కట్టావారిపాలెం(సత్తెనపల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కట్టావారిపాలెం(సత్తెనపల్లి)
—  రెవిన్యూ గ్రామం  —
కట్టావారిపాలెం(సత్తెనపల్లి) is located in Andhra Pradesh
కట్టావారిపాలెం(సత్తెనపల్లి)
కట్టావారిపాలెం(సత్తెనపల్లి)
అక్షాంశరేఖాంశాలు: 16°23′01″N 80°13′29″E / 16.383567°N 80.224775°E / 16.383567; 80.224775
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం సత్తెనపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ దాసరి సాంబయ్య
పిన్ కోడ్ 522403
ఎస్.టి.డి కోడ్

"కట్టావారిపాలెం(సత్తెనపల్లి)" గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం.522 438., ఎస్.టి.డి.కోడ్ = 08641. [1]

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

రక్షిత మంచినీటి పథకం[మార్చు]

1962 లో, రు. 8 లక్షలతో ఏర్పాటుచేయబడిన ఈ పథకం, ఏడాది పొడవునా ప్రజల దాహార్తి తీర్చుచున్నది. పాలకులు, అధికారుల కృషికి, గ్రామస్తుల సహకారం తోడవడంతో, మండలంలో 365 రోజులూ త్రాగునీటి సరఫరా జరుగుచున్న పథకంగా గుర్తింపు పొందినది. [1]

శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయము:- కట్టావారిపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని 2014,ఏప్రిల్ 27వతేదీ బుధవారం నాడు అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే ఆలయంలో గణపతి ప్రార్థన, ప్రత్యేకపూజ, పుణ్యాహవచనం, పంచగవ్యప్రాసన, సాయంత్రం లక్ష్మీగణపతి అనుష్పానాలు, మంత్రపుష్పం, విశేస పూజలు నిర్వహించారు. కట్టావారిపాలెం గ్రామాల ప్రజలు, వారి బంధువులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని, స్వామివారి తీర్ధ ప్రసాదాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగలా తిలకించారు. [2]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా. ఇందులో పురుషుల సంఖ్య, స్త్రీల సంఖ్య, గ్రామంలో నివాస గృహాలు ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం - పురుషుల సంఖ్య - స్త్రీల సంఖ్య - గృహాల సంఖ్య

సమీప గ్రామాలు[మార్చు]

కొర్రపాడు 3 కి.మీ, నందిగామ 4 కి.మీ, కంటేపూడి 1.5 కి.మీ, గుడిపూడి 5 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున మేడికొండూరు మండలం, ఉత్తరాన పెదకూరపాడు మండలం, దక్షణాన ఫిరంగిపురం మండలం, పశ్చిమాన ముప్పాళ్ళ మండలం.

మూలాలు[మార్చు]

[1] ఈనాడు గుంటూరు రూరల్; 2015,మార్చి-22; 13వపేజీ. [2] ఆంధ్రజ్యోతి గుంటూరు సిటీ సత్తెనపల్లి ఎడిషన్; 2016, ఏప్రిల్ -28; 5వపేజీ.

వెలుపలి లింకులు[మార్చు]