ఐక్య-రెడ్
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
మాడిపోయిన ట్యూబ్‌లైట్లో మళ్ళీవెలుగులు నింపేందుకు మండోజి నర్సింహాచారి రూపొందించిన పరికరం పేరు ఐక్య-రెడ్ (IKYA-ReD). ఈ పరికరం మాడిపోయిన ట్యూబ్‌లైట్ ను వెలిగించటమే ప్రధానమైనను ఈ పరికరం ద్వారా కొత్త ట్యూబ్‌లైట్ నూ వెలిగించవచ్చు. ఈ పరికరం ద్వారా ట్యూబ్‌లైట్‌ను వెలిగించినట్లయితే విద్యుత్ ఆదా కూడా అవుతుంది. ఈ పరికరం ద్వారా ట్యూబ్‌లైట్ వెలుగునప్పుడు గతకడం కూడా జరగదు, తడిసినా నీటిలో మునిగినా లైట్ వెలుగునిస్తూ ఉంటుంది.
- ఈ పరికరంతో లాభాలు
- కాలిపోయిన/కొత్త ట్యూబ్‌లైట్ ను వెలిగించవచ్చు.
- చౌక్, స్టార్టర్ ల అవసరం లేదు.
- తక్కువ ఓల్టేజ్ తో పనిచేస్తుంది.
- గతకదు.
- ఉపయోగించడం చాలా సులభం.
మండోజి నర్సింహాచారి
[మార్చు]- ప్రధాన వ్యాసం మండోజి నర్సింహాచారి
కాలిపోయిన ట్యూబ్ లైట్ను కూడా వెలిగించగల సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించి అందరిని అబ్బురపరచిన ఆవిష్కర్త మండోజి నర్సింహాచారి. ఇతను తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన వ్యక్తి.