Jump to content

కంబళ

వికీపీడియా నుండి
Famed Kambala Race of Kadri, Mangalore.
A Kambala Race at Pilikula Nisargadhama.

కంబళ అనేది కర్ణాటక రాష్ట్రంలో జరిగే వార్షిక ఎద్దుల పోటీ. ఈ పోటీని కర్ణాటక లోని దక్షిణ కన్నడ , ఉడిపి జిల్లాలు, కేరళ లోని కాసర్గొడ్ జిల్లలకు చెందిన భూస్వాములు, వ్యాపారవేత్తలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు నవంబర్ నుండి మార్చి వరకు నిర్వహింపబడుతాయి .ఈ పోటీలను 18 కంబళ సమితీలు ప్రస్తుతం నిర్వహిస్తున్నాయి. ఇవి మారుమూల గ్రామాలైన వందరు, గుల్వాడి లలో కూడా జరుగుతున్నాయి.

పోటీ నియమాలు

[మార్చు]
Puttur Koti - Chennaya Kambula

ఇది గ్రామీణ ప్రజలకు ఆనందాన్నిచ్చే క్రీడ.[1] దీన్ని వరి పంట పొలాల్లో జాకీ కొరడా ఝుళిపించడం ద్వారా ఆడతారు.[2] సాంప్రదాయ కంబళ పోటీ లేకుండా ఒకదాని వెంట మరొకటి జరుగుతుంది కానీ ఆధునికంగా జోడు ఎడ్ల ద్వారా జరుగుతుంది .వందరు, చొరాడి గ్రామాల్లో అయితే దైవికంగా తమను రోగాల బారి నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా జరుపుతారు. ఇది వరకు గెలిచిన ఎడ్లకు కొబ్బరికాయలు , అరటిపళ్లు బహుమతిగా నివేదించేవారు . ఇప్పుడు గెలిచిన రైతులకు బంగారం, వెండి నాణేలు బహూకరిస్తున్నారు , కొన్ని నిర్వాహణ కమిటీలు 8 గ్రాముల బంగారు నాణేలను మొదటి బహుమతిగా ప్రకటిస్తున్నారు. ఇంకొందరు డబ్బులను ఇస్తున్నారు.

ఎద్దు అలంకరణ

[మార్చు]

ఎద్దుల కొమ్ములకు ఇత్తడి, రాగి తో చేసిన తొడుగులను (అప్పుడప్పుడూ సూర్య చంద్ర గుర్తులతో ఉన్న చిహ్నాలను), తాడుతో చేసిన కళ్ళాన్నీ అలంకరిస్తారు. ఎద్దు వెనుక భాగాన్ని కప్పి ఉంచే గుడ్డను పావడే అని పిలుస్తారు.

కంబళ రకాలు

[మార్చు]
  1. పూకెరే కంబళ
  2. బారే కంబళ
  3. కోరి కంబళ
  4. అరసు కంబళ
  5. దేవేరే కంబళ[3]
  6. బలే కంబళ

కోరి కంబళ

[మార్చు]

ఇది తుళు నాడు లో జరిగే వ్యవసాయాధారిత కంబళ. ఇది ఎనెలు పంట వేయడంలో సామూహిక వ్యవసాయం చేయడాన్ని సూచిస్తుంది. ఇలా సహకార పద్దతిలో నేల దున్నడం, విత్తనాలు నాటడం తుళు నాడు ప్రజల జీవన స్థితి గతుల్లో పెద్ద మార్పును తెచ్చింది.

బాలే కంబళ

[మార్చు]

ఈ పద్దతి 900 ఏళ్ల పూర్వం నిలిపివేయబడింది. ఇదీ చిన్న, సన్నకారు రైతుల కోసం ఏర్పాటైన కంబళ.

కద్రి కంబళ

[మార్చు]

ఇది మంగళూరు ప్రాంతంలో కాద్రిలో దేవర కంబళ పేరుతో మంజునాథ స్వామిని ఆరాధిస్తూ చేస్తారు. ఈ క్రీడని మంగళూరులోని అలుప రాజులు 300 ఏళ్ల క్రితం ప్రవేశ పెట్టారు. అందుకే కాద్రి కంబలని అరసు కంబళ(రాజుల కంబళ) అని అంటారు.

నాథ పంత

[మార్చు]

కంబళ నాథ పంత నుండి ప్రభావితమైంది.[4] ఇది ముందు రోజు సాయంత్రం కోరగ వర్గంలోని మగ వారిచే నాట్యం ద్వారా మొదలవుతుంది. ఆ రోజ్జు సాయంత్రం వారు పంచకర్మ గా పిలవబడే మద్య, మాంస, మత్స్య, ముద్ర, మైధునం అనేవి జరుగుతాయి. కొరగలు ముందు రోజు రాత్రి పనిక్కులుని అని పిలవబడే కార్యక్రమంలో మంచులో కూర్చుంటారు. దుడి అనే వాద్య కళాకారుల బృందంతో కలిసి దైవ నిచ అనే దైవాన్ని ఆరాధిస్తూ పాటలు పడతారు అలాగే కల్లు , మట్టికుండలో చేసే పరవన్నాన్ని నైవేద్యంగా ఇస్తారు.ఆ పాయశాన్ని కండెల్ అద్యే అంటారు.[5]

నవీకరణలు

[మార్చు]

