ఐసిసి మహిళల ఛాంపియన్‌షిప్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ICC Women's Championship
నిర్వాహకుడుInternational Cricket Council (ICC)
ఫార్మాట్WODI
తొలి టోర్నమెంటు2014–16
చివరి టోర్నమెంటు2022–25
జట్ల సంఖ్య10
ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా (2nd title)
అత్యంత విజయవంతమైన వారు ఆస్ట్రేలియా (2 titles)

 

ఐసిసి మహిళల ఛాంపియన్‌షిప్ (IWC) అనేది మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు అర్హతను నిర్ణయించడానికి ఉపయోగించే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంటు. [1] మొదటి రెండు టోర్నమెంటులలో ఐసిసి మహిళల ర్యాంకింగుల్లో మొదటి ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లు పోటీపడ్డాయి. మొదటి ఎడిషనైన 2014–16 ఐసిసి ఉమెన్స్ ఛాంపియన్‌షిప్, 2014 ఏప్రిల్లో మొదలై 2016 నవంబరులో ముగిసింది. తొలి టోర్నీలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. [2] టోర్నమెంటు రెండవ ఎడిషను 2017 అక్టోబరులో మొదలైంది. మొదటి నాలుగు జట్లు 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌కు ఆటోమాటిగ్గా అర్హత సాధిస్తాయి. [3]

2018 సెప్టెంబరులో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాము IWCని మొత్తం పది జట్లకు విస్తరించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. అందువల్ల భవిష్యత్తులో బంగ్లాదేశ్, ఐర్లాండ్‌లు కూడా ఉంటాయని చెప్పింది. [4] [5] 2021 ఆగస్టులో, ఐసిసి 2021 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ టోర్నమెంటు నుండి మూడు క్వాలిఫైయరు జట్లు, తదుపరి రెండు ఉత్తమ స్థానాల్లో ఉన్న జట్లూ తదుపరి IWC సైకిల్‌కు అర్హత సాధిస్తాయని ధృవీకరించింది. [6] [7] అయితే, 2021 నవంబరులో, దక్షిణాఫ్రికాలో COVID-19 కొత్త రూపాంతరం వ్యాపించడంతో, [8] క్వాలిఫైయరు టోర్నమెంటును మధ్యలో నిలిపేసారు. [9] అందువల్ల బంగ్లాదేశ్, ఐర్లాండ్ జట్లు తమ వన్‌డే ర్యాంకింగ్స్ ఆధారంగా 2022–25 సైకిల్లో [10] IWCలో చేరాయి. [11]

టోర్నమెంటు చరిత్ర[మార్చు]

బుతువు[మార్చు]

సంవత్సరం జట్లు విజేత నేరుగా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌కు చేరుకుంది
2014–16 8  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు , న్యూజీలాండ్ , వెస్ట్ ఇండీస్  భారతదేశం , దక్షిణాఫ్రికా , పాకిస్తాన్ , శ్రీలంక
2017–20 8  ఆస్ట్రేలియా  ఇంగ్లాండు , దక్షిణాఫ్రికా , భారతదేశం , న్యూజీలాండ్  పాకిస్తాన్ , వెస్ట్ ఇండీస్ , శ్రీలంక
2022–25 10

జట్టు[మార్చు]

జట్టు 2014–16
(8)
2017–20
(8)
2022–25
(10)
యాప్‌లు.
 ఆస్ట్రేలియా 1వ 1వ ప్ర 3
 బంగ్లాదేశ్ ఆడలేదు ప్ర 1
 ఇంగ్లాండు 2వ 2వ ప్ర 3
 భారతదేశం 5వ 4వ ప్ర 3
 ఐర్లాండ్ ఆడలేదు ప్ర 1
 న్యూజీలాండ్ 3వ 6వ ప్ర 3
 పాకిస్తాన్ 7వ 5వ ప్ర 3
 దక్షిణాఫ్రికా 6వ 3వ ప్ర 3
 శ్రీలంక 8వ 8వ ప్ర 3
 వెస్ట్ ఇండీస్ 4వ 7వ ప్ర 3

మూలాలు[మార్చు]

 1. "About the ICC Women's Championship". International Cricket Council. Archived from the original on 30 జూన్ 2015. Retrieved 30 June 2015.
 2. "Australia win Women's Championship, qualify for World Cup". ESPN Cricinfo. Retrieved 28 September 2017.
 3. "Revised financial model passed and new constitution agreed upon". International Cricket Council. Retrieved 27 April 2017.
 4. "Bangladesh, Ireland could feature in next Women's Championship cycle". ESPN Cricinfo. Retrieved 25 September 2018.
 5. "Tigresses could feature in next Women's Championship cycle". The Daily Star (Bangladesh). Retrieved 1 October 2018.
 6. "Zimbabwe to host ICC Women's Cricket World Cup Qualifier". International Cricket Council. Retrieved 19 August 2021.
 7. "Women's ODI World Cup qualifier shifted from Sri Lanka to Zimbabwe; to begin in November". ESPN Cricinfo. Retrieved 19 August 2021.
 8. "Women's World Cup qualifier in Zimbabwe called off following concerns over new Covid-19 variant". ESPN Cricinfo. Retrieved 27 November 2021.
 9. "ICC Cricket World Cup Qualifier called off; Bangladesh, Pakistan, West Indies to qualify for New Zealand 2022". Women's CricZone. Retrieved 27 November 2021.
 10. "ICC Women's Cricket World Cup Qualifier 2021 called off". International Cricket Council. Retrieved 27 November 2021.
 11. "ICC Women's CWC Qualifier in Zimbabwe abandoned amid Covid-related uncertainty". International Cricket Council. Retrieved 27 November 2021.