ఓ చిన్నారి డైరీ
Jump to navigation
Jump to search
ఓ చిన్నారి డైరీ అనేది అన్నా ఫ్రాంక్ అనే డచ్ మహిళ డైరీ పేజీల్లోంచి తీసుకొన్న కొన్ని భాగాల పుస్తక రూపం. రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంలో నాజీల ద్వారా వేటాడబడుతూ, ఈమె కుటుంబం అజ్ఞాతంలో గడిపిన రెండేళ్ళ కథే ఇందుకు నేపథ్యం. 1944లో ఈమె కుటుంబాన్ని నాజీ సైన్యం లోబరుచుకుంది. అన్నా ఫ్రాంక్ అప్పటికి టైఫస్ వ్యాధితో చనిపోయారు. మీప్ గీఇస్ అనే వ్యక్తి ఈమె డైరీని కనుగొని అన్నా తండ్రి ఓటో ఫ్రాంక్ కు అందించారు. అప్పటి నుండి ఈ డైరీ అరవై కన్నా ఎక్కువ భాషలలో ప్రచురితమైంది.