కట్టమంచి బాలకృష్ణారెడ్డి
Jump to navigation
Jump to search
కట్టమంచి బాలకృష్ణా రెడ్డి | |
---|---|
జననం | చిత్తూరు | 1939 ఆగస్టు 7
వృత్తి | రచయిత/వ్యాపారం/వ్వవసాయం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | రచయిత,వ్యాపారి,వ్వవసాయం |
పిల్లలు | ముగ్గురు కుమారులు |
తల్లిదండ్రులు | పొన్నెమ, కట్టమంచి మునుస్వామి రెడ్డి |
కట్టమంచి బాలకృష్ణా రెడ్డి వ్యవసాయ ధారుడు, వ్యాపార వేత్త, రచయిత.
జీవిత విశేషాలు
[మార్చు]అతను చిత్తూరు పట్టణంలో 1939 ఆగస్టు 7 న జన్మించారు, వీరి తల్లిదండ్రులు, పొన్నెమ, కట్టమంచి మునస్వామి రెడ్డి. ఇతను ఎం.ఎస్సీ వరకు చదివాడు.
రచనలు
[మార్చు]ఇతను ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్ర జ్యోతి లకు విలేఖరిగా పనిచేశాడు. 'తొలకరి ' పత్రికకు సంపాదకుడుగా పనిచేశాడు. తొలకరి లో కొన్ని కథలు, వివిధ పత్రికలలో వ్యాసాలు వ్రాశాడు. అంతేగాక 'యూరప్ జ్ణాపకాలు7, మధురమైన మామిడి, ఆపది రోజులు, కొన్ని కలలు కొన్ని జ్ఞాపకాలు, 9+5 = 14 రోజులు మా కేరళ పర్యటన వంటి కొన్ని పుస్తకాలను ప్రచురించాడు.
అభిరుచులు
[మార్చు]తెలుగు సాహిత్యపఠనం, తెలుగు భాషాభివృద్ది, బౌద్ధం పట్ల ఆసక్తి, కోళ్ళు, పండ్ల పరిశ్రమ అభివృద్ధి, వ్వవసాయం వంటివి ఇతని అభిరుచులు.
పొందిన గౌరవాలు
[మార్చు]- గౌరవ అద్యక్షులు - చిత్తూరు జిల్లా రచయితల సంఘం.
- గౌరవ అద్యక్షులు - చిత్తూరు జిల్లా పండ్ల పరిశ్రమ సంఘం.
- అధ్యక్షులు - చిత్తూరు జిల్లా వ్వవసాయదారుల సేవా సంఘం.
మూలాలు
[మార్చు]వర్గాలు:
- Date of birth not in Wikidata
- Pages using infobox person with unknown parameters
- Pages using Infobox person with deprecated parameter home town
- Infobox person using religion
- Infobox person using residence
- Infobox person using home town
- Pages using infobox person with conflicting parameters
- All articles with dead external links
- 1939 జననాలు