ఐపీసీ సెక్షన్ భార్యాబంధు
ఐపీసీ సెక్షన్ భార్యాబంధు | |
---|---|
దర్శకత్వం | రెట్టడి శ్రీనివాస్ |
నిర్మాత | ఆలూరి సాంబశివరావు |
తారాగణం | ఆమని, శరత్‌చంద్ర, నేహా దేశ్ పాండే
|
ఛాయాగ్రహణం | పి.శ్యామ్ |
కూర్పు | మహింద్రనాథ్ |
సంగీతం | విజయ్ కురాకుల |
విడుదల తేదీ | 29 జూన్ 2018 |
సినిమా నిడివి | 114 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఐపీసీ సెక్షన్ భార్యాబంధు 2018లో విడుదలైన తెలుగు సినిమా. ఆలూరి క్రియేషన్స్ బ్యానర్ పై ఆలూరి సాంబశివరావు నిర్మించిన ఈ చిత్రానికి రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఆమని, శరత్‌చంద్ర, నేహా దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 29 జూన్ 2018లో విడుదలైంది.[1][2]
కథ
[మార్చు]అడ్వకేట్ వినాయకరావు ( శరత్ చంద్ర ) మహిళల పట్ల అంత అనుకూలంగా లేని అతను శృతి ( నేహా దేశ్ పాండే ) ని చూసి ప్రేమలో పడతాడు. భర్తలను ఇబ్బంది పెడుతూ పైగా ఐపీసీ సెక్షన్ 498 ఏ భార్యాబంధు చట్టాన్ని ఉపయోగించి మగాళ్ల ని ఆడుకునే మహిళల నుండి కాపాడాలని , ఆ చట్టాన్ని రద్దు చేశాకే పెళ్లి చేసుకోవాలని వినాయకరావు అనుకుంటాడు. అసలు వినాయకరావు మహిళల పట్ల , ఐపీసీ సెక్షన్ 498 ఏ భార్యాబంధు చట్టం పట్ల ఎందుకు వ్యతిరేకంగా ఉన్నాడు ? చివరకు అతడు అనుకున్నది సాధించాడా ? శృతి ప్రేమని పొందాడా ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- ఆమని
- శరత్‌చంద్ర [4]
- నేహా దేశ్‌పాండే
- మధునందన్
- రాగిణి
- శరత్ బాబు కాకర్ల
- వాసు ఇంటూరి
- సావేరి
- పద్మజయంతి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆలూరి క్రియేషన్స్
- నిర్మాత: ఆలూరి సాంబశివరావు
- దర్శకత్వం: రెట్టడి శ్రీనివాస్ [5]
- సంగీతం: విజయ్ కురాకుల
- పాటలు: మౌనశ్రీ మల్లిక్
- కెమెరా: పి.శ్యామ్
- ఎడిటర్ : మహింద్రనాథ్
మూలాలు
[మార్చు]- ↑ Zee News Telugu (26 June 2018). "ఫ్రైడే రిలీజ్ - ఒకేరోజు 9 సినిమాలు విడుదల". Zee News Telugu. Archived from the original on 1 ఆగస్టు 2018. Retrieved 16 June 2021.
- ↑ Sakshi (12 May 2018). "మగవాళ్లను రక్షించండి". Sakshi. Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
- ↑ The Times of India (29 June 2018). "IPC Section: Bharya Bandhu Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
- ↑ Sakshi (27 June 2018). "భర్తలకు సెక్షన్ ఏది?". Sakshi. Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
- ↑ Sakshi (28 June 2018). "ఉదయం ఆట ఉచితం". Sakshi. Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.