కడుబండి శ్రీనివాసరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కడుబండి శ్రీనివాసరావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
23 మే 2019 - ప్రస్తుతం
నియోజకవర్గం శృంగవరపుకోట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1970
విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజా రాజ్యం పార్టీ
తల్లిదండ్రులు రామినాయుడు
జీవిత భాగస్వామి మధు

కడుబండి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శృంగవరపుకోట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

కడుబండి శ్రీనివాసరావు 1970లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లాలో జన్మించాడు. ఆయన 1993లో అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీ నుండి ఎంటెక్ పూర్తి చేసి ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించి సీఈవోగా పని చేస్తున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

కడుబండి శ్రీనివాసరావు 2008 ప్రజా రాజ్యం పార్టీ ఆవిర్భావంతో పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజపతినగరం నియోజకవర్గం పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో పార్టీలో చేరి పార్టీ గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితుడై 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

కడుబండి శ్రీనివాసరావు 2015లో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితుడై,[2] 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శృంగవరపుకోట నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి పై 11365 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన నవంబర్ 2019లో ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సబార్డినేట్‌ చట్ట సభ్యుడిగా నియమితుడయ్యాడు.[3]

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితా". Archived from the original on 8 November 2021. Retrieved 8 November 2021.
  2. Sakshi (21 October 2015). "అనకాపల్లి వైఎస్సార్‌సీపీ పరిశీలకుడిగా కడుబండి". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
  3. Sakshi (21 November 2019). "ఎస్‌.కోట ఎమ్మెల్యేకు అరుదైన అవకాశం". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.