కమల లక్ష్మణ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కమల లక్ష్మణ్
జననంకమల
చెన్నై
మరణంనవంబరు 14 2015
పూణె
జాతీయతభారతీయులు
వృత్తిరచయిత
ప్రసిద్ధులురచయిత
జీవిత భాగస్వామిఆర్.కె.లక్ష్మణ్

కమల లక్ష్మణ్ ప్రఖ్యాత రచయిత్రి. ఆమె ప్రముఖ కార్టునిస్టు ఆర్.కె.లక్ష్మణ్ యొక్క రెండవ భార్య.[1] ఆర్.కె.లక్ష్మణ్ యొక్క మొదటి భార్య పేరు కూడా "కమల" ఆమె కుమారి కమల గా పిలువబడుతోంది. ఆమె ప్రఖ్యాత నర్తకి. ఆమెతో 1960 లో లక్ష్మణ్ విడాకులు తీసుకున్నారు[2].

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె చెన్నై లో జన్మించారు. ఆమె సెయింట్స్ థామస్ కాన్వెంట్ లో చదివారు తరువాత ఢిల్లీ ఇంద్రప్రస్థ కళాశాలలొ పట్టభద్రురాలైనారు. ఆమె ఇంటీరియర్ డెకరేషన్ కోర్సును ముంబై నందలి సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నందు పూర్తిచేసారు. ఆమె ప్రముఖ బాలల పుస్తకాల రచయిత. ఆమెను ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్.కె.లక్ష్మణ్ రెండవ భార్యగా వివాహమాడారు. ఆమె వ్రాసిన తెనాలి రామకృష్ణ పుస్తకం టెలివిజన్ సీరియల్ గా దూరదర్శన్ లో 13 ఎపిసోడ్లుగా ప్రసారమైనది[3][4].

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె భర్త ప్రఖ్యాత కార్టూనిస్టు ఆర్.కె.లక్ష్మణ్. ఆమె కుమారుడు శ్రీనివాస లక్ష్మణ్ ప్రముఖ జర్నలిస్టు.

మరణం[మార్చు]

ఆమె నవంబరు 14 2015 న అనారోగ్యంతో తన 89వ యేట పూణె లోని తన నివాస గృహంలో మరణించారు.[5]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]