కర్ర పెండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కర్ర పెండలము దుంప

కర్ర పెండలం ఆహారంగా వాడే ఒక దుంప. మన రాష్ట్రంలో ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతాలలో, తీరప్రాంతాలలో పండుతుంది. దీనినుండి సగ్గుబియ్యం తయారు చేస్తారు. సగ్గు బియ్యం తయారికి ముడి సరుకు కర్ర పెండలమ. దీన్ని భూమి నుండి త్రవ్వి బయటకు తీసిన 24 గంటల లోపు సగ్గు బియ్యం తయారీ కేంద్రానికి చేర్చాలి. ఆ దుంపలను నీటిలో బాగా శుభ్రంచేసి దానిపై నున్న తొక్కను యంత్రాలతో తొలిగిస్తారు. గతంలో ఈపనిని స్త్రీలు చేసే వారు. తొక్క తీసిన దుంపలను మరొక్కసారి నీళ్ళలో శుభ్ర పరుస్తారు. అప్పుడు ఆ దుంపలను క్రషర్ లో పెట్టి పాలను తీస్తారు. చెరుకు నుండి చెరుకు రసాన్ని తీసే పద్ధతిలోనే ఈ దుంపలనుండి పాలను తీస్తారు. దుంపల నుండి వచ్చిన పాలు ఫిల్టర్ లలోనికి, అక్కడి నుండి సర్క్యులేటింగ్ చానల్స్ లోనికి వెళతాయి. ఈ క్రమంలో - పాల లోని చిక్కని పదార్థం ముద్దలా ఉంటుంది. దానితోనే సగ్గు బియ్యం తయారు చేస్తారు. ఈ పిండిని వివిధ రకాల పరిమాణంలో రంద్రాలున్న జల్లెడ లాంటి పాత్రలోకి వెళుతుంది. ఆ జల్లెడ అటు ఇటు కదులు తున్నందున ఆ జల్లెడ రంద్రాలనుండి తెల్లటి బాల్సు జల జలా రాలి పడతాయి. అప్పుడు అవి మెత్తగా వుంటాయి. వాటిని పెద్ద పెనం మీద వేడి చేస్తారు. ఆ తరువాత వాటిని ఆరుబయట ఎండలో ఆర బెడతారు. ఇలా సుమారు 500 కిలోల దుంపల నుండి 100 కిలోల సగ్గు బియ్యం మాత్రమే తయారవుతాయి. ఇది సగ్గు బియ్యం తయారీ విధానం. సగ్గు బియ్యం అనగానే అదే ఒక పంట నుండి వచ్చినదని లేదా మొక్కలకు పండుతుందని అనుకుంటారు చాలమంది. అది కేవలము పరిశ్రమలలో తయారైనది. ఈ సగ్గు బియ్యాన్ని దేశ వ్వాప్తంగా అనేక వంటకాలలో వాడు తుంటారు. కాని సగ్గు బియ్యం తయారయ్యెది కేవలం మూడు రాష్ట్రాలలోనె. మొత్తం ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రంలో 70 శాతం. మిగతా 30 శాతం కేరళ, ఆంధ్రప్రదేశ్ లది. ఆంధ్రప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లాలో సామర్లకోటకు చుట్టు పక్కల సుమారు ఇరవై అయి కిలోమీటర్ల పరిధిలో మొత్తం 40 సగ్గు బియ్యం తయారి మిల్లులున్నాయి. తమిళ నాడులో సుమారు 500 మిల్లులున్నాయి.

కర్ర పెండలం దుంప, చీమపెండలం దుంప .

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి . ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం. ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. కర్ర పెండలము ఆహారంగా వాడే ఒక దుంప. ఇది root and tuber crops family చెందినది. మన రాష్ట్రంలో ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతాలలో, తీరప్రాంతాలలో పండుతుంది. దీనినుండి సగ్గుబియ్యం తయారు చేస్తారు. మొదటిగా దీనిని దక్షిణ అమెరికా సాగుచేయబదినది.

