కరిడివారి పల్లి
స్వరూపం
కరిడివారి పల్లి, చిత్తూరు జిల్లా, బంగారుపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
కరిడివారి పల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 13°12′46″N 78°55′15″E / 13.212783°N 78.920957°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | చిత్తూరు |
మండలం | బంగారుపాలెం |
ప్రభుత్వం | |
- సర్పంచిశ్రీమతి సంపూర్ణమ్మ గారు | |
పిన్ కోడ్ | 517416 |
ఎస్.టి.డి కోడ్ |
కరిడివారి పల్లి బంగారుపాళ్యానికి కేవలం 2 కి.మీ. ల దూరంలో గలదు. ఈ గ్రామంలో రైతులు ఎక్కువగా మామిడి తోటలను పెంచుతారు. ఈ గ్రామంలో ఒక పురాతన దేవాలయం గలదు. ఆ దేవాలయం ద్రౌపది దేవి, పంచ పాండవులది. ఒక చర్చి గలదు. గ్రామంలోని ప్రజలు ఎంతో ఐక్యతతో మెలగుతారు. దీపావళి, సంక్రాంతి పండుగలను ఎంతో ఘనంగా జరుపుతారు. చాలా మంది ఉపాధ్యాయులు కలరు. కనీస అవసరాల వసతులు బాగా వుంటాయి. ఒక పాఠశాల గలదు. ఇది 1990 కన్న ముందు నిర్మించబడింది. దేశ సేవకు అవసరమయ్యే సైనికులు ఈ గ్రామం నుంచి కూడా ఉన్నారు. గ్రామ పెద్దలుగా నరసింహా రెడ్డి, గురుస్వామి రెడ్డి వ్యవహరిస్తున్నారు. విద్యావంతులు ఎక్కువగా ఉన్నారు. గ్రామంలో ఎక్కువగా క్రికెట్, వాలీ బాల్ టోర్నమెంట్లు జరుగుతూ వుంటాయి.