కర్బూజ

వికీపీడియా నుండి
(కర్బూజా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కర్బూజ
Scientific classification
Kingdom:
Plantae
Order:
Cucurbitales
Family:
Cucurbitaceae
Genus:
Cucumis
Species:
melo

ఉపోద్ఘాతం

[మార్చు]

కర్బూజ దోస జాతికి చెందిన పండు. దీని శాస్త్రీయ నామం కుకుమిస్ మెలో. మరొక పేరు కుకుర్బిట మాక్సిమా.

ఇది దోస రకానికి చెందింది కాబట్టి దీన్ని కూరగాయ అనికొద్ది మంది వర్గీకరిస్తుంటారు.

దీని పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ మాలోపల మాత్రం అంతా మెత్తగా ఉంటుంది. కొన్ని రకాల్లో తోలు కూడా పలుచగానే ఉంటుంది. ఇవి పక్వానికి వచ్చే తరుణంలో ఒక రకమైన వాసనను వెలువరిస్తాయి. మస్క్‌ డీర్అ నే ఒక రకమైన జింక నుండి కూడా ఒక అద్భుతమైన సువాసన వెలువడుతుంది. ఆ సువాసన గుర్తుకు తెచ్చేలా వుంటుంది కాబట్టి, ఈ వాసనను బట్టి వీటికి మస్క్‌ మెలన్‌ (muskmelon) అనే పేరు కూడా ఉంది. అయితే ఇవి మగ్గితేనే ఆ వాసన విడుదల చేస్తాయి.

కర్బూజ యొక్క జన్మ స్థలాలు ఇరాన్, అనటోలియా, అర్మీనియా ప్రాంతాలు అయిఉండవచ్చని భావిస్తారు. వాయవ్య భరత ఖండంలో, ప్రత్యేకించి కాశ్మీర్‌, ఆఫ్ఘనిస్తాన్లు ద్వితీయ కేంద్రాలు. అక్కడి నుండి చైనా, పర్షియా ప్రాంతాలకు వ్యాపించాము. వీటిలో అడవి రకాలు ఎన్నో ఆ ప్రాంతాలలో కనిపించేవి. ఇవి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు దేశంలో సాగులో ఉండేవిట. వీటిలోని ఔషధ గుణాల గురించి క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలోనే గ్రీకు వైద్యుడు గాలెన్‌ వివరించాడు. రోమన్లు కూడా సాగు చేసేవారు.

ఈ మొక్క అనేక సాగురకాలు (cultivars) గా అభివృద్ధి చెందింది. వీటిలో సున్నితమైన చర్మం రకాలు ఉన్నాయి. అమెరికా దొసకాయ కూడా కర్బూజ లోని ఒక రకము. కానీ దాని ఆకారం, రుచి, ఉపయోగాలు చాలా వరకు దోసకాయను పోలి ఉంటాయి. ఇది "పెపో" అనే రకం పండు.

జాతులవారీగా సాగురకాలు

[మార్చు]
  • జల కర్బూజ (Watermelon, Citrullus. lanatus) 4000 సంవత్సరాల క్రితమే ఆఫ్రికాలో సాగు చేసేవారనడానికి ఆధారాలు ఉన్నాయి [1]. ఎండా కాలంలో ఈ పండుకి ఎంతో ఆదరణ ఉంది [2]
    • కస్తూరి కర్బూజ (Muskmelon, Cucumis melo)
    • కసాబ కర్బూజ (Casaba, Cucumis melo casabas), పచ్చటి రంగు. నున్నటి తొక్క మీద చారికలు ఉంటాయి. ఇతర కర్బూజలతో పోల్చితే షాడబం (flavor) తక్కువ. కాని ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.[3]
    • మధురపు కర్బూజ (Honeydew, Cucumis melo honeydew), ఆకుపచ్చ రంగులో ఉన్న గుజ్జు ఎంతో తియ్యగా, రసాలూరుతూ ఉంటుంది.
    • అమెరికా కేంటలూప్ (North American cantaloupe, C. melo reticulatus). తొక్క మీద వలయాకారపు చారికలు ఉంటాయి. లోపల గుజ్జు పసుపు పచ్చగా ఉంటుంది. [4]

ఉపయొగాలు

[మార్చు]

వీటిని కొన్నిసార్లు తాజాగా, మరికొన్నిసార్లు ఎండబెట్టి వినయోగిస్తారు. ఖర్బుజ విత్తనాలు ఎండబెటి వాటితొ దోస నూనె ఉత్పత్తికి ప్రక్రియ చేస్తారు. ఇంకొన్ని రకాలను వాటి సువాసన కొఱకే పెంచుతారు. జపనీయ మద్యం మిదోరిలో రుచి కొఱకు దీనిని వాడుతారు.

Buttercup squash
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
C. maxima
Binomial name
Cucurbita maxima

ఈ పండు వేసవిలో మంచి చలువ చేయడమే కాకుండా, క్యాలరీలు లేని తీపిదనాన్ని ప్రసాదిస్తాయి. లేత నారింజ రంగులో వుండే గుజ్జు రుచిగా వుంటుంది. ఈ గింజల్ని కూడా ఎండబెట్టిన తర్వాత ఒలుచుకుని తింటారు. రకరకాల పంటల్లో వాడతారు.

