పద్మా సుబ్రహ్మణ్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పద్మా సుబ్రహ్మణ్యం

పద్మా సుబ్రహ్మణ్యం (జననం. ఫిబ్రవరి 4, 1943) భారతదేశంలోని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి. ఈమె పరిశోధకురాలు, నృత్య దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సంగీతకారులు , ఉపాధ్యాయులు, రచయిత. ఈమె భారత దేశంలోనే కాక విదేశాలలో కూడా ఖ్యాతి పొందారు. అనేక చలనచిత్రాలు, లఘుచిత్రాలు జపాన్, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాలలో ఆమె గౌరవార్ధం చేయబడ్డాయి.

జీవిత విశేషాలు[మార్చు]

పద్మా సుబ్రహ్మణ్యం ప్రముఖ చలన చిత్ర దర్శకుడు కె.సుబ్రహ్మణ్యం, మీనాక్షి సుబ్రహ్మణ్యం లకు ఫిబ్రవరి 4 1943మద్రాసులో జన్మించారు.ఈమె తండ్రి చలన చిత్ర నిర్మాత. ఆమె తల్లి మీనాక్షి ఒక సంగీత దర్శకురాలు, తమిళ, సంస్కృత రచయిత. పద్మా సుబ్రహ్మణ్యం బి.రామయ్య పిళ్ళై వద్ద శిక్షణ పొందారు.

ఈమె సంగీతం బ్యాచులర్స్ డిగ్రీ, ఎత్నో-మ్యూజికాలజీ ఒక మాస్టర్ డిగ్రీ ని పొందారు. నృత్యంలో పి.హెచ్.డి ని కూడా పొందారు. ఆమె అనేక వ్యాసాలు, పరిశోధన పత్రాలు, పుస్తకాలు రచించారు, విద్య, సంస్కృతి కోసం ఇండో ఉప కమిషన్ లో ఒక అనధికార సభ్యునిగా వ్యవహరించారు.

అవార్డులు[మార్చు]

ఈమె అనేక అవార్డులను పొందారు. ఈమెకు 1981 లో పద్మశ్రీ, 2003 లో పద్మ భూషణ అవార్డులు వచ్చినవి. ఆమె నృత్య ప్రస్థానంలో అనేక యితర అవార్డులు కూడా పొందారు.

  • సంగీత నాటక కమిటీ అవార్దు (1983)'
  • పద్మ భూషణ (2003)
  • కళైమణి అవార్డు (తమిళనాడు ప్రభుత్వం నుండి)
  • మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి "కాళిదాసు సమ్మాన్" అవార్డు.
  • నారద గాన సభ , చెన్నై నుండి "నాద బ్రహ్మం" అవార్డు.
  • "ఆసియాలో అభివృద్ధి, సామరస్యాన్ని ఆమె సహకారం" అందించినందుకుగాను జపాన్ ప్రభుత్వం చే ఫకోకా ఆసియన్ కల్చర్ ప్రైజ్

సూచికలు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.