కమ్మదనం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

కమ్మదనం, మహబూబ్ నగర్ జిల్లా, ఫరూఖ్ నగర్ మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 509216. మండల కేంద్రమైన షాద్‌నగర్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

కమ్మదనం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్ జిల్లా
మండలం ఫరూఖ్ నగర్
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,782
 - పురుషుల సంఖ్య 903
 - స్త్రీల సంఖ్య 879
 - గృహాల సంఖ్య 442
పిన్ కోడ్ 509216
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

జనాభా[మార్చు]

2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2021. ఇందులో పురుషుల సంఖ్య 847, స్త్రీల సంఖ్య 1174. గృహాల సంఖ్య 355.

2011 గణన ప్రకారం గ్రామ జనాభా 1782. ఇందులో పురుషుల సంఖ్య 903, స్త్రీల సంఖ్య 879. గృహాల సంఖ్య 442. అక్షరాస్యత శాతం 51.85%. గ్రామ కోడ్ సంఖ్య 575203.

విద్యా సంస్థలు[మార్చు]

  • ఈ గ్రామములో మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నది.
  • తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

రాజకీయాలు:[మార్చు]

[[[జూలై]] 2013లో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా యశోధ ఎన్నికయ్యారు.

అటవీ క్షేత్రం[మార్చు]

ఈ గ్రామం ప్రకృతి రమణియంగా అటవీ ప్రాంతంలో విస్తరించి ఉంది. సుమారు 824 ఎకరాలలో విస్తరించి వున్న ఈ అటవీ ప్రాంతంలో పలు రకాల ఔషదాల మొక్కలు, పలు రకాల జంతువులు అడవిని సందర్శించిన వారికి కనువిందు చేస్తుంటాయి. 2000లో అప్పటి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు ఉల్ఫెన్ సన్తో పాటు అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కమ్మందనం అటవీ క్ష్రేత్రాన్ని సందర్శించారు.

"https://te.wikipedia.org/w/index.php?title=కమ్మదనం&oldid=2058592" నుండి వెలికితీశారు