కరీన్ జీన్ పియర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరీన్ జీన్ పియర్
2023లో కరీన్ జీన్ పియర్
35వ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ
Assumed office
2022 మే 13
అధ్యక్షుడుజో బైడెన్
Deputyఒలివియా డాల్టన్ (ప్రిన్సిపల్ డిప్యూటీ)
అంతకు ముందు వారుజెన్ ప్సాకి
వైట్ హౌస్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ
In office
2021 జనవరి 20 – 2022 మే 13
అధ్యక్షుడుజో బైడెన్
అంతకు ముందు వారుబ్రియాన్ మోర్గెన్‌స్టెర్న్
తరువాత వారుఒలివియా డాల్టన్
వ్యక్తిగత వివరాలు
జననం (1974-08-13) 1974 ఆగస్టు 13 (వయసు 49)
ఫోర్ట్-డి-ఫ్రాన్స్, మార్టినిక్, ఫ్రాన్స్
రాజకీయ పార్టీడెమోక్రటిక్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్)
సంతానం1
చదువున్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్)
కొలంబియా యూనివర్సిటీ (మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)

కరీన్ జీన్ పియర్ (ఆంగ్లం: Karine Jean-Pierre; జననం 1974 ఆగస్టు 13) 2022 మే 13 నుండి వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తున్న ఒక అమెరికన్ రాజకీయ సలహాదారు. దీనికి ముందు, ఆమె 2021 నుండి 2022 వరకు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా, అమెరికాలో 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో యు.ఎస్. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి కమలా హారిస్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసింది.[1]

ఈ పదవి చేపట్టిన మొదటి నల్లజాతి (ఆఫ్రికన్ అమెరికన్లు)కి చెందిన వ్యక్తి ఆమె, అలాగే, మొదటి ఎల్జీబీటీ కూడా.[2]

2020 ఎన్నికల సమయంలో కమల హారిస్‌తో, జో బైడెన్ పరిపాలనలో పనిచేయడానికి ముందు, ఆమె ప్రోగ్రెసివ్ అడ్వకేసీ గ్రూప్ మూవ్ఆన్కి సీనియర్ సలహాదారుగా వ్యవహరించింది. అక్కడ జాతీయ ప్రతినిధిగా ఉంది. ఆమె గతంలో ఎన్బీసి న్యూస్ (NBC News), ఎమ్ఎస్ఎన్బీసి (MSNBC)లకు రాజకీయ విశ్లేషకురాలుగా, కొలంబియా విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ, ప్రజా వ్యవహారాలు సబ్జెక్ట్ లెక్చరర్ గా కూడా చేసింది.

ప్రారంభ జీవితం[మార్చు]

కరీన్ జీన్ పియర్ ఫ్రాన్స్‌లోని మార్టినిక్‌లో ఫోర్ట్-డి-ఫ్రాన్స్‌లో హైతీ(Haitian) వలసదారుల కుమార్తెగా జన్మించింది.[3][4] ఆమెకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. ఆమె ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు వారి కుటుంబం న్యూయార్క్ నగరంలోని క్వీన్స్‌లో పొరుగున ఉన్న క్వీన్స్ విలేజ్‌కి మారింది. ఆమె తల్లి ఆరోగ్య సహాయకురాలుగా పనిచేసింది. కాగా, ఆమె తండ్రి టాక్సీ డ్రైవర్.[5] తల్లిదండ్రులిద్దరూ వారానికి ఆరు నుంచి ఏడు రోజులు పనికి వెళ్లితే, ఆమె చిన్నతనం నుంచే ఆమెకంటే చిన్నవాళ్లైన తోబుట్టువుల సంరక్షణ బాధ్యత చేసట్టేది. ఆమె 1993లో కెల్లెన్‌బర్గ్ మెమోరియల్ హై స్కూల్, లాంగ్ ఐలాండ్‌లోని కళాశాలలో చదువుకుంది.[6] ఆమె తల్లిదండ్రులు కరీన్ జీన్ పియర్ మెడిసిన్ చదవాలని కోరుకున్నారు. ఆమె న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కమ్యూటర్ విద్యార్థిగా లైఫ్ సైన్సెస్ చదివింది, అయితే మెడికల్ కాలేజీ అడ్మిషన్ టెస్ట్‌ (MCAT)లో పేలవ ప్రదర్శన కనబరిచింది.[7]

దీంతో, ఆమె కెరీర్ ట్రాక్‌ మారుస్తూ, 1997లో న్యూయార్క్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందింది. ఆమె 2003లో కొలంబియా యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ నుండి పబ్లిక్ అఫైర్స్ మాస్టర్‌ను పొందింది.

