ఒమర్ ముఖ్తార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒమర్ ముఖ్తార్
عمر المختار
జననం20 ఆగస్టు 1858
మరణం1931 సెప్టెంబరు 16(1931-09-16) (వయసు 73)
ఇతర పేర్లుఎడారి సింహం (Lion of the Desert)
వృత్తిteacher of the Qur'an
సుపరిచితుడు/
సుపరిచితురాలు
led native resistance to Italian colonization of Libya

ఒమర్ ముఖ్తార్ (అరబ్బీ - عمر المختار) లిబియా దేశానికి చెందిన తిరుగుబాటు వీరుడు. 1912 నుండి సుమారు 20 సంవత్సరాలపాటు ఇటలీ వలసవాదానికి వ్యతిరేకంగా తిరగబాటు సలిపాడు. 1931లో ఇటలీ సైన్యానికి పట్టుబడి ఉరితీయబడ్డాడు.

గత జీవితం[మార్చు]

ఒమర్ ముఖ్తార్ 1858 సంవత్సరంలో పాత ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని ట్రిపోలియన్ రాజ్యభాగంలో సైరెనైకా నగరం దగ్గర జాన్ జౌర్ గ్రామంలో జన్మించాడు.[1] అనాథ అయిన ఇతనిని, షరీఫ్-ఇ-ఘారియానీ (సెరైనికాలోని ప్రసిద్ధ హుస్సేన్ ఘారియానీ బంధువు) చేరదీసాడు. ఇతని తొలిచదువు స్థానిక మసీదులో సాగింది, అటుపైన 8 సంవత్సరాలు జఘ్ బుబ్ లోని సెనుస్సీ విశ్వవిద్యాలయంలో సాగింది. ప్రసిద్ధ సెనుస్సీ ఉద్యమానికి ఇది కేంద్రస్థానం. 1899లో ఇతర సెనుస్సీలతో కూడి, ఫ్రెంచివారికి వ్యతిరేకంగా చాద్లో జరుగుతున్న తిరుగుబాటులో పాల్గొంటున్న రబీహ్- అజ్-జుబాయ్ర్ కి సహాయకునిగా వెళ్లాడు.

ఇటలీ దురాక్రమణ[మార్చు]

ఇటలీ టర్కీ 1911 యుద్దకాలంలో, అడ్మిరల్ లూగీ ఫారవెల్లీ నాయకత్వంలోని ఇటలీ నౌకాదళవిభాగం లిబియా తీరానికి చేరింది. ఆ సమయానికి లిబియా భూభాగం టర్కీ ఒట్టోమాన్ సామ్రజ్యంలో అంతర్భాగంగా ఉండేది. టర్కీ యంత్రాంగాన్నీ, బలగాలనీ లొంగిపోవలసిందిగా ఫారవెల్లీ అజ్ఞాపించాడు. లేనిపక్షంలో లిబియా నగరాలలో తీవ్ర విధ్వంసం సృష్టించగలనని హెచ్చరించాడు. అయితే టర్కీ బలగాలు, వారి తోడునున్న లిబియా దళాలు లొంగిపోలేదు. ఫారెవెల్లీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు దాడిజరిగిన తర్వాత, ట్రిపోలియన్లు "ఇటలీకి కట్టుబడిన"ట్టు ప్రకటించాడు. ఒమర్ ముఖ్తార్ నాయకత్వంలో 22యేళ్ళపాటు తూర్పు లిబియాలో సాగిన తిరుగుబాటు, ఇదే నాంది.[2]

గెరిల్లా యుద్ధరీతులు[మార్చు]

వృత్తిరీత్యా ఖురాన్ బోధకుడైనా, ఎడారి యుద్ధరీతుల్లోనూ ప్రావీణ్యం ఉన్నవాడు, ఒమర్ ముఖ్తార్. స్థానిక భౌగోళిక జ్ఞానం ఉన్నకారణంగా, దాని ఆసరాగా ఇటలీ బలగాల మీద తిరగబడ్డాడు.

పట్టుబాటు, ఉరిశిక్ష[మార్చు]

1931 సెప్టెంబరు 11 న స్లోంటా యుద్ధంలో గాయపడినపుడు, ఒమర్ ఇటలీ సైన్యానికి పట్టుబడ్డాడు. మూడు రోజుల విచారణ అనంతరం "బహిరంగం ఉరి" శిక్ష విధింపబడింది. ఆఖరి కోరిక అడిగినపుడు, ఖురాన్ లోని "ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్" (అందరం దేవునికి చెందినవారమే, అందరం అక్కడికే పోతాం) అని బదులిచ్చాడు. 73 సంవత్సరాల వయసులో, 1931 సెప్టెంబరు 16 న అతని అనుచరుల ఎదురుగా ఉరితీయబడ్డాడు.

చనిపోయిన తర్వాత[మార్చు]

  • లిబియా దేశపు పది దినార్ల నోటు మీద ఒమర్ ముఖ్తార్ ముఖం ముద్రంచబడి ఉంటుంది.
  • లయన్ ఆఫ్ ది డెసర్ట్ (ఎడారి సింహం) పేరున వచ్చిన సినిమాలో ఒమర్ ముఖ్తార్ చివరి రోజులు చూపబడ్డాయి.
  • 2009 సంవత్సరంలో లిబియా అధ్యక్షుడు మౌమూర్ గద్దాఫీ రోమ్ నగర పర్యటనలో ఒమర్ ముఖ్తార్ పట్టుబాటు నాటి ఫోటోని తన ఛాతీపైన ధరించాడు. ఆ నాటి పర్యటనలో ఒమర్ పెద్ద కుమారుడు కూడా గద్దాఫీ తోడుగా ఉన్నాడు.

మూలాలు[మార్చు]

  1. Mnifa is "a generic name for many groups of 'Clients of the Fee' (Marabtin al-sadqan)." These are client tribes having no sacred associations and are known as Marabtin al-sadqan because they pay sadaqa, a fee paid to a free tribe for protection. Peters, Emrys L. (1998) "Divine goodness: the concept of Baraka as used by the Bedouin of Cyrenaica", page 104, In Shah, A. M.; Baviskar, Baburao Shravan and Ramaswamy, E. A. (editors) (1998) Social Structure and Change: Religion and Kinship (Volume 5 of Social Structure and Change) Sage Publications, Thousand Oaks, California, ISBN 0-7619-9255-3; Sage Publications, New Delhi, India, ISBN 81-7036-713-1
  2. Encyclopedia of World Biography on Omar al-Mukhtar, BookRags.com

బయటి లంకెలు[మార్చు]