Jump to content

కంఠస్ఫూర్తి

వికీపీడియా నుండి

శ్రీ కంఠస్ఫూర్తి గా సుపరిచితుడైన "కంఠస్ఫూర్తి గుర్రాజు" తెలుగు రచయిత.

కంఠస్ఫూర్తి గుర్రాజు
జననం1952 డిసెంబరు 12
వృత్తిరచయిత
మతంహిందూ
తండ్రినరసరాజు
తల్లిపాపాయమ్మ

జీవిత విశేషాలు

[మార్చు]

కంఠస్ఫూర్తి గుర్రాజు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం లో అమీన్ బాదా గ్రామంలో 1952 డిసెంబరు 12న పాపాయమ్మ, నరసరాజు దంపతులకు జన్మించాడు. బి. ఎస్. ఎన్. ఎల్ ఛీప్ టెలిఫోన్ సూపర్ వైజర్ గా ఉద్యమ విరమణ చేశాడు.

రచనలు

[మార్చు]

కధా వ్యాసంగం 1978 నుంచి ప్రారంభమై సుమారుగా 200 కధలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. 1996 లో అమృత వర్షం, 2011 లో మనిషి చిత్రం కధా సంపుటలు వెలువడ్డాయి. ఇతను రచించిన కొన్ని కథలు కన్నడ భాషల్లో అనువాదం అయ్యాయి. ఎన్నో కవితలు రేడియో, దూరదర్శన్, కవి సమ్మేళనాలలో వినిపించాయి. పాతిక పైగా నాటకాలు రచించాడు.[1]

అవార్డులు

[మార్చు]
  • విశాఖ జ్యేష్ఠ లిటరరీ అవార్డు.
  • ఆంధ్రప్రభ న్యుజెర్సీ సంయుక్త పునస్కారం.
  • యునెస్కోక్లబ్ అవార్డులు.

మూలాలు

[మార్చు]
  1. "కథా జగత్తులోకి అడుగిడండి - కథా జగత్". sites.google.com. Retrieved 2020-01-25.