ఐరావతం (2022 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఐరావతం
దర్శకత్వంసుహాస్ మీరా
రచనసుహాస్ మీరా
నిర్మాతరాంకీ పలగాని
బాలయ్య చౌదరి చల్లా
లలిత కుమారి తోట
తారాగణంఅమర్‌దీప్ చౌదరి
తన్వి నేగి
ఎస్త‌ర్ నోరోన్హా
సప్తగిరి
ఛాయాగ్రహణంకార్తీక్ కొడకండ్ల
సంగీతంకార్తీక్ కొడకండ్ల
నిర్మాణ
సంస్థ
నూజివీడు టాకీస్
విడుదల తేదీ
2022 నవంబరు 17 (2022-11-17)
దేశంభారతదేశం
భాషతెలుగు

ఐరావతం 2022లో విడుదలైన తెలుగు సినిమా. నూజివీడు టాకీస్ బ్యానర్‌పై రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట నిర్మించిన ఈ సినిమాకు సుహాస్ మీరా దర్దకత్వం వహించాడు. అమర్‌దీప్ చౌదరి, తన్వి నేగి, ఎస్త‌ర్ నోరోన్హా, అరుణ్ కుమార్, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబరు 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైంది.[1]

కథ[మార్చు]

శ్లోక (తన్వి నేగి) కనకం (జయ వాహిని) కి చెందిన బ్యూటీ పార్లర్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఉంటుంది. బ్యూటీ పార్లర్ యజమాని కుమారుడు చిక్కు (అమర్‌దీప్ చౌదరి)తో శ్లోక ప్రేమలో ఉంటుంది. శ్లోక పుట్టినరోజు సందర్భంగా చిక్కు ఆమెకు కెమెరాని గిఫ్ట్ ఇస్తాడు. అందులో వీడియో రికార్డ్ చేసి చూస్తే శ్లోక బదులు అచ్చంగా ఆమె పోలికలతో ఉన్న ప్రిన్సి వీడియో ప్లే అవుతాయి. శ్లోక, ప్రిన్సిలో ఎవరో ఒకరు మరణిస్తారని చెప్పిన ఫేస్ రీడర్ మాయ (ఎస్తేర్) ఎవరు ? నగరంలో వరుస హత్యలతో కలకలం సృష్టిస్తున్న సైకో కిల్లర్ ఎవరు? చివరకు శ్లోక, ప్రిన్సీలకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? వారు ఈ ముప్పును బయటపడ్డారా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: నూజివీడు టాకీస్
  • నిర్మాతలు: రాంకీ పలగాని, బాలయ్య చౌదరి చల్లా, లలిత కుమారి తోట
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుహాస్ మీరా
  • సంగీతం: కార్తీక్ కొడకండ్ల
  • సినిమాటోగ్రఫీ: ఆర్.కె. వల్లెపు
  • పాటలు: సత్య కశ్యప్

మూలాలు[మార్చు]

  1. TV9 Telugu (30 November 2022). "ఓటీటీలో అదరగొడుతోన్న ఐరావతం.. థ్రిల్లర్‌ మూవీకి ఫిదా అవుతోన్న ప్రేక్షకులు." Archived from the original on 1 December 2022. Retrieved 1 December 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. NTV Telugu (17 November 2022). "ఐరావతం (డిస్నీ ప్లస్ హాట్ స్టార్)". Retrieved 1 December 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)