ఐ.సి.సి.యు
Jump to navigation
Jump to search
తెలుగు నవల జగత్తులో ఆపూర్వ వైద్యవిజ్ఞాన విస్పోటనంగా వర్ణించబడిన నవల ఇది. ఐ.సి.సి.యు నవల రచయిత డా.చిత్తర్వు మధు.
ఐ.సి.సి.యు నవల | |
కృతికర్త: | డా.చిత్తర్వు మధు |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రచురణ: | 69 |
విడుదల: | అక్టోబర్ 2006 |
పేజీలు: | 190 |
రచన నేపధ్యం
[మార్చు]- తెలుగులో సైన్స్ ఫిక్షన్ తక్కువ. వైద్యవృత్తి నేపథ్యంలో వ్రాయబడిన సైన్స్ ఫిక్షన్ నవల. ఆ ఉద్దేశంతోనే పూర్తిగా "ఫిక్షన్" (కాల్పనిక సాహిత్యం) ధోరణిలో వ్రాసిన నవల.
- ఇది కేవలం మెడికల్ సైన్స్ ఫిక్షన్ నవల రాయాలనే ఆసక్తితో రాసిన పూర్తి కల్పిత నవల.
ఇతివృతం
[మార్చు]- ఐ.సి.సి.యు అనునది వైద్యవృతి-కార్డియాలజీ నేపథ్యంలో రాసిన నవల. దీనిలోని హాస్పిటల్ వాతావరణం, జబ్బులు, రోగులు, డాక్టర్లు నిజమైనవే అయినను నవలలో సృష్టించినవి మాత్రం కల్పితం. వైద్యవిజ్ఞానంతో పేషెంట్ల మీద ప్రయోగాలూ చేసి అక్రమంగా డబ్బు సంపాదించే డాక్టర్, అలాగే మరొక డాక్టర్ అతని యొక్క తప్పులను బయటపెట్టటం వంటివి ఈ నవలలోని ఇతివృతం.
ప్రాచుర్యం
[మార్చు]- తెలుగు నవలా జగత్తులో అపూర్వమైన వైజ్ఞాన విస్పోటనంగా వర్ణించబడి పాఠకుల మన్నన పొందిన నవలగా ప్రాచుర్యం చెందినదని చెప్పవచ్చును.