కర్రె మస్తానమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్రె మస్తానమ్మ
ఈము గుడ్డుతో మస్తానమ్మ
జననం
కర్రె మస్తానమ్మ

(1911-04-10)1911 ఏప్రిల్ 10
ఆంధ్రప్రదేశ్[1]
మరణం2018 డిసెంబరు 2(2018-12-02) (వయసు 107)
పౌరసత్వం British Indian (1911-1947)
 Indian Dominion (1947-1950)
 Indian (1950-2018)
వృత్తి
  • Cooking
క్రియాశీల సంవత్సరాలు2016-2018
సుపరిచితుడు/
సుపరిచితురాలు
Indian cuisine
గుర్తించదగిన సేవలు
Baingan bharta

కర్రె మస్తానమ్మ (1911 ఏప్రిల్ 10[2] [3]-2018 డిసెంబరు 3) భారతీయ యూట్యూబరు. ప్రముఖ చెఫ్‌గా యూట్యూబులో ఆమెను లక్షల మంది అనుసరించేవారు.[4] 2018లో ఆమె మరణించే సమయానికి, ఆమెకు యూట్యూబ్లో 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. [5] గ్రామీణ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆమెకు సాంకేతిక పరిజ్ఞానం లేదు, ప్రాథమిక విద్య మాత్రమే చదివింది. 2016 లో ఆమె మనవడు చిత్రీకరించిన మస్తానమ్మ వీడియో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. ఆమె 2018 డిసెంబర్ 3 న గుంటూరు జిల్లాలో తెనాలి సమీపంలోని తన స్వగ్రామమైన గుడివాడలో మరణించింది. ఆమె మరణించే సమయానికి, ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన యూట్యూబరు. కంట్రీ ఫుడ్స్ అనే ఆమె ఛానెలుకు 15 లక్షలకు పైగా చందాదారులు ఉన్నారు.

ప్రసిద్ది[మార్చు]

మస్తానమ్మ యూట్యూబరుగా ప్రసిద్ధి చెందింది. ఆమె శాకాహార మాంసాహార వంటకాలు రెండూ వండేది. మస్తానమ్మ వంటకాల్లో అత్యంత ప్రసిద్ధి గాంచిన వంటకం, పుచ్చకాయ చికెన్. ఆ వీడియోకు కోటీ 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈము పక్షి మాంసం కూర ఆమె ప్రసిద్ధ వంటకాల్లో మరొకటి.

మీ అభిమానులకు మీరిచ్చే సందేశం ఏమిటని బీబీసీ నిరుడు ఒక ఇంటర్వ్యూలో మస్తానమ్మను అడగ్గా- ''బాగా కూరలు వండుకొని, సుబ్బరంగా తినండి'' అని పెద్దగా నవ్వుతూ చెప్పారు.[6]

మూలాలు[మార్చు]

  1. Schultz, Kai (December 6, 2018). "World's Oldest Celebrity Chef, an Indian Great-Grandma, Dies at 107". The New York Times. Retrieved January 14, 2021.
  2. "This 106-Year-Old Cook From Andhra Pradesh Is a YouTube Sensation With Over 5 Lakh Subscribers!". The Better India. 16 July 2017.
  3. Iyer, Lalita (6 May 2017). "Meet 106-year-old Mastanamma, India's latest YouTube sensation". The Week. Retrieved 1 February 2019.
  4. "Mastanamma: The Centenarian who became a YouTube-cookery sensation". The Independent. 6 December 2018.
  5. "Karre Mastanamma obituary". 15 December 2018 – via www.thetimes.co.uk.
  6. "'యూట్యూబ్' వంటకాల సంచలనం మస్తానమ్మ కన్నుమూత". BBC News తెలుగు. Archived from the original on 2023-06-20. Retrieved 2024-04-19.