు.[3] నటి జాక్వెలిన్ బిస్సెట్, నటుడు మాక్సిమిలియన్ షెల్ లు ఏంజలినాకు గాడ్ పేరెంట్స్.[4]

1988లో జరిగిన 60వ ఆస్కార్ పురస్కార వేడుకల్లో పాల్గొన్న జాన్ వాయిట్. ఈ వేడుకల్లో అతని పిల్లలు కూడా పాల్గొన్నారు.

1976లో ఏంజలినా తల్లిదండ్రులు విడిపోయారు. అప్పటి నుంచి ఆమె, ఆమె సోదరుడు తమ తల్లి దగ్గర ఉండేవారు. వీరిద్దర్నీ పెంచేందుకు ఆమె తల్లి తన నటన కెరీర్ ను వదులుకుంది.[5] ఏంజలినా తల్లి, ఆమెను కేథలిక్‌గానే పెంచినా, చర్చికి వెళ్ళడం మాత్రం ఎప్పుడూ నిబంధనగా చేయలేదు.[6] ఆమె నటి కావడానికి తన తండ్రి విజయవంతమైన కెరీర్ కన్నా, చిన్నతనంలో ఆమె తన తల్లితో కలసి చూసిన సినిమాలే కారణమవడం విశేషం.[7] అయితే ఆమె 1982లో తన తండ్రి సినిమా లుకింగ్ టు గెట్ ఔట్ లో చిన్న పాత్రలో కనిపించింది.[8] ఏంజలినా ఆరేళ్ళ వయసులో, ఆమె తల్లి బెర్ట్రాండ్, లివి-ఇన్ భాగస్వామి, సినీ నిర్మాత బిల్ డే లు తమ కుటుంబాన్ని న్యూయార్క్‌లోని పాలిసడేస్ కు మార్చారు.[9] ఐదేళ్ళ తరువాత వారు తిరిగి లాస్ ఏంజలస్ కు వచ్చేశారు.[5] ఆ తరువాత సినిమాల్లోనే కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకున్న ఏంజలినా, లీ స్ట్రాస్ బెర్గ్ ధియేటర్ ఇన్స్టిట్యూట్ లో రెండేళ్ళ పాటు శిక్షణ తీసుకుంది. అక్కడ చేరాకా ఆమె ఎన్నో నాటకాల్లో నటించింది.

మూలాలు[మార్చు]

  1. "Angelina Jolie Biography: Director, Film Actress (1975–)". Biography.com (FYI / A&E Networks). Archived from the original on August 25, 2015. Retrieved November 11, 2015.
  2. Udovitch, Mim (August 19, 1999). "The Devil in Miss Jolie". Rolling Stone. Retrieved February 6, 2015.
  3. Applebome, Peter (December 20, 2009). "From Writing 'Wild Thing' to Nostalgia for Yonkers". The New York Times. Sulzberger Jr., Arthur Ochs. Retrieved July 22, 2014.
  4. Mitchell, Peter (April 12, 2004). "Jolie denies affair". The Age. Australian Associated Press. Retrieved February 6, 2015.
  5. 5.0 5.1 Van Meter, Jonathan (April 2002). "Angelina Jolie: Body Beautiful". Vogue. Archived from the original on June 6, 2002.
  6. Cohen, Rich. "A Woman in Full". Vanities (in ఇంగ్లీష్). Retrieved 2017-09-29.
  7. Wills, Dominic. "Angelina Jolie Biography". TalkTalk. Retrieved December 28, 2014.
  8. Heath, Chris (July 5, 2001). "Blood, Sugar, Sex, Magic". Rolling Stone. Retrieved December 28, 2014.
  9. Jerome, Jim (April 11, 1983). "For Single Father Jon Voight 'Table for Five' Is a Story Close to His Own Painful Experience". People. Retrieved December 28, 2014.