ఓబనపాలెం ( నాగులుప్పలపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( )


ఓబనపాలెం, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం..

ఓబనపాలెం గ్రామ దృశ్యం

సమీప గ్రామాలు[మార్చు]

నాగులుప్పల పాడు, ఉప్పుగుండూరు, మాచవరం, ఉప్పలపాడుఅమ్మనబ్రోలు

రవాణా సౌకర్యాలు[మార్చు]

బస్సు వసతి జిల్లా కేంద్రం ఒంగోలు నుండి మాత్రమే ఉంది.

మౌలిక వసతులు[మార్చు]

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

ఊరిలో చెఱువు చూడ ముచ్చట గొలుపును.

గ్రామ పంచాయతీ[మార్చు]

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో వక్కంటి శ్రీనివాసరావు, సర్పంచిగా ఎన్నికైనాడు.
  • 2021 ఫిభ్రవరిలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో పోలినేని వెంకటేశ్వర్లు సర్పంచిగా ఎన్నికైనాడు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో మూడు దేవాలయములు ఉన్నాయి. రామాలయము, ఆంజనేయస్వామి ఆలయము, శివాలయము ఉన్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

కట్టా రామకృష్ణ:భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో, ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రైతులకు అందజేసే అత్యుత్తమ పురస్కారం జగజ్జీవనరాం అభినవ కిసాన్ పురస్కారం, గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు కట్టా రామకృష్ణ ఎంపికైనాడు. 2014, జూలై-29న భారత ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అథిధిగా పాల్గొన్న సభలో, కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి రాధామోహన్ సింగ్, వ్యవసాయోత్పత్తుల శాఖా మంత్రి బాలు నాయక్ బల్వాన్ చేతులమీదుగా, ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్నాడు. ఈ పురస్కారంతోపాటు ఇతనికి 50 వేల రూపాయల ప్రోత్సాహక నగదు బహుమతిని గూడా అందుకున్నారు.

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, దర్శి కృషి విఙానకేంద్రం ఆధ్వర్యలో ఇటీవల దర్శిలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమంలో భాగంగా, ఒక కిసాన్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో వీరికి ఉత్తమ రైతు పురస్కారం అందజేసారు. మినుములో పల్లాకు తెగులుకు తట్టుకుని, అధిక దిగుబడిని ఇచ్చే పాలిష్ రకాలు అభివృద్ధి చేయడం, పెసరలో కొత్త వంగడాలు అభివృద్ధి చేయడం, శనగలో కోతయంత్రం వెరైటీని అభివృద్ధి చేయడంలో వీరి కృషిని గుర్తించి, ఇతనికి ఈ పురస్కారాన్ని ఒంగోలు లోక్ సభ సభ్యులు వై.వి.సుబ్బారెడ్డి అందజేసాడు.ఇతను 2016, డిసెంబరు-3న, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, అభ్యుదయ రైతు కోటాలో, వ్యవసాయ పరిశోధన, విస్తరణ కేంద్రం సభ్యులుగా నియమితులైనాడు. నూతన వంగడాలతో వ్యవసాయంలో మేలైన ఉత్పత్తులు అందించినందుకు వీరికి ఈ అవకాశం లభించింది.

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు.[మార్చు]