Jump to content

కర్ణ (2023 సినిమా)

వికీపీడియా నుండి
కర్ణ
దర్శకత్వంకళాధర్ కొక్కొండ
రచనకళాధర్ కొక్కొండ
నిర్మాత
  • కళాధర్ కొక్కొండ
తారాగణం
ఛాయాగ్రహణంశ్రవణ్. జీ. కుమార్
కూర్పుశ్రవణ్. జీ. కుమార్
సంగీతంప్రశాంత్ బీజే
నిర్మాణ
సంస్థ
సనాతన క్రియేషన్స్
పంపిణీదార్లువన్ మీడియా ఈటి ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేదీ
23 జూన్ 2023 (2023-06-23)
సినిమా నిడివి
150 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కర్ణ 2023లో తెలుగులో విడుదలైన సినిమా.[1] సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై కళాధర్ కొక్కొండ నిర్మించి, దర్శకత్వం వహించాడు.[2] కళాధర్ కొక్కొండ, మోనా ఠాకూర్, ఆస్మా సయ్యద్, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 జూన్ 15న నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా[3][4], సినిమా జూన్ 23న విడుదలైంది.[5][6]

కర్ణ అనే యువకుడు (కళాధర్‌ కొక్కొండ) ముగ్గురిని చంపిన కేసులో జైలుకి వెళ్లి వస్తాడు. జైలు నుంచి బయటికి వచ్చిన తరువాత సొసైటీలో స్నేహితులను మోసం చేసిన వారినే లక్ష్యంగా చేసుకుంటూ సీరియల్ కిల్లర్ అవతారమెత్తుతాడు. అదే సమయంలో ఓ మంత్రి కొడుకును కూడా చంపేస్తాడు. మంత్రి కొడుకు హత్యతో నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులు కర్ణ వెంట పడుతుంటారు. అసలు కర్ణకు స్నేహితులను మోసం చేసిన వారిని చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది ? కర్ణ చిన్ననాటి స్నేహితుడు పండు ఏమోపోయాడు ? తను ఇష్టపడిన ఫాతిమాతో కర్ణకు పెళ్లి జరిగిందా ? కర్ణ పోలీసులకు చిక్కాడా ? అనే ఆసక్తికరమైన అంశాల సమాహారమే కర్ణ సినిమాలో మిగితా కథ.[7][8]

నటీనటులు

[మార్చు]
  • కళాధర్ కొక్కొండ
  • మోనా ఠాకూర్
  • ఆస్మా సయ్యద్
  • ఛత్రపతి శేఖర్
  • దిల్ రమేష్
  • మహేందర్
  • ప్రసాద్
  • నూకరాజు
  • అజయ్
  • ఎజాస్
  • ప్రియ
  • సోము

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: సనాతన క్రియేషన్స్
  • నిర్మాత: కళాధర్ కొక్కొండ
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కళాధర్ కొక్కొండ
  • సంగీతం: ప్రశాంత్ బీజే
  • సినిమాటోగ్రఫీ: శ్రవణ్. జీ. కుమార్
  • ఫైట్స్ : కళాధర్ కొక్కొండ
  • డాన్స్ : కిరణ్ బండార్
  • పాటలు: చంద్రప్రకాష్ చారి
  • మాటలు: గుమ్మా విజయ్ కుమార్, సంతోష్

విడుదల, స్పందన

[మార్చు]

''ఏదేమైనా ఒకవైపు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకుంటూనే తను పోషించిన కర్ణ పాత్రకు కళాధర్ కొక్కొండ పర్‌ఫెక్ట్ అనిపించుకున్నాడని. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర పోషించిన మోనా ఠాకూర్‌, ఛత్రపతి శేఖర్, దిల్ రమేష్, మహేందర్, ప్రసాద్, నూకరాజు, అజయ్, ఎజాస్, ప్రియ, ఆస్మా సయ్యద్ తమ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారని, ప్రశాంత్ బీజే అందించిన ట్యూన్స్ , బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కర్ణ మూవీని బాగా ఎలివేట్ చేసిందని, శ్రవణ్ కుమార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉందని, మొత్తానికి కర్ణ మూవీని మాత్రం ఎంజాయ్ చెయ్యొచ్చిని'' జీన్యూస్ వెబ్సైటులో పవన్ పేర్కోన్నాడు.[9][10][11]

రేటింగ్

  • సాక్షి: 2.5/5[12]
  • జీ న్యూస్ : 2.5/5
  • N టీవీ  : 2.5/5
  • 10 టీవీ : 3/5
  • 123తెలుగు.కామ్: 2.5/5

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (17 June 2023). "ప్రతీకారం నేపథ్యంలో". Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.
  2. Andhra Jyothy (15 June 2023). "చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం". Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.
  3. Prajasakti (15 June 2023). "'కర్ణ' మూవీ ట్రైలర్ ను విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.
  4. Sakshi (16 June 2023). "పగ.. ప్రతీకారం..." Archived from the original on 18 June 2023. Retrieved 18 June 2023.
  5. Telugu, ntv (2023-06-24). "రివ్యూ: యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'కర్ణ' రివ్యూ". NTV Telugu. Retrieved 2023-08-22.
  6. Telugu, 10TV; Kumar, Thota Vamshi (2023-06-24). "Karna Movie Review : 'కర్ణ' సినిమా రివ్యూ.. స్నేహితుల కోసం రివేంజ్ స్టోరీ." 10TV Telugu (in Telugu). Retrieved 2023-08-22.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. ABN (2023-06-15). "Karna Trailer: చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం | Dil Raju Launched Karna Movie Trailer Talk KBK". Chitrajyothy Telugu News. Retrieved 2023-08-22.
  8. telugu, NT News (2023-06-17). "ప్రతీకారం నేపథ్యంలో". www.ntnews.com. Retrieved 2023-08-22.
  9. "Karna Movie Review & Rating: కర్ణ మూవీ రివ్యూ అండ్ రేటింగ్". Zee News Telugu. 2023-06-24. Retrieved 2023-08-22.
  10. "జనవరి 28న 'కర్ణ' థీమ్ సాంగ్." Telugu Times - USA NRI Telugu News Telugu News Papers In USA (in ఇంగ్లీష్). Retrieved 2023-08-22.
  11. Now, Telugu World (2023-06-06). "భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'కర్ణ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్". Telugu World Now - Telugu News (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-08-22. Retrieved 2023-08-22.
  12. "Karna Movie Review: 'కర్ణ' మూవీ ఎలా ఉందంటే." Sakshi. 2023-06-24. Retrieved 2023-08-22.