కంబళ నిర్వహణలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అవి -

  • నెగిలు (ನೇಗಿಲು): జాకీ ఒక కొత్త రకమైన నాగలిని పట్టుకుంటాడు, అది ఇనుముతో చేసే సాధారణమైన నాగలి కాదు. జూనియర్ , సీనియర్ అనే రెండు వర్గాలుగా పెట్టె ఈ కార్యక్రమంలో ఈ పద్ధతి జూనియర్ విభాగానికి చెందినది.
  • హగ్గ (ಹಗ್ಗ: rope): జోడెడ్లకు రెండు తాళ్ళను కడతారు. సీనియర్ విభాగంగా పెట్టె ఈ పోటీలో వేగం ఎక్కువగా ఉంటుంది.పక్కన పరిగెడుతున్న జాకీ తాళ్ళను పట్టుకోవాలి.
  • అడ్డ కర్ర (ಅಡ್ಡ ಹಲಗೆ: అడ్డ చెక్క బొంగు), ఒక చెక్క బొంగును ఎడ్లకు కట్టగా పరిగెట్టేవాడు దాని మీద నిలబడతాడు. సీనియర్ విభాగంలో పెట్టిన చెక్క బురదని తాకుతూ ఉంటుంది.
  • కన్నె హాళగే (ಕಣೆ ಹಲಗೆ: గుండ్రని చెక్క కర్ర): ప్రత్యేకించి చేసిన గుండ్రటి చెక్క మీద పరిగెట్టేవాడు ఒంటికాలుతో నిలబడతాడు. ఆ చెక్కకి ఉన్న రెండు రంధ్రాల్లోంచి నీరు ధారగా పైకి వస్తుంది. ఆ నీరు ఎంత ధారగా పైకి వస్తుందో వారే గెలిచినట్టు. పైన ఒక తెల్లటి వస్త్రం కట్టబడి ఉంటుంది( సాధారణ జనం తెలుసుకోవడానికి వీలుగా). దీన్ని వాడుక భాషలో నిషానెగ్ నీర్ పాదునే అంటారు.

గత 300 ఏళ్ల నుండి నిర్వహింపబడుతున్న ఈ పోటీలను చూడటానికి జనం విశేషంగా తరలి వస్తారు. ఒక్క పోటీ ప్రాంగణంలో 20000 మండి దాకా ఉంటారు. ఇవి రాత్రి పూట కూడా నిర్వహిస్తారు. వీటి కోసం ప్రత్యేక నీటి కొలనులను కూడా ఏర్పాటు చేస్తారు.

న్యాయపరమైన చిక్కులు

[మార్చు]

ఈ క్రీడలో జంతువులను హింసించటం ఎప్పుడూ వివాదాస్పదమవుతోంది. ఎద్దులను కొరడా లతో కొట్టడం మీద మేనక గాంధీ లాంటి వారు, జంతు సంరక్షణకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.[6] 2014 లో సుప్రీం కోర్టు జల్లికట్టును, కంబళని నిషేదించింది. తర్వాత ప్రజా సంఘాల కోరిక మేరకు 2017 లో ప్రభుత్వం నిషేదాన్ని ఎత్తి వేసింది.[7] జంతు హింస నిరోధ ఆర్డినెన్సు 2017 [8] [9] ప్రకారం కంబాల ని చట్ట పరమైన క్రీడగా గుర్తించారు. ఫెబ్రవరి 19, 2018 [10]న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జారీ చేసిన జంతు హింస నిరోధ చట్టం (కర్ణాటక సవరణ) దీనికి పూర్తి మద్దతు ప్రకటించింది.

2020 -వార్తల్లో నిలిచిన జాకీలు

[మార్చు]

ఫిబ్రవరి 1న పోటీలో మూడ్ బిడ్రికి చెందిన శ్రీనివాస్ గౌడ 142.5 మీటర్లను 13.62 సెకన్లలో పరిగెత్తి ఉసైన్ బోల్ట్ ఘనతను వెనక్కి నేట్టాడని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది .శ్రీనివాస్ కు భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ నుండి పిలిపు పంపాలని క్రీడా మంత్రి కోరారు .ఇతని ఘనతని ఫెబ్రవరి 18న నిశాంత్ శెట్టి వెనక్కి నెట్టాడు. జగోళి జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిషాంత్ 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలో పరిగెత్తి చరిత్ర సృష్టించాడు. అంటే 100 మీటర్ల పరుగును 9.51 సెకన్లలోనే పూర్తి చేశాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. Chaudhari SK, Sen S, eds. (2005). Primitive tribes in contemporary India : concept, ethnography and demography. New Delhi: Mittal Publications. p. 120. ISBN 9788183240260.
  2. Grisham, Esther; Bartok, Mira (1997). South India (sb ed.). Glenview, IL: Good Year Books. p. 5. ISBN 9780673363596.
  3. https:Kambala:A sport and a tradition, Feb 7, 2017, http://www.deccanherald.com/content/595115/kambala-sport-tradition.html
  4. Tuluvara mooltāna Adi Alade Paramrapare mattu Parivartane by Dr. Indira Hegde, [Navakaranataka,Bangalore,2012,p.278]
  5. Karavali Janapada 1990, Mangalagangothri by Dr. Purushothama Bilimale, p.36
  6. "Pilikula Nisargadhama plays host to Kambala". The Hindu. 10 January 2012. Retrieved 7 December 2012.
  7. "Jallikattu Back, Why Not Kambala, Asks Karnataka. Protests Begin". NDTV.com.
  8. Ravi, Anusha (July 3, 2017). "Kambala is now legal in Karnataka, President promulgates ordinance". Oneindia.
  9. Kumar, Ganesh; Udayakumar, Radha (July 3, 2017). "President Mukherjee approves ordinance allowing the conduct of kambala in Karnataka". India Today.
  10. K.T. Vinobha (February 19, 2018). "President approves Bill allowing Kambala in Karnataka". Times of India.
  11. https://telugu.news18.com/news/trending/another-usain-bolt-in-kambala-nishanth-shetty-the-record-of-srinivas-gowda-sk-455800.html

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కంబళ&oldid=3903311" నుండి వెలికితీశారు