ఇంగ్లీష్, ఫ్రెంచ్, హైతియన్ క్రియోల్‌ భాషలలో ఆమె నిష్ణాతురాలు.

కెరీర్[మార్చు]

గ్రాడ్యుయేషన్ తరువాత, కరీన్ జీన్ పియర్ న్యూయార్క్ నగర కౌన్సిలర్ జేమ్స్ ఎఫ్. జెన్నారోకు శాసన, బడ్జెట్ వ్యవహారాల డైరెక్టర్‌గా పనిచేసింది. 2006లో, ఆమె వాషింగ్టన్, డి.సి.లోని వాల్‌మార్ట్ వాచ్‌కు ఔట్‌రీచ్ కోఆర్డినేటర్‌గా నియమితులయ్యింది. ఆమె 2004లో జాన్ ఎడ్వర్డ్స్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఆగ్నేయ ప్రాంతీయ రాజకీయ డైరెక్టర్‌గా ఉంది. ఆమె 2014లో కొలంబియా యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా చేరింది, అక్కడ ఆమె అంతర్జాతీయ, ప్రజా వ్యవహారాల అధ్యాపకురాలు.

బరాక్ ఒబామా 2008 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో, కరీన్ జీన్ పియర్ ఆగ్నేయ ప్రాంతీయ రాజకీయ డైరెక్టర్ గా, ఒబామా పరిపాలనలో వైట్ హౌస్ రాజకీయ వ్యవహారాల కార్యాలయానికి ప్రాంతీయ రాజకీయ డైరెక్టర్‌గా ఉంది.

2011లో, అధ్యక్షుడు ఒబామా 2012 తిరిగి ఎన్నికల ప్రచారానికి ఆమె నేషనల్ డిప్యూటీ బాటిల్‌గ్రౌండ్ స్టేట్స్ డైరెక్టర్‌గా పనిచేసింది. ఆమె ప్రతినిధుల ఎంపిక, బ్యాలెట్ యాక్సెస్ ప్రక్రియలకు నాయకత్వం వహించింది. ఆమె మార్టిన్ ఓ'మల్లే (Martin O'Malley) 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి డిప్యూటీ క్యాంపెయిన్ మేనేజర్‌గా చేసింది.

కరీన్ జీన్ పియర్ జో బైడెన్ 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సీనియర్ సలహాదారుగా పనిచేసింది. ఆమె మే 2020లో బైడెన్ టీమ్‌లో చేరింది.

మూలాలు[మార్చు]

  1. Eugenios, Jillian (June 1, 2021). "Karine Jean-Pierre on building a 'stronger and more inclusive' America". NBC News. Archived from the original on December 12, 2021. Retrieved January 7, 2022.
  2. Collins, Kaitlan (May 5, 2022). "Karine Jean-Pierre to become White House press secretary, the first Black and out LGBTQ person in the role". CNN. Archived from the original on May 9, 2022. Retrieved May 5, 2022.
  3. "Karine Jean-Pierre". National Black Justice Coalition. February 19, 2021. Archived from the original on May 19, 2021. Retrieved May 22, 2022.
  4. Jean-Pierre, Karine (2019). "Chapter One: My Story". Moving Forward. Hanover Square Press. ISBN 9781488054105.
  5. Jean-Pierre, Karine (November 5, 2019). Moving Forward: A Story of Hope, Hard Work, and the Promise of America. Harlequin. ISBN 9781488054105.
  6. "New White House Press Secretary Karine Jean-Pierre has ties to NYC, Long Island". WABC-TV. May 6, 2022. Archived from the original on May 9, 2022. Retrieved May 6, 2022.
  7. Grynbaum, Michael M. (May 20, 2022). "Karine Jean-Pierre's Unlikely Rise to the White House Lectern". The New York Times. Retrieved June 10, 2022.