ఆయుర్వేదంలో కూడా ఈ రసాన్ని చాలా రకాల సమస్యల నివారణకు సూచిస్తారు. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, మలబద్దకం, మూత్రనాళ సమస్యలు, ఎసిడిటి, అల్సర్‌ వంటి పరిస్థితుల్లో మా గుజ్జుని తగినంత నీటిలో కలిపి తాగితే మంచి మేలు. మేము శరీరంలో వేడిని గణనీయంగా తగ్గిస్తాయి. ఆకలి పెంచుతాము. అలసట తగ్గిస్తాయి. అంత త్వరగా జీర్ణం కావు కానీ మంచి శక్తిని ఇస్తాయి. కొంతమంది లైంగిక శక్తి పెరుగుదలకు కూడా సూచిస్తారు. బరువు తగ్గాలనుకునేవారికి ఈ పండు శ్రేష్ఠమైనది.

అరగడానికి కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి కడుపు నిండినట్టు వుంటుంది. క్యాలరీలు రావు. పైగా ఇందులోని పీచు పదార్థాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. వీటిలో పొటాషియం అధికంగా వుంటుంది. అందువల్ల రక్తపోటునీ, గుండె పనితనాన్ని మెరుగు పరుస్తాయి. అంతే కాదు, కిడ్నీలలో రాళ్లు రాకుండా నివారిస్తూ, వృద్ధాప్యంలో ఎముకల బలానికి తోడ్పడతాయి. ఇక విటమిన్‌ 'సి' పుష్కలంగా వుంటుంది. విటమిన్‌ 'ఎ' కూడా బాగానే వుంటుంది. దాని వల్ల చర్మం మెరుగుపడుతుంది. ఫోలిక్‌ఆమ్లం వల్ల గర్భిణీ స్త్రీలు లాభపడతారు.

మెలన్ డే

[మార్చు]

భారతదేశంలో ఇవి అధికంగా పండినా, తుర్కమేనిస్తాన్‌లో మాత్రం విరివిగా పండుతాయి. అక్కడ వీటి గౌరవ సూచకంగా ఒక రోజును మెలన్‌డేగా పాటించబడే ఆరోజు అక్కడ సెలవుదినం కూడా. తుర్కమేనిస్తాన్‌లో పండే కర్బూజాలు వేరెక్కడా లేని విధంగా అద్భుతమైన సువాసన, మధురమైన రుచితో వుంటాయి. వీటిని అక్కడ స్వర్గ ఫలాలని అంటారు. ఏటా ఆగస్టు మాసంలోని రెండవ ఆదివారాన్ని మెలన్‌డేగా పాటిస్తారు. ఆ అలవాటు 1944 నుండి వస్తోంది. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు సాపర్‌మురత్‌ నియాజోన్‌ తనని తాను తురుష్కుల నాయకుడిగా (తురుష్క్మ్‌న్‌ భాషి) పిలిపించుకునే వాడు. ఆ పేరు మీద ఒక సంకర జాతి కర్బూజాని కూడా రూపొందించారు.

పోషక విలువలు

[మార్చు]

100 గ్రాములకు, కర్బూజాలు 34 కేలరీలు ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్-సి అందించడనికి సహాయపడతాయి.

పోషక విలువలు: ప్రతి వంద గ్రాములకు

[మార్చు]
  • నీరు; 95.2 గ్రా.
  • ప్రొటీన్: 0.3 గ్రా.
  • క్రొవ్వు: 0.2 గ్రామ్ ..
  • పీచు: 0.4 గ్రా.
  • కెరోటిన్ 169 మైక్రో గ్రాం:
  • సి. విటమిన్: 26 మి.గ్రా:
  • కాల్షియం: 32 మి.గ్రా.
  • ఫాస్పరస్: 14 మి.గ్రా.
  • ఇనుము: 1.4 మి.గ్రా.
  • సోడియం: 204.8 మి.గ్రా.
  • పొటాషియం: 341 మి.గ్రా.
  • శక్తి: 17 కిలో కాలరీలు.

మూలాలు

[మార్చు]

1. Daniel Zohary & Maria Hopf (2000). Domestication of Plants in the Old World (3 ed.). Oxford University Press. p. 193.

2. "Citrullus lanatus (Thunb.) Matsum. & Nakai". Grassland Species Profiles. FAO.

3. "What is a casaba melon?". WiseGeek. Retrieved 2014-10-20.

4. Linda Ziedrich (2010). The Joy of Jams, Jellies and Other Sweet Preserves: 200 Classic and Contemporary Recipes Showcasing the Fabulous Flavors of Fresh Fruits (Easyread Large Edition). ReadHowYouWant.com. p. 116. ISBN 1-4587-6483-4. Retrieved 2014-10-20.

  • Mabberley, D.J. (1987). The Plant Book. A portable dictionary of the higher plants. Cambridge University Press. p. 706. ISBN 0-521-34060-8. Retrieved 2014-10-20.
  • Magness, J.R., G.M. Markle, C.C. Compton (1971). "Food and feed crops of the United States". IR Bulletin. New Jersey Agricultural Experiment Station. 1 (828). OL 14117370M. Interregional Research Project IR-4

మూస:Melons

"https://te.wikipedia.org/w/index.php?title=కర్బూజ&oldid=4299583" నుండి వెలికితీశారు