కనికా కపూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనికా కపూర్
Kanika Kapoor launches "Teddy Bear".jpg
2016 లో కనికా కపూర్
జననం (1978-08-21) 1978 ఆగస్టు 21 (వయస్సు 43)
లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
జాతీయతభారతీయులు
విద్యాసంస్థభత్కండే మ్యూజిక్ ఇనిస్టిట్యూట్
వృత్తి
 • గాయని
 • స్వరకర్త
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
రాజ్ చందోక్
(m. 1998; div. 2012)
సంగీత ప్రస్థానం
సంగీత శైలి
 • వెస్టర్న్
 • పాప్ మ్యూజిక్
 • సినిమా సంగీతం
 • సూఫీ
వాయిద్యాలువోకల్స్
లేబుళ్ళు
 • టి.సిరీస్
 • జీ.మ్యూజిక్ కంపెనీ
వెబ్‌సైటుkanikakapoor.com

కనికా కపూర్ (జననం: 1978 ఆగస్టు 21) భారతీయ గాయని. ఆమె లక్నోలో పుట్టి పెరిగింది. ఆమె ఎప్పుడూ గాయకురాలిగా వృత్తిని కొనసాగించాలని ఆకాంక్షించింది, కానీ ఆమె 1997 లో వ్యాపారవేత్త రాజ్ చందోక్‌ను వివాహం చేసుకుని లండన్‌కు వెళ్లింది. అక్కడ ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. 2012 లో రాజ్ నుండి విడాకులు తీసుకున్న తరువాత, ఆమె గాయకురాలిగా మారడానికి ముంబైకి మకాం మార్చింది. కపూర్ మ్యూజిక్ వీడియో కోసం పాడిన మొట్టమొదటి పాట "జుగ్ని జీ" (2012) వాణిజ్యపరంగా విజయవంతమైంది. 2014 లో రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రం కోసం "బేబీ డాల్" పాటతో ఆమె తన బాలీవుడ్ నేపధ్య గానం వృత్తిని ప్రారంభించింది. చిత్రం విడుదలైన తరువాత, "బేబీ డాల్" చార్టులలో అగ్రస్థానంలో నిలిచింది. కపూర్ తన గానం శైలికి విస్తృత విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రానికి ఆమెకు ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్‌కు ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.

కపూర్ తదనంతరం హ్యాపీ న్యూ ఇయర్ (2014) చిత్రానికి "లవ్లీ", "కమ్లీ", రాయ్ (2015) చిత్రానికి "చిట్టియన్ కలైయన్" , "దేశి" చిత్రానికి ఏక్ పహేలీ లీలా (2015) చిత్రం కోసం "దేశీ లుక్", ఆల్ ఈజ్ వెల్ (2015) చిత్రానికి "నాచన్ ఫర్రేట్", కిస్ కిస్కో ప్యార్ కరూన్ (2015) చిత్రం కోసం "జుగ్ని పీకే టైట్ హై", " మెయిన్ ఔర్ చార్లెస్ (2015) చిత్రానికి "జబ్ చాయే తేరా జాడూ", హేట్ స్టోరీ 3 (2015) చిత్రానికి "నీన్దేన్ ఖుల్ జాతి హై", దిల్‌వాలే (2015) చిత్రానికి "ప్రీమికా" వంటి పాటలు పాడినందుకు గుర్తింపు పొందింది. తరువాత అత్యధిక వసూళ్లు చేసిన బాలీవుడ్ చిత్రాలలో గుర్తింపు పొందిన ర్యాంకుల్లో నిలిచింది. ఉడ్తా పంజాబ్ (2016) చిత్రం నుండి వచ్చిన "డా డా దాస్సే" పాట ఆమెకు అనేక ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ అవార్డులు, నామినేషన్లను సంపాదించింది. దాని తరువాత ఆమె బీమాన్ లవ్ (2016) నుండి "హగ్ మి", ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా (2016) చిత్రం నుండి "లవ్ లెటర్" పాటలను పాడింది. ఆన్ని పాటలు విజయవంతమయ్యాయి.

మార్చి 2020 లో, లండన్ నుండి తిరిగి వచ్చిన తరువాత, లక్నోలోని హోటల్ తాజ్ వద్ద భారత రాజకీయ నాయకులు, విఐపిలతో కలిసి ఆమె భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పార్టీలకు హాజరయింది. ఆ సమయంలో కరోనావైరస్‌కు వ్యతిరేకంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గృహ నిర్బంధంలో ఉండాలని సలహా ఇచ్చింది. తరువాత, ఆమె కోవిడ్ -19 కు పాజిటివ్ రిపోర్డు వచ్చింది. ఆమె నిర్లక్ష్యానికి ఆమెపై ఫిర్యాదు చేశారు.

