Jump to content

కర్మాగారం

వికీపీడియా నుండి
(కర్మాగారము నుండి దారిమార్పు చెందింది)
కర్మాగారం -1
కర్మాగారం -2

కర్మాగారం (ఆంగ్లం: factory), అనేది ఒక పారిశ్రామిక ప్రదేశంలో,లేదా ఏదేని ఒక ప్రాంతంలో కొంతమంది పనివారు లేదా కార్మికులతో వ్యాపారార్థం వస్తువులను ఉత్పత్తి చేయటానికి ఉపయోగించే ఇల్లు లేదా భవనం.[1] దీనిని కర్మాగారం, పరిశ్రమాలయం, యంత్రాగారం, కార్ఖనా అని అంటారు.కొన్ని దేశాలలో ఫ్యాక్టరీ భవనాన్ని "షెడ్" అని పిలవడం సాధారణం.[2] కర్మాగారంగా ఉపయోగించే భవనాలు,లేదా సాధారణంగా అనేక భవనాలను కలిగి ఉన్న సముదాయంలో సాధారణంగా భారీ యంత్రాలను కలిగి ఉంటుంది.[3][4]

పరికరాల అవసరాలుకు బాగా అంతరం ఏర్పడినప్పుడు, పారిశ్రామిక విప్లవం సందర్భంగా కుటీర పరిశ్రమకు లేదా వర్క్‌షాపులకు మూలధనం సదుపాయంతో కర్మాగారాలు చాలా ఎక్కువుగా పుట్టుకొచ్చాయి.ఒకటి లేదా రెండు స్పిన్నింగ్ మ్యూల్స్ వంటి చిన్న మొత్తంలో యంత్రాలను కలిగి ఉన్న ప్రారంభ కర్మాగారాలు డజను కంటే తక్కువ మంది కార్మికులను " గ్లోరిఫైడ్ వర్క్‌షాప్‌లు " అని పిలుస్తారు.

మిల్లు అనే పదాన్ని మొదట ధాన్యం మరబెట్టే యంత్రాలుకలిగిన దానికి " మిల్లింగ్ " అని వాడారు.19 వ శతాబ్దంలో స్పిన్నింగ్, నేత, ఐరన్ రోలింగ్, కాగితం తయారీ వంటి అనేక ప్రక్రియలు మొదట ఆవిరి శక్తి, పవన శక్తి ద్వారా నడిచేవి కాబట్టి, మిల్లు అనే పదంతో స్టీల్ మిల్లు, పేపర్ మిల్లు అని వాడబడింది

భారత దేశంలో మొదటగా 1949 ఏప్రియల్ 1 నుండి ప్యాక్టరీల చట్టం-1948 అమలులోకి వచ్చింది.[1]

ఆధునిక కర్మాగారాలు

[మార్చు]

ఆధునిక కర్మాగారాల్లో వస్తువులు తయారుచేయటానికి కర్మాగారానికి అవసరమైనట్లుగా గిడ్డంగులు ఉంటాయి.వీటిలో ఉత్పత్తిని తయారుచేయటానికి భారీ యంత్ర పరకరాలు అమర్చబడి ఉంటాయి.పెద్ద కర్మాగారాలకు అవసరమైన బహుళ రవాణా మార్గాల ప్రాధాన్యత ప్రాప్యత కలిగివుంటాయి. కొన్ని రైలు, హైవే, నీటి సరఫరా,దిగుమతి సదుపాయాలను కలిగి ఉంటాయి. విభిన్నమైన ఉత్పత్తులు రసాయనాలు, కాగితం గుజ్జు, చమురు శుద్ధిలాంటి, అవి తయారుచేసే ఉత్పత్తులనుబట్టి కొన్ని రకాలు కర్మాగారాలు నిరంతరం పనిచేస్తాయి.

కర్మాగారాల రకాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2020-05-11. Retrieved 2020-07-20.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-03-10. Retrieved 2020-07-20.
  3. "Factory | Definition of Factory by Oxford Dictionary on Lexico.com also meaning of Factory". Lexico Dictionaries | English (in ఇంగ్లీష్). Retrieved 2020-07-20.[permanent dead link]
  4. "FACTORY | meaning in the Cambridge English Dictionary". dictionary.cambridge.org (in ఇంగ్లీష్). Retrieved 2020-07-20.

వెలుపలి లంకెలు

[మార్చు]