కరోనా వైరస్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కరోనా వైరస్‌

చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ ప్రాణాంతకమైనది.కరోనా వైరస్‌ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపే ఈ వైరస్‌ను 1960ల్లో తొలిసారిగా కనుగొన్నారు.[1]పక్షులు, క్షీరదాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. [2]ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో కొత్త వైరస్‌ వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. వైరస్‌ కారణంగా వుహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో వీరి శాంపిల్స్‌ను లండన్‌కు పంపించి పరిశోధనలు నిర్వహించారు. పరిశోధనల్లో కరోనావైరస్‌’గా గుర్తించారు.కరోనా వైరస్‌‌కు ఎలాంటి వ్యాక్సిన్ గానీ, యాంటీ వైరల్ చికిత్సా విధానం గానీ అందుబాటులో లేదు.[3][4][5][6][7][8]

కరోనా అర్థం[మార్చు]

కరోనావైరస్‌ లాటిన్‌ పదం కరోనా అంటే కిరీటం అని అర్థం. ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్‌ మైక్రోస్కోప్‌లో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కన్పించడంతో ఈ పేరు పెట్టారు. [9] [10]

కరోన వైరస్ పేరు మార్పు[మార్చు]

ఈ వైరస్‌ పేరు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కొవిడ్‌-19 గా కరోనా వైరస్ పేరును మార్చారు.[11]

కరోనా వైరస్‌[మార్చు]

కట్ల పాము, నాగు పాము ఈ రెండు కూడా విషపూరితమైన సర్పాలు. ఇవి ఎక్కువగా చైనాలో ఉంటాయి. ఈ విషపూరితమైన పాములు కరవడం వలన లేదంటే, వాటిని తినడం వలన వైరస్ సోకి ఉండొచ్చని అంటున్నారు. ఈ వైరస్ సోకిన 28 రోజుల్లోగా మనిషి మరణిస్తాడు.కరోనా వైరస్ కొన్ని నెలల వరకూ మనిషి శరీరం బయట సజీవంగా ఉండగలదు[12].

మానవ కరోనా వైరస్‌ జాతులు[మార్చు]

 • హ్యూమన్‌ కరోనావైరస్‌ 229ఈ
 • హ్యూమన్‌ కరోనావైరస్‌ ఓసీ43
 • సివియర్‌ అక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(సార్స్‌-సీఓవీ)
 • హ్యూమన్‌ కరోనావైరస్‌ ఎన్‌ఎల్‌63
 • హ్యూమన్‌ కరోనావైరస్‌ హెచ్‌కేయూ1
 • మిడిల్‌ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌ కరోనావైరస్‌(మెర్స్‌-సీఓవీ)

వైరస్‌ లక్షణాలు[మార్చు]

ఈ వైరస్‌ సోకిన వ్యక్తికి జలుబు , జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యుమోనియాకు దారితీసి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చలికాలంలో ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది.

మరణాలు[మార్చు]

మృతి చెందిన వారు వ్యాధి సోకిన వారు మూలాలు
2362 77,925 [13]

కరోనా వైరస్ నుంచి జాగ్రత్తలు[మార్చు]

 • చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు, నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
 • విదేశాలకు వెళ్లినప్పుడు మాంసాహారం తప్పనిసరిగా బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి.
 • పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది.
 • కరోనా వైరస్ ఇన్ఫెక్షన్‌ వచ్చినవారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పింది అంటే ముక్కుకు టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలి.
 • మీ మరియు ఇతర వ్యక్తుల మధ్య కనీసం 1 మీటరు (3 అడుగులు) దూరం ఉండేలా చూసుకోవాలి, మరిముఖ్యంగా దగ్గడం, తుమ్మడం మరియు జ్వరం ఉన్న వారికి.[14]

భారతదేశంలో కరోనా వైరస్[మార్చు]

కేరళలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైంది. కేరళకు చెందిన ఓ విద్యార్థి చైనాలోని వూహాన్ యూనివర్శిటీలో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల భారత్‌కు వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్టు భారత ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.[15]

మూలాలు[మార్చు]

 1. de Groot RJ, Baker SC, Baric R, Enjuanes L, Gorbalenya AE, Holmes KV, Perlman S, Poon L, Rottier PJ, Talbot PJ, Woo PC, Ziebuhr J (2011). "Family Coronaviridae". In AMQ King, E Lefkowitz, MJ Adams, EB Carstens (eds.). Ninth Report of the International Committee on Taxonomy of Viruses. Elsevier, Oxford. pp. 806–828. ISBN 978-0-12-384684-6.
 2. Liu, Peilin; Shi, Lei; Zhang, Wei; He, Jianan; Liu, Chunxiao; Zhao, Chunzhong; Kong, Siu Kai; Loo, Jacky Fong Chuen; Gu, Dayong (2017-11-22). "Prevalence and genetic diversity analysis of human coronaviruses among cross-border children". Virology Journal. 14. doi:10.1186/s12985-017-0896-0. ISSN 1743-422X. PMC 5700739. PMID 29166910.
 3. "International Committee on Taxonomy of Viruses (ICTV)". talk.ictvonline.org (in ఆంగ్లం). Retrieved 2020-01-24.
 4. "Sign in". International Committee on Taxonomy of Viruses (ICTV) (in ఆంగ్లం). Retrieved 2020-01-24.
 5. "Operations Dashboard for ArcGIS". gisanddata.maps.arcgis.com. The Center for Systems Science and Engineering (CSSE) is a research collective housed within the Department of Civil and Systems Engineering (CaSE) at Johns Hopkins University (JHU). 2020-01-28. Archived from the original on 2020-01-28. Retrieved 2020-01-28.
 6. Kotyk, Alyse (2020-01-28). "B.C. confirms province's first presumptive positive case of new coronavirus". CTV News (in ఆంగ్లం). Archived from the original on 2020-01-28. Retrieved 2020-01-28.
 7. James Griffiths; Nectar Gan; Tara John; Amir Vera. "Wuhan coronavirus death toll rises, as city imposes transport lockdown". CNN.
 8. "China virus death toll mounts to 25, infections spread". Reuters (in ఆంగ్లం). 24 January 2020. Retrieved 24 January 2020.
 9. "WHO experts set to join battle against COVID-19 in China as death toll crosses 1500". The Hindu (in ఆంగ్లం). PTI. 2020-02-15. ISSN 0971-751X. Retrieved 2020-02-15.CS1 maint: others (link)
 10. "కరోనావైరస్‌లు ఎక్కడి నుంచి వస్తాయి... ఒక్కసారిగా ఎలా వ్యాపిస్తాయి?". BBC News తెలుగు. 2020-01-27. Retrieved 2020-02-06.
 11. "కరోనా వైరస్ పేరు మార్పు..!". Amaravati News (in ఆంగ్లం). Retrieved 2020-02-16.
 12. "కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా". BBC News తెలుగు. 2020-02-05. Retrieved 2020-02-06.
 13. "Coronavirus Update (Live): 77,925 Cases and 2,362 Deaths from COVID-19 Wuhan China Virus Outbreak - Worldometer". www.worldometers.info (in ఆంగ్లం). Retrieved 2020-02-22.
 14. "Advice for public". www.who.int (in ఆంగ్లం). Retrieved 2020-02-06.
 15. "భారత్‌లోకి ప్రవేశించిన కరోనా వైరస్!". www.andhrajyothy.com. 2020-01-30. Retrieved 2020-01-31.