బాల్య జీవితం[మార్చు]

కపూర్ 1978 ఆగస్టు 21 న ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జన్మించారు. ఆమె తండ్రి రాజీవ్ కపూర్ ఒక వ్యాపారవేత్త, ఆమె తల్లి పూనం కపూర్ ఒక బోటిక్ యజమాని.[citation needed] ఆమె ఉత్తర ప్రదేశ్ లోని ఖాత్రి కుటుంబంలో పుట్టి పెరిగింది. [1] అక్కడ ఆమె సంగీతం కూడా అభ్యసించింది.[2][3] ఆమె తన 12 సంవత్సరాల వయస్సులో, వారణాసి నుండి సంగీతకారుడు పండిట్ గణేష్ ప్రసాద్ మిశ్రా ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించడం ప్రారంభించింది. అతనితో పాటు భారతదేశం చుట్టూ శాస్త్రీయ కచేరీలకు హాజరయింది. కపూర్ తన బాల్యంలో పాఠశాలలో అనేక సంగీత పోటీలలో పాల్గొంది. 15 సంవత్సరాల వయస్సులో ఆమె ఆల్ ఇండియా రేడియోలో భజన్ గాయకుడు అనుప్ జలోటాతో కలిసి అతని ప్రదర్శనలలో పాల్గొంది. ఆమె బి.ఏ.డిగ్రీని పూర్తిచేసింది. ఆపై లక్నోలోని భట్ఖండే మ్యూజిక్ ఇనిస్టిట్యూట్ నుండి సంగీతంలో మాస్టర్స్ డిగ్రీని పొందింది. ఆ తర్వాత ఆమె తన సంగీత వృత్తిని కొనసాగించడానికి ముంబైకి వెళ్లింది.[4]

వ్యక్తిగత జీవితం[మార్చు]

కనికా కపూర్ 1997 లో రాజ్ చందోక్ అనే ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తను వివాహం చేసుకుని తన భర్తతో పాటు లండన్ వెళ్ళింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె 2012 లో తన భర్త నుండి విడిపోయి లక్నోలోని తన తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్లింది.[5][6][7] . ఈ జంట 2012 లో విడాకులు తీసుకున్నారు.[8][9]

కపూర్ తెలియజేసిన ప్రకారం ఆమె పంజాబీ సాహిత్యంతో వివిధ బాలీవుడ్ పాటలు పాడినప్పటికీ, ఆమె పంజాబీ మాట్లాడలేదు. తద్వారా తనను తాను "యుపి ఖాత్రి" గా భావిస్తుంది.[10]

మూలాలు[మార్చు]

 1. "Kanika Kapoor: I am just a simple small town girl who has been through a lot". The Times of India. Archived from the original on 18 November 2015. I am a Khatri, who was born and brought up in Lucknow ... I got married to Raj and moved to London when I was only 17 ... we separated about five years ago and finally divorced three years back ... This was January 2012 ... By July, Raj and I had separated and in October, I won the best British Asian award.
 2. Sunayana Suresh (18 March 2014). "I had no idea who Sunny Leone was: Baby Doll singer". The Times of India. Archived from the original on 13 October 2014. Retrieved 21 December 2014.
 3. "I love Chandigarh, sarson ka saag ..." The Tribune. 20 June 2016.
 4. R.M. Vijayakar (12 May 2015). "I Am Living My Ambitions and Dreams, Says Kanika Kapoor". The New Indian Express. Retrieved 12 May 2015.
 5. Elina Priyadarshini Padhiary (18 November 2014). "Im not here jut to sing for Bollywood: Kanika Kapoor". The Times of India. Retrieved 21 December 2014.
 6. "PHOTOS: 18 की उम्र में हुई थी सिंगर कनिका कपूर की शादी, 3 बच्चों की हैं मां". NDTV India. 18 June 2016.
 7. Devanshi Seth (15 May 2014). "I had to deal with a lot of vicious rumours: Kanika Kapoor". The Times of India. Retrieved 21 December 2014.
 8. "Kanika Kapoor: I am just a simple small town girl who has been through a lot". The Times of India. Archived from the original on 18 November 2015. I am a Khatri, who was born and brought up in Lucknow ... I got married to Raj and moved to London when I was only 17 ... we separated about five years ago and finally divorced three years back ... This was January 2012 ... By July, Raj and I had separated and in October, I won the best British Asian award.
 9. Roy, Saumya (30 January 2016). "Smaal talk: The siren's call". Mumbai Mirror. Retrieved 29 February 2016.
 10. "I'm not Punjabi, I don't know Punjabi: Kanika Kapoor". 21 June 2016.

బాహ్య లంకెలు[మార్చు]