కల్పన కన్నబిరాన్
కల్పనా కన్నబిరాన్ | |
---|---|
జననం | 1961 డిసెంబరు 1 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్ |
తల్లిదండ్రులు |
|
కల్పన కన్నబిరాన్ (1961 డిసెంబరు 1) తెలంగాణలోని హైదరాబాద్‌కు చెందిన భారతీయ సామాజిక శాస్త్రవేత్త, న్యాయవాది, మానవ హక్కుల కాలమిస్ట్, రచయిత, సంపాదకురాలు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ద్వారా గుర్తింపు పొందిన పరిశోధనా సంస్థ సదరన్ రీజనల్ సెంటర్, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్‌లో ప్రొఫెసర్, రీజినల్ డైరెక్టర్ పదవి నుండి ఆమె 2021 మార్చిలో పదవీ విరమణ చేసింది.
ఆమె హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటీ ఆఫ్ లా వ్యవస్థాపక అధ్యాపకురాలు. 1991లో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అనే మహిళా హక్కుల సంఘం సహ వ్యవస్థాపకురాలు. ఆమె 2020 జనవరిలో కామన్వెల్త్ ఫౌండేషన్, లండన్ ద్వారా రెండు సంవత్సరాల కాలానికి సివిల్ సొసైటీ అడ్వైజరీ గవర్నర్‌గా నామినేట్ చేయబడింది. ప్రస్తుతం ఆమె కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్‌మెంట్‌లో సంచాలకులుగా పనిచేస్తోంది. ఆమె జెండర్ స్టడీస్, క్రిమినల్ లా విభాగంలో విస్తృత అధ్యయనం, పరిశోధనలు చేయడం ద్వారా ప్రసిద్ధిచెందింది.[1]
ఆమె జాతీయ పత్రికలు, ఆన్‌లైన్ మ్యాగజైన్‌లు, బ్లాగులకు క్రమం తప్పకుండా రచనలు చేయడంతో పాటు ఇరవై ఒక్క పుస్తకాలు రచించింది.[2][3][4]
కల్పన కన్నబిరాన్ ప్రతినిత్యం సామాజిక ఉద్యమాలు, వికలాంగ హక్కులు, హింస, లింగ వివక్ష, కులం, ఆదివాసీ హక్కులు, సమానత్వం వంటి వాటిపైన పోరాడుతూనే ఉంటుంది.
విద్యాభ్యాసం
[మార్చు]యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ నుండి సోషియాలజీలో కల్పనా కన్నబిరాన్ 1983లో ఎం.ఏ, 1985లో ఎం.ఫిల్ పూర్తి చేసింది.[5] హైదరాబాదులోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్[6] నుండి 1981లో రష్యన్‌లో డిప్లొమా, 1982లో అడ్వాన్స్‌డ్ డిప్లొమా పొందింది.
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో 1993లో పీహెచ్‌డీ పట్టా పొందింది. ఆమె ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్ ఆఫ్ లా నుండి న్యాయశాస్త్రంలో ఎల్.ఎల్.ఎం కూడా పూర్తిచేసింది.[7]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ప్రముఖ పౌర హక్కుల న్యాయవాది కె.జి. కన్నబిరాన్ ముగ్గురు సంతానంలో కల్పనా కన్నబిరాన్ రెండవది. ఆమె తల్లి వసంత్ కన్నబిరాన్ స్త్రీవాద కవి, రచయిత, ప్రపంచవ్యాప్తంగా 2005లో నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయబడిన 1000 మంది మహిళల్లో ఒకరు.[8]
కల్పన కన్నబిరాన్ సోదరి డాక్టర్ చిత్ర కన్నబిరాన్ హైదరాబాద్‌లో మాలిక్యులర్ బయాలజిస్ట్.[9] ఆమె సోదరుడు అరవింద్ కన్నబిరాన్ బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన సినిమాటోగ్రాఫర్.[10]
ఆమె కమ్యూనికేషన్ల నిపుణుడైన రాజ్ మోహన్ తెల్లాను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[11]
పురస్కారాలు
[మార్చు]- 1992–93లో రాక్‌ఫెల్లర్ హ్యూమనిస్ట్-ఇన్-రెసిడెన్స్ ఫెలోషిప్, ఉమెన్స్ స్టడీస్ ప్రోగ్రామ్, హంటర్ కాలేజ్, సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్.[12]
- సోషల్ యాస్పెక్ట్స్ ఆఫ్ లా విషయంలో ఆమె కృషికి వి.కె.ఆర్.వి. 2003 సంవత్సరానికి ఇన్‌స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ అందించిన సోషల్ సైన్సెస్‌లో రావు ప్రైజ్.[13]
- 2012లో విశిష్ట సామాజిక శాస్త్రవేత్తలకు అమర్త్యసేన్ పురస్కారం.[14]
- ఇంటర్నేషనల్ నెట్‌వర్క్ ఆఫ్ జెనోసైడ్ స్కాలర్స్ [INoGS] ద్వారా 2022 ఇంపాక్ట్ అవార్డు.[15][16]
మూలాలు
[మార్చు]- ↑ "స్వతంత్ర భారతంలోనూ లింగవివక్ష". web.archive.org. 2023-02-23. Archived from the original on 2023-02-23. Retrieved 2023-02-23.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Books – Kalpana Kannabiran" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-23.
- ↑ "Essays – Kalpana Kannabiran" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-08-23. Retrieved 2021-08-23.
- ↑ "Media – Kalpana Kannabiran" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-23.
- ↑ "University of Hyderabad | India's Institution of Eminence" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-23.
- ↑ "EFLU". efluniversity.ac.in. Retrieved 2021-08-23.
- ↑ "Post Graduate College of Law". osmania.ac.in. Retrieved 2021-08-23.
- ↑ "Vasanth Kannabiran (India)". wikipeacewomen.org. Retrieved 2021-08-23.
- ↑ "LV Prasad Eye Institute - Our Team". lvpei.org. Retrieved 2021-08-23.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Arvind Kannabiran". School of Media Studies (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-23.
- ↑ "Dr Raj Mohan Tella". LinkedIn.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Rockefeller Humanist-in-Residence Fellowship, 1992-93 – Kalpana Kannabiran" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-08-23. Retrieved 2021-08-23.
- ↑ "VKRV Rao Prize". isec.ac.in. Archived from the original on 2010-03-03. Retrieved 2021-08-23.
- ↑ "Six social scientists get first Amartya Sen awards". The Indian Express (in ఇంగ్లీష్). 2013-05-07. Retrieved 2021-08-23.
- ↑ "Awards : Who We Are : International Network of Genocide Scholars". inogs.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-10.
- ↑ "Mission & History : Who We Are : International Network of Genocide Scholars". inogs.com (in ఇంగ్లీష్). Retrieved 2022-07-10.