వళువూర్ బి. రామయ్య పిళ్ళై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వళువూర్ బి. రామయ్య పిళ్ళై
జననం
భాగ్యతమ్మాళ్ రామయ్య పిళ్ళై

1910
మరణం1991
జాతీయతభారతీయుడు
వృత్తిభరతనాట్యం కళాకారుడు, నాట్యగురువు
జీవిత భాగస్వామిజ్ఞానసుందరి
పిల్లలుజయలక్ష్మి
సామ్రాజ్
మనోహరన్
గురునాథన్
భాగ్యలక్ష్మి
మణిక్క వినాయగం
తల్లిదండ్రులు
  • పార్థీవన్ (తండ్రి)
  • భాగ్యతమ్మాళ్ (తల్లి)

వళువూర్ బి. రామయ్య పిళ్ళై భరతనాట్య కళాకారుడు, నాట్యగురువు.

ఆరంభ జీవితం

[మార్చు]

ఇతడు 1910వ సంవత్సరంలో పార్థీబన్, భాగ్యవతమ్మాళ్ దంపతులకు తమిళనాడు రాష్ట్రం వళువూర్ గ్రామంలో జన్మించాడు. ఇతడు నట్టువాంగం, భరతనాట్యాలను తన మేనమామ మాణిక్య నట్టువనార్ వద్ద నేర్చుకున్నాడు.

వృత్తి

[మార్చు]

ఇతడు భరతనాట్యంలో కొత్త కొత్త ప్రయోగాలు చేసి ప్రశంసలు పొందాడు. చోళుల కాలం నుండి ఇతని పూర్వీకులు ప్రదర్శిస్తున్న వళువూర్ బాణీని ఇతడు కొనసాగించాడు. ఇతడు ఈ బాణీని విశ్వవ్యాప్తంగా ప్రచారంలోకి తెచ్చాడు. ఇతడు రామనాటక కృతి, త్యాగరాజ స్వామి కృతులు, భారతీయార్ గీతాలు, కుట్రలక్ కురవంజి, అరుణాచల కవి పాటలు, ఊటుక్కాడు వెంకటకవి పాటలను ఇతడు భరతనాట్యం ద్వారా ప్రదర్శించాడు.ఇతడు స్వంతంగా కొన్ని శబ్దాలకు, వర్ణాలకు, జతిస్వరాలకు, తిల్లానాలకు నాట్యరూపం కల్పించాడు. ఆ రోజులలో బ్రిటీష్ వారు నిషేధించిన భారతీయార్ దేశభక్తి పాటలను ఇతడు నృత్య రూపకాల రూపంలో తన శిష్యుల ద్వారా ప్రదర్శింపజేసి స్వాతంత్ర్యోద్యమానికి తన వంతు సహాయం అందించాడు.

కుటుంబం

[మార్చు]

ఇతడు జ్ఞానసౌందర్యాన్ని వివాహం చేసుకున్నాడు. వీరికి జయలక్ష్మి, సామ్రాజ్, మనోహరన్, గురునాథన్, భాగ్యలక్ష్మి, మాణిక్య వినాయగం అనే సంతానం కలిగింది. వీరిలో సామ్రాజ్, భాగ్యలక్ష్మిలు నాట్యకళాకారులు కాగా, మాణిక్య వినాయగం సినిమాలలో పాటలు పాడుతున్నాడు.

ఇతడు, ఇతని కుమారుడు సామ్రాజ్‌ల తరువాత ఇతని మనుమలు ఎస్.పళనియప్పన్ పిళ్ళై, సామ్రాజ్ కుమారన్, మనుమరాళ్ళు ఎస్.కళా సామ్రాజ్, శ్రీదేవీ సెంథిల్‌లు ఇతని అడుగు జాడలలో నడుస్తూ వళువూర్ బాణీని ప్రచారంలోకి తెచ్చారు.

శిష్యులు

[మార్చు]

ఇతని శిష్యులలో కొందరు:

అవార్డులు

[మార్చు]

ఇతనికి లభించిన పురస్కారాలలో కొన్ని:

మూలాలు

[మార్చు]
  1. "List announced by the authentic website of Tamil Isai Sangam". Archived from the original on 2012-02-12. Retrieved 2021-04-10.
  2. "SNA Awardees List". Archived from the original on 30 మే 2015. Retrieved 5 ఫిబ్రవరి 2016.