Jump to content

కనక శ్రీనివాసన్

వికీపీడియా నుండి
కనక శ్రీనివాసన్
జననం (1947-12-12) 1947 డిసెంబరు 12 (వయసు 77)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిశాస్త్రీయ నృత్యకళాకారిణి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భరత నాట్యం
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం
సంగీత నాటక అకాడమీ అవార్డు

కనక శ్రీనివాసన్ ఒక భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణి.[1]

విశేషాలు

[మార్చు]

ఈమె చెన్నైలో 1947, డిసెంబరు 12వ తేదీన జన్మించింది.[2] ఈమె వళువూర్ బి. రామయ్య పిళ్ళై వద్ద వళువూర్ బాణీలో భరతనాట్యం అభ్యసించింది. ఇంకా ఈమె కథక్ నృత్యాన్ని విష్ణు వైచాల్కర్ వద్ద, మోహినీయాట్టం నృత్యాన్ని కళామండలం గోపాలకృష్ణన్ వద్ద నేర్చుకుంది. ఈమె తమిళ సంస్కృత పండితులతో కలిసి ప్రాచీన కావ్యాలను భరతనాట్య శైలిలో నృత్యనాటికలుగా మలిచింది. కాళిదాసు రచనలను నృత్య రూపకాలుగా మలిచి వాటికి నృత్య దర్శకత్వం వహించింది. మహాసరస్వతి అనే నృత్యరూపకానికి దర్శకత్వం వహించి తన శిష్యులతో ప్రదర్శింపజేసింది. ఈమె నర్తకిగా వెయ్యికి పైగా ప్రదర్శనలను ఇచ్చింది. ఈమె ఖజురహో ఉత్సవాలు, సింధు దర్శన్ వంటి అన్ని ముఖ్యమైన ఉత్సవాలలో పాల్గొనింది. ఈమె ఢిల్లీలో "నృత్యరంజని" అనే సంస్థను స్థాపించి అనేక మంది శిష్యులను భరతనాట్య కళాకారిణులుగా తయారు చేసింది.

పురస్కారాలు

[మార్చు]

ఈమెకు లభించిన పురస్కారాలలో:

  • సంగీత నాటక అకాడమీ అవార్డు - 1998[3]
  • పద్మశ్రీ పురస్కారం - 2006[4]
  • నృత్యచూడామణి - శ్రీకృష్ణగానసభ, చెన్నై
  • ఎం.జి.ఆర్. అవార్డు - మద్రాసు సంగీత అకాడమీ
  • ఎల్.ఎన్.గుప్త మెమోరియల్ అవార్డ్ - హైదరాబాద్
  • నృత్యరత్న అవార్డ్ - షణ్ముఖానంద సంగీత సభ - న్యూఢిల్లీ
  • సాహిత్య కళాపరిషత్ అవార్డ్ - ఢిల్లీ - 1996

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "A different learning". The Hindu. 21 May 2015. Retrieved 19 December 2015.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-04-24. Retrieved 2021-04-24.
  3. "Bharatnatyam dancer Kanaka Srinivasan receives Sangeet Natak Akademi award". India Today. 1 June 1998. Retrieved 19 December 2015.
  4. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 21 July 2015.

బయటి లింకులు

[మార్చు]