కర్ర పెండలం వాడే విదానం:

[మార్చు]

1. ఆహార-గ్రేడ్ Tapioca స్టార్ట్ ఆహారం, కాండీ ఇండస్ట్రీస్ ఉపయోగిస్తారు, 2. గ్లూ, అంటుకునే ఇండస్ట్రీస్, పిండి పదార్ధాలు ఉత్పన్న, చివరి మార్పు పిండి పరిశ్రమలలో ఉపయోగిస్తారు, 3. పెట్ ఫుడ్ ఇండస్ట్రీస్ fillers గా cassava పిండి ఉపయోగం, 4. చేపలు Feed ఇండస్ట్రీ, 5. కాగితం, పేపర్ శంఖం పరిశ్రమలు, 6. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ కోన్ తయారీదారులు, 7. అల్యూమినియం, కాస్ట్ ఇనుము Foundries అచ్చులను చేయడానికి ఒక ఇసుక బైండర్నుగా పిండి ఉపయోగం, 8. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మాత్రలు బైండ్ వరకు పిండి, ఉత్పన్నాల ఉపయోగం, ఒక వ్యాప్తి agent గా, 9. సౌందర్య, డిటర్జెంట్స్, సోప్ ఇండస్ట్రీస్, 10. తినదగిన మసాలా పౌడర్ తయారీదారులు, 11. Cassava స్టార్ట్ వ్యుత్పన్నాలు పరిశ్రమలు, 12. పొడి బ్యాటరీ సెల్ పరిశ్రమలు పూరకంగా Tapioca స్టార్ట్ ఉపయోగం, 13. రబ్బరు, ఫోమ్ పరిశ్రమలు, 14. వస్త్ర పరిశ్రమలు వినియోగం స్టార్ట్, 15. చెక్కపలక- Plywood, 16. కిణ్వనం ఇండస్ట్రీ (ఎంజైములు, బీర్),

పోషక విలువలు:

[మార్చు]

ప్రధానముగా పిండిపదార్ధ మే ఉంటుంది . ప్రతి 100 గ్రాములలో:

  • శక్తి = 544 కేలరీలు
  • కొలెస్టిరాల్ - చాలాతక్కువ
  • సాచ్యురేటెడ్ కొవ్వులు - చాలా తక్కువ
  • సోడియం - చాలా తక్కువ
  • విటమిన్‌ B9—6.1 మి.గా
  • ఇనుము = 2.4 మి.గ్రా
  • కాల్సియం = 30.4 మి.గ్రా
  • ఒమేగా 3 ఫాటీయాసిడ్స్ = 1.5 మి.గ్రా
  • ఒమేగా 6 ఫాటీయాసిడ్స్ = 3.0 మి.గ్రా
  • పీచు పదార్ధము = 1000 మి.గ్రా ( 1 గ్రాము )
ఇతర ప్రధాన ముఖ్యాహారాలతో కర్ర పెండలం (cassava) పోలిక
సంగ్రహం/కూర్పు
ప్రతిభాగం (100గ్రా) కు
కర్ర పెండలం
పరిమాణం
గోధుమ
మొత్తం
బియ్యం
మొత్తం
మొక్కజొన్న
మొత్తం
ఆలుగడ్డ
మొత్తం
నీరు (గ్రా) 6 11 12 76 82
శక్తి (kJ) 667 1506 1527 360 288
ప్రోటీన్ (గ్రా) 1,4 23 7 3 1,7
కొవ్వు (గ్రా) 0,3 10 1 1 0,1
పిండిపదార్ధాలు (గ్రా) 38 52 79 19 16
ఫైబర్ (గ్రా) 1,8 13 1 3 2.4
చక్కెరలు (గ్రా) 1.7 < 0.1 > 0.1 3 1.2
ఇనుము (మి.గ్రా) 0,27 6,3 0,8 0,5 0.5
మాంగనీస్ (మి.గ్రా) 0.4 13.3 1.1 0.2 0.1
కాల్షియం (మి.గ్రా) 16 39 28 2 9
మెగ్నీషియం (మి.గ్రా) 21 239 25 37 21
ఫాస్ఫరస్ (మి.గ్రా) 27 842 115 89 62
పొటాషియం (మి.గ్రా) 271 892 115 270 407
జింక్ (మి.గ్రా) 0.3 12.3 1.1 0.5 0.3
పాంటోథీనిక్ ఆమ్లం (మి.గ్రా) 0.1 2.3 1.0 0.7 0.3
విటమిన్ B6 (మి.గ్రా) 0.1 1.3 0.2 0.1 0.2
ఫోలేట్ (మైక్రో గ్రాములు) 27 281 8 42 18
థయామిన్ (మి.గ్రా) 0.1 1.9 0.1 0.2 0.1
రిబోఫ్లావిన్ (మి.గ్రా) < 0.1 0.5 > 0.1 0.1 > 0.1
నియాసిన్ (మి.గ్రా) 0.9 6.8 1.6 1.8 1.1

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]