కనకాయ్ జలపాతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కనకాయ్ జలపాతంన్ని కనకదుర్గ జలపాతం అనికూడా అంటారు. కుంతాలకు 35 కిలోమీటర్ల దూరంలో గిర్నూర్ సమీపంలో ఈ జలపాతం ఉంది. ఇది మూడు జలపాతాల సముదాయంగా ఉంటుంది. ఒకదానిని కనకాయ్ జలపాతం అనీ, రెండోదానిని బండ్రేవు జలపాతం అనీ, మూడోదానిని చీకటిగుండం అని పిలుస్తారు. వందల అడుగుల ఎత్తున కొండల వరుస శిఖరాగ్రాల మధ్య భాగం నుంచి సుయ్‌మని సూటిగా నింగి నుంచి నేలకు దుంకుతున్నట్టుండే సుందర దృశ్యం నయనానందకరంగా ఉంటుంది. [1]

ప్రదేశం[మార్చు]

హైదరాబాద్ నుంచి 282 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్మల్ నుంచి 54 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు వెళ్లి అక్కడ్నుంచి ప్రత్యేక వాహనాల్లో కనకాయ్ జలపాతం చేరుకోవచ్చు.

కనకాయ్_జలపాతం


మూలాలు[మార్చు]

  1. కనకాయ్ జలపాతం. "తెలంగాణ నయాగరాలు". నమస్తే తెలంగాణ. Retrieved 9 September 2017. Cite news requires |newspaper= (help)