Jump to content

కల్యాణం కానున్నది కన్నె జానకికి

వికీపీడియా నుండి

ఈ పాట సౌందర్య, సాయికుమార్ లపై చిత్రీకరించారు. చిత్రంలో వాళ్ళిద్దరి పెళ్ళి ఈ పాటలు సందర్భం. దీనిని రచించినది సిరివెన్నెల సీతారామశాస్త్రి.

కె.ఎస్.చిత్ర పాడగా ఇళయరాజా సంగీతం అందించారు. <poem> కల్యాణం కానుంది కన్నె జానకికీ.. వైభోగం రానుంది రామచంద్రుడికీ.. దేవతలే దిగి రావాలి.. జరిగే వేడుకకీ.. రావమ్మా సీతమ్మా.. సిగ్గు దొంతరలో.. రావయ్యా రామయ్యా.. పెళ్ళి శోభలతో..

వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా.. వర్షంలో తడిసే సంద్రంలాగా.. ఊరేగే పువ్వుల్లో.. చెలరేగే నవ్వుల్లో.. అంతా సౌందర్యమే.. అన్నీ నీ కోసమే..! వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా.. వర్షంలో తడిసే సంద్రంలాగా..

నాలో ఎన్ని ఆశలో.. అలల్లా పొంగుతున్నవీ.. నీతో ఎన్ని చెప్పినా.. మరెన్నో మిగులుతున్నవీ.. కళ్ళల్లోనే వాలి.. నీలాకాశం అంతా.. ఎలా ఒదిగిందో.. ఆ గగనాన్ని ఏలే పున్నమి రాజు.. ఎదలో ఎలా వాలాడో.. నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి.. చూస్తూనే నిజమై.. అవి ఎదటే నిలిచాయి.. అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంగా..!!

వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా.. వర్షంలో తడిసే సంద్రంలాగా..

ఇట్టే కరుగుతున్నదీ.. మహా ప్రియమైన ఈ క్షణం.. వెనుకకు తిరగనన్నదీ.. ఎలా కాలాన్ని ఆపడం.. వదిలామంటే నేడు.. తీయని స్మృతిగా మారి.. ఎటో పోతుందీ.. కావాలంటే చూడు.. ఈ ఆనందం.. మనతో తనూ వస్తుందీ.. ఈ హాయి అంతా మహా భద్రంగా దాచి.. పాపాయి చేసి.. నా ప్రాణాలే పోసి.. నూరేళ్ళ కానుకల్లే.. నీ చేతికీయలేనా..!!

ఆకాశం అంతఃపురమయ్యింది.. నాకోసం అందిన వరమయ్యింది.. రావమ్మా మహారాణీ.. ఏలమ్మా కాలాన్నీ.. అందీ ఈ లోకమే.. అంతా సౌందర్యమే..!! ఆకాశం అంతఃపురమయ్యింది.. నాకోసం అందిన వరమయ్యింది..