ఒనకే ఓబవ్వ
ఒనకే ఓబవ్వ | |
---|---|
జననం | ఓబవ్వ చిత్రదుర్గ, కర్ణాటక |
మరణం | చిత్రదుర్గ, కర్ణాటక |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | స్వాతంత్రోద్యమనాయకురాలు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | ఒనకే ఓబవ్వ |
ఒనకే ఓబవ్వ భారతదేశంలోని కర్ణాటకలో గల చిత్రదుర్గ రాజ్యంలో రోకలి (ఒనకే)ని ఆయుధంగా చేసుకొని హైదర్ అలీ దళాలతో ఒంటరిగా పోరాడిన ఒక హిందూ యోధురాలు. ఆమె భర్త చిత్రదుర్గలోని రాతి కోటలో కాపలాదారుగా ఉండేవాడు, శత్రుమూకలు వచ్చినపుడు శంఖం ఊది సైనికులను అప్రమత్తం చేయడం అతడి పని. కర్ణాటక రాష్ట్రంలో ఓబవ్వను, అబ్బక్క రాణి, కెలాడి చెన్నమ్మ, కిత్తూరు చెన్నమ్మలతో పాటు అగ్రశ్రేణి మహిళా యోధురాలుగా ప్రజలు గుర్తించారు.[1][2]
ఓబవ్వ పోరాటం
[మార్చు]మదకరి నాయకుని కాలంలో, హైదర్ అలీ (1754-1779) సేనలు చిత్రదుర్గ నగరాన్ని ముట్టడించాయి. అదే సమయంలో ఓబవ్వ భర్త భోజనం చేయడానికి ఇంటికి వచ్చాడు. అతని భోజనం సమయంలో అతనికి త్రాగడానికి కొంచెం నీరు అవసరమైంది, కాబట్టి అతని భార్య ఓబవ్వ ఒక కుండలో నీరు సేకరించడానికి కొండపైకి చెరువు దగ్గరకి వెళ్ళింది. అక్కడ ఒక రంధ్రం గుండా కోటలోకి ప్రవేశించేందుకు హైదర్ అలీ సైన్యం ప్రయత్నించడాన్ని ఆమె గమనించింది. దీని విషయమై తన భర్తను తినే కంచం ముందు నుండి లేపడం ఇష్టంలేక, ఆమెనే రోకలి (కన్నడ: ఒనకే) (వరి గింజలను కొట్టడానికి ఉపయోగించేది)ని పట్టుకొని రంధ్రం నుండి లోపలకు వచ్చిన సైనికున్ని ఒక్కొక్కరిగా తలపై కొట్టి చంపి, మిగిలిన దళాలకు అనుమానం రాకుండా నిశ్శబ్దంగా చనిపోయినవారిని తరలించింది. భోజనం చేసి తిరిగి వచ్చిన ఓబవ్వ భర్త ముద్ద హనుమ, రక్తంతో తడిసిన ఓనకెతో పాటు తన చుట్టూ ఉన్న అనేక శత్రువుల మృతదేహాలతో నిలబడి ఉన్న ఓబవ్వను చూసి ఆశ్చర్యపోయాడు. తరువాత, అతను శంఖం ఊదటం తో సైనికులు అప్రమత్తమై శతృమూకలను ఎదిరించారు. కానీ తప్పించుకున్న ఒక శత్రు సైనికుడు ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. దాంతో ఆమె తుది శ్వాస విడిచింది. ఆమె సాహసోపేత ప్రయత్నం ఈసారి కోటను కాపాడినప్పటికీ, 1779లో చిత్రదుర్గ కోట హైదర్ అలీ చేతిలో ఓడిపోయినప్పుడు హైదర్ అలీ చేసిన దాడిని మదకరి అడ్డుకోలేకపోయింది.[3][4][5][6]
గుర్తింపు
[మార్చు]పుట్టన్న కనగల్ దర్శకత్వం వహించిన నాగరహావు చిత్రంలో ఆమె వీరోచిత ప్రయత్నం ఒక ప్రసిద్ధ పాట-శ్రేణిలో చిత్రీకరించబడింది. చిత్రదుర్గలోని స్పోర్ట్స్ స్టేడియంకు వీర వనిత ఒనకే ఓబవ్వ స్టేడియం, ఆమె పేరు పెట్టబడింది, ఆమె స్మారకార్థం అశోక్ గుడిగార్ చేత చెక్కబడిన విగ్రహం, చిత్రదుర్గలోని జిల్లా కమీషనర్ కార్యాలయం ముందు ప్రతిష్టించబడింది.[7][8]
సినిమా
[మార్చు]2019లో కన్నడ భాషా చారిత్రాత్మక డ్రామా చిత్రం చిత్రదుర్గడ ఒనకే ఓబవ్వ, పేరుతో చిత్రించారు.నాగరహావు సినిమాలో ఒనకే ఓబవ్వ పాత్రలో నటి జయంతి నటించింది.[9]
మూలాలు
[మార్చు]- ↑ Cathy Spagnoli, Paramasivam Samanna (1999). Jasmine and Coconuts: South Indian Tales (1999 ed.). Englewood, USA: Greenwood Publishing Group. ISBN 9781563085765. Retrieved 10 September 2012.
- ↑ "Why is BJP against Tipu Sultan, and was this always the case?". 7 November 2017.
- ↑ B.N, Sri Sathyan, ed. (1967). Mysore State Gazetteer - Chitradurga District. Vol. 4. Bangalore: Govt. of Mysore. p. 393. Retrieved 10 September 2012.
- ↑ March of Mysore Vol.3 (1966 ed.). 1966. Retrieved 10 September 2012.
- ↑ Hayavadana Rao, Conjeevaram (1943). History of Mysore (1399-1799 AD) 1766-1799. Vol. 3. Bangalore: Govt. of Mysore. p. 260. Retrieved 10 September 2012.
- ↑ Sarojini Shintri; Kurukundi Raghavendra Rao (1983). Women freedom fighters in Karnataka. Prasaranga, Karnatak University. p. 151. Retrieved 2009-06-17.
- ↑ John, Jijo K. Studies in South. Vol. 2 (2005 ed.). Bangalore: Printnet Info Services Pvt Ltd. p. 24. Retrieved 10 September 2012.[permanent dead link]
- ↑ Lewis, Barry (2007). "An Informal History of the Chitradurga Nayakas". Barry Lewis UIUC Department of Anthropology. Archived from the original on 15 May 2011. Retrieved 25 April 2018.
- ↑ "Chitradurgada Onake Obavva (2019)". Movie Buff. 21 June 2019.