అమల్ కుమార్ సర్కార్
Appearance
(ఏ.కె. సర్కార్ నుండి దారిమార్పు చెందింది)
అమల్ కుమార్ సర్కార్ | |
---|---|
8వ భారత ప్రధాన న్యాయమూర్తి | |
In office 1966 మార్చి 16 – 1966 జూన్ 29 | |
Appointed by | సర్వేపల్లి రాధాకృష్ణన్ |
అంతకు ముందు వారు | పి.బి. గజేంద్రగడ్కర్ |
తరువాత వారు | కోకా సుబ్బారావు |
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి | |
అంతకు ముందు వారు | ప్రకాష్ చంద్ర తాటియా డిఎన్. పటేల్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | పశ్చిమ బెంగాల్ | 1901 జూన్ 29
మరణం | 2001 డిసెంబరు 18 ముంబై | (వయసు 100)
జస్టిస్ అమల్ కుమార్ సర్కార్, (1901, జూన్ 29 - 2001, డిసెంబరు 18) భారతదేశ సుప్రీంకోర్టు ఎనమిదవ ప్రధాన న్యాయమూర్తి. 1966 మార్చి 16 నుండి 1966 జూన్ 29న పదవీ విరమణ చేసే వరకు పనిచేశాడు.[1]
జననం, విద్య
[మార్చు]అమల్ కుమార్ సర్కార్ 1901 జూన్ 29న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించాడు. ప్రతిష్టాత్మకమైన స్కాటిష్ చర్చిస్ కాలేజీలో, బంగాబాసి కాలేజీలో, కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న యూనివర్సిటీ లా కాలేజీలో చదువుకున్నాడు.[2][3]
వృత్తిజీవితం
[మార్చు]కలకత్తా హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. 1949 జనవరిలో కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు.[1] 1957 మార్చి వరకు ప్రాక్టీస్ కొనసాగించాడు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Biography on Supreme Court website
- ↑ Some Alumni of Scottish Church College in 175th Year Commemoration Volume. Scottish Church College, April 2008. page 591
- ↑ Sen, Asit. Glimpses of College History: The Students and the Teachers in 175th Year Commemoration Volume. Scottish Church College, April 2008. page 234