ఏ.సి.జోస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏ.సి.జోస్
എ.സി. ജോസ്
ఏ.సి.జోస్


భారత పార్లమెంటు సభ్యులు
పదవీ కాలము
1999 – 2004[1]
ముందు ఎ.పి.కురియన్
తరువాత వక్కొం పురుషోత్తమన్
నియోజకవర్గం పరవూర్ తాలూకా

పదవీ కాలము
1998 – 1999[1]

భారత పార్లమెంటు సభ్యులు
పదవీ కాలము
1996 – 1997[1]

కేరళ రాష్ట్ర అసెంబ్లీ స్పీకరు.
పదవీ కాలము
3 ఫిబ్రవరి 1982 – 23 జూన్ 1982

వ్యక్తిగత వివరాలు

జననం (1937-02-05) 1937 ఫిబ్రవరి 5 [1]
ఏడపల్లి, ఎర్నాకుళం జిల్లా, కేరళ రాష్ట్రం, భారతదేశం
మరణం 2016 జనవరి 23 (2016-01-23)(వయసు 78)
కోచి
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ Flag of the Indian National Congress.svg
జీవిత భాగస్వామి ప్రొఫెసర్. లీలమ్మ జోస్
నివాసము ఎడపల్లి, ఎర్నాకుళం, కేరళ.
పూర్వ విద్యార్థి ప్రభుత్వ న్యాయ కళాశాల, ఎర్నాకుళం
మతం క్రిస్టియన్

అంబట్ ఛాకో జోస్ (మళయాళం|അമ്പാട്ട് ചാക്കോ ജോസ്; 1937 ఫిబ్రవరి 5 – 2016 జనవరి 23) భారతదేశ రాజకీయనాయకుడు. ఆయన కేరళ సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌గా సేవలనందించారు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన ఫిబ్రవరి 5 1937 న ఎడపల్లి, ఎర్నాకుళం జిల్లాలో జన్మించారు. ఆయన ప్రముఖ అంబట్ కుటుంబానికి చెందినవారు. ఆయన కోచిలోని సెంట్‌ అల్బర్ట్స్‌ కాలేజీలో బి.ఎస్సీ చేశారు. తరువాత ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్.ఎల్.బి. డిగ్రీని పొందారు. ఆయన కేరళ విద్యార్థి యూనియన్ స్థాపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. 1969 నుండి 1979 వరకు ఆయన కొచ్చిన్ సిటీ కార్పొరేషన్ లో కౌన్సిలర్ గా ఉన్నారు. 1972 లో ఆ కార్పొరేషన్ కు మేయర్ గా తన సేవలనందించారు. 1980 లో ఆయన కేరళ శాసనసభలో పారవూర్ నియోజకవర్గం నుండి ఎన్నికై తన సేవలనందించారు. ఆయన 1982 లో కేరళ శాసనసభ స్వీకర్‌గా సేవలు అందించారు. సాధారణ ఎన్నికల్లో 1996, 1998, 1999 లో కాంగ్రెస్‌ ఎంపీగా లోక్‌సభకు ఎన్నికై 11వ, 12వ, 13వ లోక్‌సభలలో ప్రాతినిధ్యం వహించారు. ఆయన కొంతకాలం "వీక్షణం డైలీ" వార్తాపత్రికకు ప్రధాన సంపాదకులుగా ఉన్నారు. ఆయన కేరళ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్లో కీలక వ్యక్తి.

మరణం[మార్చు]

కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ జనవరి 24 2016 ఉదయం మృతి చెందారు.[3]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఏ.సి.జోస్&oldid=2322266" నుండి వెలికితీశారు