కన్యాశుల్కం (మొదటి కూర్పు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురజాడ అప్పారావు

కన్యాశుల్కం మొదటి కూర్పు నాటకాన్ని గురజాడ అప్పారావు 1892లో రాసిన తెలుగు నాటకం. సుప్రసిద్ధమైన రెండవ కూర్పుకు దీనికి చాలా పోలికలు, భేదాలు ఉన్నాయి.

ఇతివృత్తం

[మార్చు]

గిరీశం విజయనగరం బొంకుల దిబ్బ వద్ద ఉండగా నాటకం ప్రారంభం అవుతుంది. గిరీశం చేసిన అప్పులు తీర్చమని ఊళ్ళోవాళ్ళు అడుగుతూంటే వారి బారి నుంచి తప్పించుకునేందుకు తన శిష్యుడైన వెంకటేశానికి చదువు చెప్పే వంకతో వారి గ్రామానికి వెళ్ళిపోతాడు. వెంకటేశం అప్పటికే పరీక్ష తప్పి ఉండడంతో, ఇంట్లో తండ్రి కొడతాడేమోనన్న భయంతో ఉండడాన్ని కనిపెట్టి అతనికి తండ్రితో దెబ్బలు తప్పిస్తానని చెప్పి ఊరికి వస్తాడు.

తేడాలు

[మార్చు]

మొదటి కూర్పుకీ కన్యాశుల్కం నాటకంగా ప్రఖ్యాతి చెందిన రెండవ కూర్పుకీ మధ్య చెప్పుకోదగ్గ ప్రధానమైన భేదాలు ఉన్నాయి.

  • మధురవాణి : కన్యాశుల్కం రెండవ కూర్పులో ప్రధాన పాత్రల్లో ఒకటిగా ఉండి, తెలుగు సాహిత్య చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందిన మధురవాణి పాత్ర నిడివి మొదటి కూర్పులో చాలా తక్కువ. మహారాజు ఆనంద గజపతి ఇష్టసఖి అయిన దేవదాసి మహిళ రామస్వామి వ్యక్తిత్వానికి ప్రభావితడైన గురజాడ అప్పారావు కన్యాశుల్కం మొదటి కూర్పులో చిరు పాత్రగా ఉన్న మధురవాణి పాత్రను 1910లో రెండవ కూర్పు నాటికి పూర్తిస్థాయి పాత్రగా, పలు కోణాలను ఆవిష్కరించేలా రూపకల్పన చేశాడని సాహిత్యవేత్త మన్నె సత్యనారాయణ భావించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. మన్నె, సత్యనారాయణ (11 August 2011). "గురజాడ అంతరంగ నివేదనే - మధురవాణి పాత్ర". మాలిక పత్రిక. నిడదవోలు మాలతి. Archived from the original (ఆన్‌లైన్) on 29 జూన్ 2018. Retrieved 17 June 2018.