కథనం (2019 సినిమా)
కథనం | |
---|---|
దర్శకత్వం | రాజేష్ నాదేండ్ల |
రచన | రాజేంద్ర భరద్వాజ్ |
స్క్రీన్ ప్లే | రాజేంద్ర భరద్వాజ్ |
నిర్మాత | బి. నాగేంద్ర రెడ్డి, శర్మ చుక్కా |
తారాగణం | అనసూయ భరధ్వాజ్ అవసరాల శ్రీనివాస్ వెన్నెల కిషోర్ |
ఛాయాగ్రహణం | సతీష్ ముత్యాల |
సంగీతం | రోషన్ సాలూరు |
నిర్మాణ సంస్థ | గాయత్రి ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 9 ఆగస్టు 2019 |
సినిమా నిడివి | 117 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథనం 2019, ఆగస్టు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజేష్ నాదేండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనసూయ భరధ్వాజ్, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో నటించగా, రోషన్ సాలూరు సంగీతం అందించాడు. గాయత్రి ఫిల్మ్స్ పతాకంపై బి. నాగేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మించిన ఈ చిత్రానికి రాజేంద్ర భరద్వాజ్ స్క్రీన్ ప్లే, సతీష్ ముత్యాల ఛాయాగ్రహణం అందించారు.
కథ
[మార్చు]అను(అనసూయ భరద్వాజ్) సినిమా పరిశ్రమలో రచయితగా కథలు రాస్తూ.. దర్శకత్వం చేసే అవకాశం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. నలుగురు నిర్మాతలు చెప్పిన కథకు స్క్రిప్ట్ రాసేందుకు అంగీకరిస్తుంది. ఆ చిత్రానికి అనసూయను దర్శకత్వ బాధ్యతలు స్వీకరించి, స్క్రిప్ట్ వర్క్ చేయమని సలహా ఇస్తారు నిర్మాతలు. అయితే ఆ కథకు సంబంధించిన కథనాన్ని ఎలా రాసుకుంటుందో, నగరంలో అదే విధంగా హత్యలు జరుగుతూ ఉంటాయి. మరి ఆ హత్యలకు, అనుకు ఉన్న సంబంధం ఏమిటి, ఆ హత్యలు చేసేది ఎవరు, అలా ఎందుకు చేస్తున్నారన్నది మిగతా కథ.[1][2]
నటవర్గం
[మార్చు]- అనసూయ భరధ్వాజ్ (అను)
- వెన్నెల కిషోర్
- రణధీర్ గట్లా (ఏసిపి రణధీర్)
- అవసరాల శ్రీనివాస్
- బబ్లూ పృథ్వీరాజ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: రాజేష్ నాదేండ్ల
- నిర్మాత: బి. నాగేంద్ర రెడ్డి, శర్మ చుక్కా
- రచన, స్క్రీన్ ప్లే: రాజేంద్ర భరద్వాజ్
- సంగీతం: రోషన్ సాలూరు
- ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల
- నిర్మాణ సంస్థ: గాయత్రి ఫిల్మ్స్
విడుదల
[మార్చు]ఈ చిత్రం 2019, ఆగస్టు 9న విడుదలై ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుండి ప్రతికూల స్పందనలను అందుకుంది.[3][4]
మార్కెటింగ్
[మార్చు]2018, అక్టోబరులో ప్రధాన తారాగణం ఆధ్వర్యంలో ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేయబడింది.[5] 2019, ఆగస్టు 3న ట్రైలర్ విడుదలయింది.
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, సినిమా (9 August 2019). "'కథనం' మూవీ రివ్యూ". బండ కళ్యాణ్. Archived from the original on 9 ఆగస్టు 2019. Retrieved 3 January 2020.
- ↑ "Kathanam Telugu Movie Review". 123telugu.com (in ఇంగ్లీష్). 10 August 2019. Retrieved 3 January 2020.
- ↑ Kathanam Movie Review {1.5/5}: A dreary, long film that fails to take off, retrieved 3 January 2020
- ↑ Chowdhary, Y. Sunita (9 August 2019). "'Kathanam' review: An unimpressive narrative is its downfall". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 3 January 2020.
- ↑ "'Kathanam': Anasuya Bharadwaj unveils her look from the film - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 3 January 2020.