Jump to content

కట్ట మైసమ్మ దేవాలయం

అక్షాంశ రేఖాంశాలు: 17°37′N 78°48′E / 17.617°N 78.800°E / 17.617; 78.800
వికీపీడియా నుండి
కట్ట మైసమ్మ దేవాలయం
ఆలయ ప్రవేశ ద్వారం
కట్ట మైసమ్మ దేవాలయం is located in Telangana
కట్ట మైసమ్మ దేవాలయం
కట్ట మైసమ్మ దేవాలయం
తెలంగాణ లో ఉనికి
భౌగోళికాంశాలు:17°37′N 78°48′E / 17.617°N 78.800°E / 17.617; 78.800
పేరు
స్థానిక పేరు:కట్ట మైసమ్మ దేవాలయం
స్థానం
దేశం:భారతదేశము
రాష్ట్రం:తెలంగాణ
ప్రదేశం:ట్యాంక్ బండ్, హైదరాబాదు
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:మైసమ్మ
నిర్మాణ శైలి:దక్షిణ భారతదేశం

కట్ట మైసమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో ఉన్న హిందూ దేవాలయం.[1] తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బోనాలు ఉత్సవం సందర్భంగా ఈ దేవతను హిందువులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

ప్రదేశం

[మార్చు]

ఈ దేవాలయం హైదరాబాదు నగరం లోని "ట్యాంక్ బండ్" వద్ద నెలకొని ఉంది. ఈ దేవాలయం హైదరాబాదు నగరంలో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయం హైదరాబాదు, సికింద్రాబాదు నగరాల మధ్య గల ఇందిరాపార్కు సమీపంలోని లోవర్ ట్యాంక్ బండ్ వద్ద ఉంది.

ఈ దేవాలయంలో ప్రధాన దైవం మైసమ్మ తల్లి. ఈ తల్లి శక్తి కి ప్రతిరూపం. "కట్ట" అనే పదం ఒక నదికి అడ్డంగా నిర్మించబడిన వంతెన. ఈ దేవాలయాన్ని గోల్కొండ పటేల్ కుటుంబం నిర్మించింది. పట్టణంలోని ప్రజలు ఈ వంతెనను దాటుతున్నప్పుడు వారిపై ఆ తల్లి ఆశీస్సులు అందించేందుకు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు కథనం.

ఆషాఢ మాసం (జూలై) లో హైదరాబాదు నగరంలో జరిగే బోనాలు ఉత్సవంలో అనేకమంది ప్రజలు ఈ దేవతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. కార్తీక మాసంలో ఈ దేవాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలను జరుపుతారు. నిజాం నవాబు కూడా హైదరాబాదు పట్టణాన్ని వరదల బారినుండి రక్షించుట కొరకు ఈ దేవతను ప్రార్థించారు.

తెలంగాణ రాష్ట్రం లోని హిందువులు అతి శక్తివంతమైన దేవతగా "కట్ట మైసమ్మ"ను ప్రార్థిస్తారు. ఈ దేవతను కొలిస్తే ఆరోగ్యం, శ్రేయస్సు, ఆనందం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]